సివిల్స్‌లో ఆలిండియా వ్యాప్తంగా 3వ ర్యాంక్ సాధించిన గోపాల‌కృష్ణ క‌ష్టాలు తెలిస్తే.. ఎవ‌రైనా జాలి ప‌డ‌తారు..!

నిరంత‌ర శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల‌, ల‌క్ష్య‌సాధన దిశ‌గా అలుపెర‌గ‌ని ప్ర‌యాణం, అంకిత భావం… ఇవి ఉంటే చాలు. ఎవ‌రైనా అద్భుతాలు చేయ‌వ‌చ్చు. అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చు. అలా ఎన్నో ఘ‌న‌తలు సాధించిన వారి గురించి మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సంద‌ర్భాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోతుంది కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన మ‌రో వ్య‌క్తి గురించే. అత‌ని పేరు గోపాల‌కృష్ణ. తాజాగా జ‌రిగిన సివిల్స్ ప‌రీక్ష‌ల్లో ఆలిండియా లెవ‌ల్లో 3వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. ఇంత‌కీ గోపాల‌కృష్ణ ఏ మీడియంలో ఎగ్జామ్ రాశాడో తెలుసా..? తెలుగులో. అందులోనూ అత‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌, క‌ళాశాలల్లో చ‌దువుకున్న విద్యార్థి కావ‌డం విశేషం.

గోపాల‌కృష్ణది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస‌. అక్క‌డే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివాడు. అయితే ఐఏఎస్ సాధించాల‌నేది అత‌ని క‌ల‌. అందుకోసం అత‌ను హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. న‌గ‌రంలోని అశోక్‌న‌గ‌ర్‌లో ఓ చిన్న గ‌ది అద్దెకు తీసుకుని రోజూ ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యేవాడు. అయితే అత‌ని ఖ‌ర్చుల కోసం ఓ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేసేవాడు. అలా ఓ వైపు ప‌నిచేస్తూనే మ‌రో వైపు రోజూ 18 గంట‌ల పాటు చ‌దివే వాడు. ఈ క్ర‌మంలో అత‌ను గ‌త 11 ఏళ్లుగా ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. తాజాగా జ‌రిగిన సివిల్స్ ప‌రీక్ష‌ల్లో అత‌ను ఆలిండియా లెవ‌ల్లో 3వ ర్యాంక్ సాధించి అత్యుత్తమంగా నిలిచాడు.

తెలుగు మీడియంలోనే సివిల్స్ రాసిన గోపాల‌కృష్ణ ఇంట‌ర్వ్యూను కూడా తెలుగులోనే ఎదుర్కొన్నాడు. ఈ క్ర‌మంలో అత‌న్ని ఇంట‌ర్వ్యూ చేసిన అధికారుల‌కు అత‌ను ఏమాత్రం త‌డుముకోకుండా స‌మాధానాలు చెప్పాడు. ముఖ్యంగా అత‌ను త‌న హాబీ, చేసే పని టీచింగ్ అని చెప్ప‌డంతో అధికారులు అదే అంశంపై అత‌నికి ప్ర‌శ్న‌లు వేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో సౌక‌ర్యాల‌ను ఎలా మెరుగు ప‌ర‌చాలి, నాణ్య‌మైన విద్య‌ను ఎలా అందించ‌వ‌చ్చు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం… వంటి అనేక విషయాల‌పై వారు ప్ర‌శ్న‌లు వేయ‌గా గోపాల‌కృష్ణ అన్నింటికీ సంతృప్తిక‌రంగా స‌మాధానం ఇచ్చాడు. దీంతో అత‌ను సివిల్స్‌లో అంత‌టి ర్యాంక్‌ను సాధించాడు. త్వ‌ర‌లో తెలంగాణ లేదా ఆంధ్రప్ర‌దేశ్ క్యాడ‌ర్‌కు క‌లెక్ట‌ర్‌గా రానున్నాడు.

అయితే నిజానికి గోపాలకృష్ణ‌ది చాలా పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని కుటుంబం వారిది. అత‌ను ఇంట‌ర్ చ‌దివే వ‌ర‌కు వారి ఇంట్లో క‌రెంటు లేదు. పూరి గుడిసెలో ఉండేవాడు. అయినప్పటికీ త‌ల్లిదండ్రులు అత‌న్ని క‌ష్ట‌ప‌డి చ‌దివించారు. కాగా ఇప్పుడు కొడుకు క‌లెక్ట‌ర్ అయ్యాడ‌ని తెలిసే స‌రికి ఆ త‌ల్లిదండ్రులు ప‌డుతున్న సంతోషం అంతా ఇంతా కాదు. ఇక క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక తాను పేద ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తాన‌ని, వారికే అధిక సమ‌యం కేటాయిస్తాన‌ని గోపాల‌కృష్ణ అంటున్నాడు. అత‌ను ఇక ఆ సేవ‌లోనూ మంచి పేరు తెచ్చుకోవాల‌ని, అంద‌రి మ‌న్న‌న‌లు పొందాల‌ని మ‌నం కూడా ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top