ఏ వ్య‌క్తికి ఏ వ‌య‌స్సులో ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో ఇలా తెలుసుకోవ‌చ్చు..!

ల‌క్ అనేది జీవితంలో అంద‌రికీ క‌ల‌సి రాదు. కొంద‌రికే క‌ల‌సి వ‌స్తుంది. కొంద‌రైతే ఎప్పుడూ త‌మ‌కు అదృష్టం క‌ల‌సి రావ‌డం లేద‌ని, దుర‌దృష్టం వెంటాడుతుంద‌ని అనుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రైతే అందుకోసం ఏవైనా పూజ‌లు చేయ‌డ‌మో లేదంటే వేరే ఏవైనా ప్ర‌య‌త్నాలు చేయ‌డ‌మో చేస్తారు. అయితే… అలా కాకుండా ఎవ‌రికైనా వారు జ‌న్మించిన తేదీ, నెల‌, సంవ‌త్స‌రం ప్ర‌కారం వారికి జీవితంలో ఎప్పుడు ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో, ఎప్పుడు అదృష్ట‌వంతులుగా మారుతారో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. అందుకోసం ఏం చేయాలంటే… డెస్టినీ నంబ‌ర్‌ను లెక్కించాలి. అదెలాగంటే…

numerology-luck

పుట్టిన తేదీ ఉదాహ‌ర‌ణ‌కు… సెప్టెంబర్ 19, 1985 అనుకుందాం. అప్పుడు తేదీ 19, నెల 9, సంవ‌త్సరం 1985 క‌దా. ఈ క్ర‌మంలో 19 + 9 + 1985 ఈ మూడు సంఖ్య‌ల‌ను క‌ల‌పాలి. అప్పుడు 2013 వ‌స్తుంది. తిరిగి ఈ సంఖ్య‌లో ఉన్న అంకెల‌ను కూడా క‌ల‌పాలి. 2+0+1+3. మొత్తం 6 వ‌స్తుంది. ఇదే నంబ‌ర్ ఆ తేదీన పుట్టిన వారి డెస్టినీ నంబ‌ర్ అవుతుంది. ఈ క్ర‌మంలో డెస్టినీ నంబ‌ర్ ప్ర‌కారం ఎవ‌రికి ఏయే సంవ‌త్స‌రంలో ఉన్న‌ప్పుడు ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డెస్టినీ నంబ‌ర్ 1 వ‌చ్చిన వారికి 22, 34 సంవ‌త్స‌రాల్లో ల‌క్ క‌లసి వ‌స్తుంద‌ట‌. సూర్య గ్ర‌హం ప్ర‌భావం వ‌ల్ల వారు ఆ వ‌య‌స్సులో శుభ ఫ‌లితాల‌ను పొందుతార‌ట‌. అదృష్టం బాగా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. అనేక అవ‌కాశాలు త‌లుపు త‌డుతాయ‌ట‌.

2. డెస్టినీ నంబ‌ర్ 2 వ‌చ్చిన వారికి 24, 38 సంవ‌త్స‌రాల్లో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. చంద్రుడి ప్ర‌భావం వ‌ల్ల వీరికి ఆ వ‌య‌స్సులో మిక్కిలిగా ధ‌నం సిద్దిస్తుంద‌ట‌.

3. డెస్టినీ నంబ‌ర్లు 3, 5 వ‌చ్చిన వారికి 32వ సంవ‌త్స‌రంలో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో వారికి అనుకున్న‌వి నెర‌వేరుతాయి. బృహ‌స్ప‌తి, బుధ గ్ర‌హాల వ‌ల్ల వారికి అదృష్టం క‌లుగుతుంది.

4. డెస్టినీ నంబ‌ర్ 4 వ‌చ్చిన వారికి 36వ ఏట బాగుంటుంది. ఆ వ‌య‌స్సులో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. రాహువు ప్ర‌భావం వ‌ల్ల వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారు.

5. డెస్టినీ నంబ‌ర్ 6 వ‌చ్చిన వారికి 25, 27, 32వ ఏట బాగుంటుంది. అప్పుడు వారు అనుకున్న‌ది సాధిస్తారు. అన్నీ శుభ ఫ‌లితాలే క‌లుగుతాయి.

6. డెస్టినీ నంబ‌ర్ 7 వ‌చ్చిన వారికి 20, 30, 38, 44వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో వారు విజ‌యావ‌కాశాల‌ను చ‌వి చూస్తారు. విజ‌యం సిద్దిస్తుంది.

7. డెస్టినీ నంబ‌ర్ 8 వ‌చ్చిన వారికి 36, 42వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. శ‌ని ప్ర‌భావం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.

8. డెస్టినీ నంబ‌ర్ 9 వ‌స్తే వారికి 28వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌చ్చి బాగుంటారు. కుజుని ప్ర‌భావం వ‌ల్ల పేరు, ప్ర‌ఖ్యాతులు సాధిస్తారు. శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.

Comments

comments

Share this post

scroll to top