ఆ 16 ఏళ్ల కుర్రాడు దేనికి బానిస అయ్యాడో తెలుసా..? అతని కడుపులో ఉన్నది చూసి డాక్టర్లు షాక్..!

ప్ర‌పంచంలో అనేక మందికి ర‌క ర‌కాల ఆహారాలు న‌చ్చుతాయి. కొంద‌రికి మాంసం అంటే ఇష్టం ఉంటే, కొంద‌రు వెజ్ వంట‌కాల‌ను ఎక్కువ‌గా తింటారు. ఇంకా కొంద‌రు స్వీట్ల‌ను, కొంద‌రు పండ్ల‌ను, కొంద‌రు చిరుతిండిని.. ఇలా ర‌క ర‌కాల ఆహారాల‌ను వ్య‌క్తులు త‌మ ఇష్టాల‌ను బ‌ట్టి తింటుంటారు. అయితే మీకు తెలుసా..? ఆ బాలుడికి ఇప్పుడు చెప్పిన ఆహారాల్లో ఏవీ ఇష్టం లేదు. మ‌రి అత‌ను ఏం తినేవాడో తెలుసా..? చెక్క‌, ప్లాస్టిక్‌, ర‌బ్బ‌ర్‌..! ఏంటీ.. షాక్ అయ్యారా..? అయినా మేం చెబుతోంది నిజ‌మే. అత‌ను అలా తిన‌డం వ‌ల్ల ఇప్పుడు అత‌ని జీర్ణాశ‌యంలో ఏకంగా 1 కిలో వ్య‌ర్థం జామ్ అయింది. దీంతో అత‌ను ప‌డుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

అది పంజాబ్‌. అక్క‌డ నివాసం ఉండే 16 ఏళ్ల అర్జున్ సాహ్ అనే బాలుడికి చిన్న‌ప్ప‌టి నుంచి రెగ్యుల‌ర్‌గా తినే ఆహారం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో అత‌ను వ‌స్తువులు ఏవి పడితే అవి కొరుక్కుని తినేవాడు. అయితే త‌ల్లిదండ్రులు ముందుగానే అది గుర్తించి అత‌నికి ఆ అల‌వాటును మాన్పించారు. అలా కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డిచాక అర్జున్ త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా చెక్క‌, ప్లాస్టిక్ ను తిన‌డం మొద‌లు పెట్టాడు. దీంతో కొన్ని రోజుల పాటు అలా తినేస‌రికి అత‌నికి క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి వ‌చ్చింది. ఏకంగా 15 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గాడు. ఈ క్ర‌మంలో షాక్‌కు గురైన త‌ల్లిదండ్రులు అస‌లు ఏమైంద‌ని తెలుసుకునేందుకు అర్జున్‌ను హాస్ప‌ట‌ల్‌కు తీసుకెళ్లారు.

అయితే హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్లు మొద‌ట అర్జున్‌కు అల్స‌ర్ వ‌చ్చింద‌ని భావించారు. కానీ ఎండోస్కోపీ చేశాక తెలిసింది. అత‌ని జీర్ణాశ‌యంలో 1 కిలో చెక్క‌, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఉన్నాయని. అవి ఎన్నో రోజులుగా అర్జున్ జీర్ణాశ‌యంలో బ్లాక్ అయ్యాయి. దీంతో అత‌ను నీరు తాగినా అది కింద‌కు పోవ‌డం క‌ష్టంగా మారింది. ఫ‌లితంగా అత‌ను ఏది తిన్నా, తాగినా తీవ్ర‌మైన క‌డుపునొప్పి అత‌నికి వ‌చ్చేది. దీంతో హాస్పిట‌ల్‌లో చేర్పించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. నిజానికి అర్జున్‌కు ఉన్న ఈ అడిక్ష‌న్‌ను Pica – a డిజార్డ‌ర్ అని పిలుస్తార‌ట‌. ఈ వ్యాధి ఉన్న వారు ఇలాగే త‌మ‌కు అందుబాటులో ఏ వ‌స్తువు ఉంటే దాన్ని తినేస్తార‌ట‌. అయితే అర్జున్ జీర్ణాశ‌యంలో ఉన్న 1 కిలో వ్య‌ర్థంలో 300 గ్రాముల వ‌ర‌కు వ్య‌ర్థాన్ని డాక్ట‌ర్లు వెలికి తీశారు. ఇంకా 700 గ్రాముల వ్య‌ర్థం అలాగే ఉంది. అందుకు గాను మ‌రిన్ని సర్జ‌రీలు చేయ‌నున్నారు..! ఏది ఏమైనా… ఈ స్థితి ఎవ‌రికీ రావ‌ద్దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top