ముక్కు లేని యువ‌తికి, ఓ యువ‌కుడికి మ‌ధ్య జ‌రిగిన రియ‌ల్ ల‌వ్ స్టోరీ..!

డ‌బ్బు, అందం, ఇత‌ర గుణ గ‌ణాలు… ఇవ‌న్నీ ఉన్న‌ప్ప‌టికీ నేటి త‌రం ప్రేమికులు చాలా మందిలో నిజ‌మైన ప్రేమ ఉండ‌డం లేదు. అదంతా పైపైన ఆకర్ష‌ణ‌గానే నిలుస్తోంది త‌ప్ప అస‌లైన ప్రేమ ఉన్న ప్రేమికులు దాదాపుగా అరుదుగా ఉంటార‌నే చెప్ప‌వ‌చ్చు. అదిగో… ఇప్ప‌డు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ అరుదైన జంట గురించే. ఎందుకంటే వారిది నిజ‌మైన ప్రేమ కాబ‌ట్టి. అవును మ‌రి. వారి క‌థ వింటే మీరు కూడా అదే మాట అంటారు. ఇక వారి అంద‌మైన ల‌వ్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..!


ఆమె పేరు షు కిన్‌కిన్‌. చైనా వాసి. ఆమెకు నెల రోజుల వ‌య‌స్సున్న‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న అది. షు కిన్ కిన్‌ను ఆమె త‌ల్లి ఇంట్లో ఓ ఉయ్యాలలో వేసి ప‌నికి బ‌యటికి వెళ్లింది. అయితే ఆమె తిరిగి వ‌చ్చేట‌ప్ప‌టికి కిన్ కిన్ ముఖ‌మంతా ర‌క్తం ఉంది. అందుకు కార‌ణం ఓ ఎలుక ఆమె ముక్కును కొరికి తినేయ‌డ‌మే. దీంతో త‌ల్లిదండ్రులు ప‌సికందుగా ఉన్న కిన్ కిన్‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి వైద్యం చేయించారు. అయితే అదృష్ట‌వ‌శాత్తూ కిన్‌కిన్ కు ప్రాణాపాయం త‌ప్పింది. కానీ ఆమె ముక్కు కోల్పోయింది. దీంతో ఆమె ఎదుగుతున్న‌కొద్దీ అంద విహీనంగా క‌నిపించ‌సాగింది. ఈ క్ర‌మంలోనే ఆమె స్కూల్‌కు వెళ్తే అక్క‌డ తోటి పిల్ల‌లు అంద‌రూ ఆమెను ఏడిపించేవారు. దీంతో 6వ త‌ర‌గ‌తిలో ఉండ‌గానే ఆమె చ‌దువు మానేయాల్సి వ‌చ్చింది.


అనంత‌రం 17 ఏళ్ల వ‌య‌స్సుకు రాగానే కిన్‌కిన్ సొంతంగా ప‌ని వెతుక్కునేందుకు వేరే ఊరికి మారింది. అయితే అక్క‌డా ఆమెకు అన్నీ అవ‌మానాలే ఎదుర‌య్యాయి. ముక్కు లేదంటూ ఆమెను ఏడిపించేవారు. అలా ఆమె బాధాక‌ర‌మైన జీవితం గ‌డుపుతుండ‌గానే ఆమెకు ఓ వ్య‌క్తితో పెళ్ల‌యింది. కానీ ఆ వివాహం డైవోర్స్‌కు దారి తీసింది. దీంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన కిన్ కిన్ బ‌య‌టి ప్ర‌పంచానికి దూరంగా గ‌డ‌ప‌సాగింది. అయితే ఆమెకు ఫేస్‌బుక్‌లో అనుకోకుండా లిన్ ఝౌకియాంగ్ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో లిన్ కిన్ కిన్‌కు ఉన్న గొప్ప హృద‌యాన్ని అర్థం చేసుకున్నాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్ర‌పోజ్ చేశాడు. ఆ ప్ర‌పోజ‌ల్‌కు కిన్ కిన్ ఓకే చెప్పింది. ఈ క్రమంలో ఆ జంట ఒక్క‌ట‌య్యారు. ఇప్పుడు చాలా హ్యాపీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. నిజంగా… వీరిద్ద‌రిదీ నిజ‌మైన‌, అస‌లైన ప్రేమే క‌దా..! మీరేమంటారు..?

Comments

comments

Share this post

scroll to top