చిన్న‌ప్పుడే తండ్రి చ‌నిపోయాడు…ఎన్నో క‌ష్టాల‌ను ఓపిక‌గా భ‌రించింది…చివ‌ర‌కు IPS అయ్యింది.

ప‌ట్టుద‌ల‌, సంక‌ల్పం, అంకిత భావం, ఆత్మ‌విశ్వాసం… వంటివి మెండుగా ఉంటే చాలు, ఎన్ని క‌ష్టాలు ఎదురైనా అవి ఏమీ చేయ‌లేవు. ల‌క్ష్య‌సాధన దిశ‌గా కొన‌సాగే వారిని ఆప‌లేవు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని వంట బ‌ట్టించుకుంది ఆమె. అందుకే త‌మ రాష్ట్రంలోనే మొద‌టి మ‌హిళా ఐపీఎస్ ఆఫీస‌ర్ అయింది. అలా అయ్యే క్రమంలోనే ఎన్నో అవార్డులు, రివార్డుల‌ను అందుకుంది. దీంతో ఆమె ఇత‌ర మ‌హిళ‌ల‌కు ప్రేర‌ణగా నిలిచింది. ఆమే… సిక్కింకు చెందిన 28 ఏళ్ల‌ అప‌రాజితా రాయ్‌..!

aparajitha-rai-1

గ్యానేంద్ర రాయ్‌, రోమా రాయ్‌ల కుమార్తె అపరాజితా రాయ్‌. తండ్రి చనిపోయాడు. అయినా… త‌ల్లి ప్రోత్సాహం… స్వ‌శక్తితో అప‌రాజితా రాయ్ క‌ష్ట ప‌డి చ‌దివింది. ఆ క్ర‌మంలోనే 2011-12 యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో త‌న సత్తా చాటింది. ఆలిండియా వ్యాప్తంగా 358 ర్యాంకును సాధించింది. దీంతో ఆమెకు ఐపీఎస్ లో సీటు వ‌చ్చింది. అలా ఆమె 2012 ఐపీఎస్ క్యాడ‌ర్‌కు సెలెక్ట్ అయింది. అయితే ఐపీఎస్ ఆఫీస‌ర్ ట్రెయినింగ్ తీసుకుంటున్న స‌మ‌యంలోనే అప‌రాజితా రాయ్‌కు ఎన్నో అవార్డులు వ‌చ్చాయి.

బెస్ట్ లేడీ ఔట్‌డోర్ ప్రొబేష‌న‌ర్‌గా 1958 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్స్ ట్రోఫీ, ఫీల్డ్ కోంబ్యాట్‌లో ఉమేష్ చంద్ర ట్రోఫీ, బెస్ట్ ట‌ర్న‌వుట్‌లో 55వ బ్యాచ్ సీనియ‌ర్ కోర్స్ ఆఫీస‌ర్స్ ట్రోఫీ, వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం నుంచి ట్రోఫీల‌ను అప‌రాజితా రాయ్ అందుకుంది. అనంత‌రం ఆమెకు వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లిలో పోస్టింగ్ ల‌భించ‌గా అక్క‌డే విధులు నిర్వ‌హిస్తోంది. అప‌రాజితా రాయ్ 2009 బ్యాచ్‌కు చెందిన బీఏ ఎల్ఎల్‌బీ (హాన‌ర్స్‌) విద్యార్థిని. ఆమె వెస్ట్‌బెంగాల్‌లోని నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జ్యురిడిక‌ల్ లో చ‌దువుకుంది. ఇప్పుడిలా సిక్కింలోనే తొలి మ‌హిళా ఐపీఎస్ ఆఫీస‌ర్ అయి రికార్డు సృష్టించింది. ఇక ఆమె త‌న కెరీర్‌లోనూ అప్ర‌తిహ‌తంగా దూసుకెళ్లాల‌ని ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top