ఒకే దేశం ఒకే పన్ను తో ప్రారంభమైన జిఎస్ టి ని కొందరు ఆహ్వానిస్తున్నారు..కొందరు వ్యతిరేకిస్తున్నారు… జిఎస్ టి వల్ల లాభనష్టాలు ఏంటా అని ఒకవైపు చర్చ నడుస్తుంటే మరోవైపు దేశంలో జీఎస్టీ అమలైన క్షణంలోనే.. సరిగ్గా శుక్రవారం అర్ధరాత్రి 12.02 గంటలకు పుట్టిన తన బిడ్డకు జిఎస్ టి అని పేరు పెడతా అని .. కొడుకుతో సెల్ఫీ తీసుకుని మురిసిపోతుందీ రాజస్థానీ మహిళ.
గతంలో స్కైలాబ్ పడినప్పుడు స్కైలాబ్ రెడ్డి,స్కైలాబ్ రాణి అని తమ పిల్లలకు పేర్లు పెట్టుకున్న ఘటనలు చూసాం… ఇందిరా గాంధి చనిపోయినప్పుడు పుట్టిన తమ పిల్లలకు ఇందిర పేరు కలిసేలా పేర్లు పెట్టుకున్నవారు ఉన్నారు… ప్రాంతాల మీద అభిమానంతో పిల్లలకు పేర్లు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు… ఇప్పుడు ఈ జిఎస్ టి బేబీ కూడా వాటి కోవల్లోకే వెళ్లింది…