ఒలంపిక్ విజేత‌లు త‌మ మెడ‌ల్స్‌ను నోటితో ఎందుకు కొరుకుతారో తెలుసా..?

ఒలంపిక్స్‌… ఈ పేరు చెబితే చాలు, వాటికి ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. నాలుగేళ్లకోసారి వ‌చ్చే విశ్వ క్రీడా సంరంభం అది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది క్రీడాకారులు ఒలంపిక్స్‌లో స‌త్తా చాటి మెడ‌ల్స్‌ను సాధించాల‌ని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే అంద‌రూ త‌మ క‌ల‌ను సాకారం చేసుకోలేరు లెండి. అవి ప్ర‌తిభ‌, నైపుణ్యం, స‌త్తా ఉన్న క్రీడాకారుల‌నే వ‌రిస్తాయి, అది వేరే విష‌యం. అయితే ఒలంపిక్స్‌లో ఓట‌మి చెందిన వారి గురించి ప‌క్క‌న పెడితే గెలిచిన వారికి గోల్డ్‌, సిల్వ‌ర్, బ్రాంజ్ మెడ‌ల్స్ ఇస్తారు క‌దా, ఆ, అవును. అవే. అయితే అవి ఇచ్చిన‌ప్పుడు విజేతలు వాటిని నోటితో కొరుకుతూ పోజులిస్తారు. అది ఎందుకో తెలుసా..? తెలీదా..? అయితే ఎందుకో చూద్దాం ప‌దండి.

medal-biting

అది ఇప్ప‌టి మాట కాదు. ఒలంపిక్స్ ప్రారంభం అయిన నాటి మాట‌. అప్ప‌ట్లో ఒలంపిక్ క్రీడ‌ల్లో గెలిచిన వారికి మెడ‌ల్స్ ఇవ్వ‌గానే సాధార‌ణంగానే ఫొటోల‌కు ఫోజులు ఇచ్చేవారు. కానీ అలా పోజులివ్వ‌డంలో ఎలాంటి ఉత్సాహం, ఆస‌క్తి, కొత్త‌ద‌నం లేద‌ని భావించిన ఫొటోగ్రాఫ‌ర్లు కొంద‌రు ఒలంపిక్ విజేత‌ల‌ను త‌మ‌కు మెడ‌ల్స్ ఇవ్వ‌గానే వాటిని కొరుకుతూ ఫొటోల‌కు ఫోజులు ఇవ్వ‌మ‌న్నార‌ట‌. దీంతో ఆ క్రీడాకారులు అలాగే చేశారు. అది అంద‌రికీ న‌చ్చ‌డం, వింత‌గా ఉండ‌డంతో అప్ప‌టి నుంచి ఒలంపిక్ విజేత‌లు త‌మ మెడ‌ల్స్‌ను కొరుకుతూ ఫొటోల‌కు ఫోజులిస్తూ వ‌స్తున్నారు.

medal-biting

అయితే పైన చెప్పిందే కాకుండా, క్రీడాకారులు మెడ‌ల్స్‌ను కొర‌క‌డం వెనుక మ‌రో కార‌ణం కూడా ఉంద‌ని ప‌లువురు చెబుతున్నారు. అదేమిటంటే… అప్ప‌ట్లో ఒలంపిక్ విజేత‌ల‌కు ఇచ్చే గోల్డ్ మెడ‌ల్స్‌లో బంగారం ఎక్కువ‌గా ఉండేద‌ట‌. ఈ క్ర‌మంలో వారు బంగారం నాణ్య‌త‌ను ప‌రిశీలించేందుకు ఆ మెడ‌ల్స్‌ను కొరికేవార‌ట‌. ప్యూర్ గోల్డ్ అయితే మృదువుగా ఉంటుంది కాబ‌ట్టి మెడ‌ల్‌ను కొర‌క‌గానే దానిపై ప‌ళ్ల గుర్తులు ప‌డేవ‌ట‌. కాగా రాను రాను ఆ మెడ‌ల్స్‌లో బంగారం శాతం త‌గ్గిస్తూ వ‌చ్చే స‌రికి అస‌లు అందులో గోల్డ్ ఎంత ఉందో తెలుసుకోవ‌డం కోసం క్రీడాకారులు వాటిని కొరుకుతూ వ‌స్తున్నార‌ట‌. అలా కూడా మెడ‌ల్స్‌ను కొర‌క‌డం పాపుల‌ర్ అయింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. అదీ… ఒలంపిక్ విజేత‌లు మెడ‌ల్స్‌ను కొర‌క‌డం వెనుక ఉన్న అస‌లు విష‌యం.

Comments

comments

Share this post

scroll to top