అదేంటీ… విమానాల్లో ఉన్నప్పుడు నీటిని తాగరాదా..? ఎందుకు..? అసలు నీటిని తాగకుండా ఎలా ఉండగలం. గంట, రెండు గంటలు అయితే ఓకే. కానీ… సుదీర్ఘ ప్రయాణం చేసినప్పుడు కచ్చితంగా నీరు తాగాల్సి వస్తుంది కదా..! అప్పుడెలా..? అంటే.. అవును, తాగాలి. కానీ, విమానంలో ఉన్న నీరు కాదు, మీరు తెచ్చుకున్న నీరు. అవును, విమాన ప్రయాణానికి ముందే వీలున్నన్ని వాటర్ బాటిల్స్‌ను కొని వెంట తీసుకెళ్లండి. అసలిదంతా.. ఎందుకు..? విమానంలో ఉండే నీటిని తాగవచ్చు కదా..! తాగితే ఏమవుతుంది..? అంటే… అవును, నిజంగా తాగకూడదు. ఆ నీటిని తాగితే అనారోగ్యాలకు స్వాగతం పలికినట్టేనట..!
విమాన ప్రయాణం చేసినప్పుడు మనం వెంట వాటర్ బాటిల్స్‌ను తీసుకెళ్లినా, లేకున్నా అందులో ఎలాగూ నీళ్లు ఉంటాయి కదా. అయితే అందులో ఉన్న నీటిని మనం తాగకూడదట. ఎందుకంటే 2013లో విమానాల్లో అందించే తాగునీటిని సైంటిస్టులు పరీక్షించారు. దీంతో తెలిసిందేమిటంటే… విమానాల్లో ఉండే నీటిలో అత్యధిక శాతం బాక్టీరియా, వైరస్లు ఉంటాయట. దీంతో ఆ నీటిని తాగితే ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు.
విమానంలో ఉండే ఎయిర్ హోస్ట్‌లు, ఫ్లైట్ అటెండెంట్స్‌కు తప్ప ఇతర సిబ్బందికి అసలు ఈ విషయం తెలియదట. ఈ క్రమంలో 2013లో ఓ ఎయిర్ హోస్టెస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆమె చెప్పింది నిజం అవునో, కాదో తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయోగాలు చేశారు. అయితే వారి ప్రయోగాలు ఆమె చెబుతున్నది నిజమే అని తేల్చాయి. ఈ క్రమంలోనే విమానాల్లో ప్రయాణం చేసే వారు అందులో అందించే నీటిని తాగకూడదని, ప్రయాణానికి ముందే వీలైనన్ని వాటర్ బాటిల్స్‌ను వెంట తీసుకెళ్లడం క్షేమమని చెబుతున్నారు. ఇక విమానాల్లో అందించే తాగునీటినే కాదు, అందులో సర్వ్ చేసే టీ, కాఫీలు, వండే ఫుడ్ ను కూడా అనుమానించాల్సిందేనని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిని తీసుకునే వారు కూడా ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. కానీ.. తాజాగా సోషల్ మీడియలో ఈ వార్త వైరల్ అవడంతో ఇప్పుడీ విషయం అనేక మంది వరకు చేరింది. ఇక విమానాల్లో పెట్టే ఫుడ్, ఇచ్చే నీళ్లను తాగాలంటే.. ఎవరైనా ఒక్కసారి ఆలోచించాల్సిందే..! అందుకే అంటారు, ఇంటి భోజనాన్ని మించింది లేదని..!