ఫ్రెండ్ చనిపోయాడు, జాబ్ పోయింది, ప్రేయసి దూరమైంది. ఇంకా నేనెందుకు బతకాలి..? రియల్ స్టోరీ..!

”మాది మధ్య తరగతి కుటుంబం. అప్పుడు నా వయస్సు 15 సంవత్సరాలు. టెన్త్ పూర్తయింది. చదువు మానేసి ఏదైనా వ్యాపారం చేసుకోమని నాన్న రూ.2వేలు ఇచ్చాడు. నాకేమో చదవాలని ఉండేది. ఆ రూ.2వేలు తీసుకుని ఇంట్లో చెప్పకుండా బంధువుల ఇంటికి వచ్చేశా. వాళ్లింట్లోనే ఉంటూ ఓ వైపు బార్‌లో సర్వర్‌గా పనిచేస్తూ మరో వైపు ఏవియేషన్ కోర్సు పూర్తి చేశా. ఈ మధ్య కాలంలో మా ఇంట్లో వాళ్లతో సరిగ్గా మాట్లాడలేదు. ఏవియేషన్ కోర్సు పూర్తి అవుతుండగా ఓ ఎయిర్ హోస్టెస్‌తో ప్రేమలో పడ్డా. ఆ తరువాత కోర్సు పాసయ్యా. కువైట్ ఎయిర్‌లైన్స్‌లో జాబ్ వచ్చింది.

మరో వారం రోజుల్లో జాబ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఈ లోగా ఫ్రెండ్ వాళ్లింటికి సెలవులకని బయల్దేరా. ఇద్దరం బైక్‌పై వెళ్తున్నాం. అనుకోకుండా ఓ ఇసుక లారీ రివర్స్ వస్తూ మా బైక్‌ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నా ఫ్రెండ్ అక్కడికక్కడే చనిపోయాడు. నా కాలు నుజ్జయింది. అంతటి తీవ్ర బాధలోనూ నా ఫ్రెండే గుర్తుకు వచ్చాడు. ఆ రోజు ఎంత ఏడ్చానో నాకే తెలీదు. హాస్పిటల్‌లో డాక్టర్లు నా కాలు తీసేయలేదు. కానీ నడవడం కష్టం అని చెప్పారు. అలాగే కొన్ని రోజులు వీల్ చెయిర్‌కు పరిమితం అయ్యా. కాలుతో నడవడం కష్టం అని తెలవడంతో ఎయిర్‌లైన్స్ జాబ్ పోయింది.

ఆ రోజున మరో షాక్ తగిలింది. నేను ఎంతగానో ప్రేమించిన నా ప్రియురాలు వచ్చి హాస్పిటల్‌లో నా కండిషన్ చూసింది. నన్ను లవ్ చేయలేనని చెప్పి బ్రేకప్ చేసుకుని వెళ్లింది. ఆ రోజు నేను పడ్డ బాధా అంతా ఇంతా కాదు. ఓ వైపు ఫ్రెండ్ పోయాడు. మరోవైపు జాబ్ పోయింది. ఇప్పుడు ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ దూరమైంది. ఇక నేను ఎందుకు బతకాలి..? ఆత్మహత్యే నాకు శరణ్యం అనుకున్నా. అప్పుడే నా సోదరి వచ్చింది. 3 ఏళ్లుగా నాన్నతో మాటలు లేకున్నా నా సోదరి నాతో మాట్లాడుతూ వస్తుంది. నేను చనిపోతానని చెప్పా. అందుకు ఆమె ఒక్కటే మాట చెప్పింది… కేవలం సంతోష సమయాల్లో మాత్రమే నీ పక్కన ఉండే వారు నీకెందుకు..? అని అన్నది. వెంటనే నేను మారిపోయా..! నా ఆలోచన మారింది. బతకాలనే అనుకున్నా. కష్టపడి ఒక్కో అడుగు వేస్తూ వాకింగ్ ప్రాక్టీస్ చేశా. డాక్టర్లు కష్టమని చెప్పినా మామూలుగా నడవడం ప్రాక్టీస్ చేశా. తరువాత యూకే వెళ్లా. అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తూ ఫొటోగ్రఫీ కోర్సు చదివా. అదే వృత్తిగా ఎంచుకున్నా. ఇప్పుడు నేను బెంగుళూరులో మంచి ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడ్డా. కానీ నాన్న నాతో ఇప్పటికీ మాట్లాడరు. నేను చేస్తున్న పనంటే ఆయనకు ఇష్టం లేదు. అయినా నేను ఆయన్ను అభిమానిస్తూనే ఉంటా. ఎప్పటికైనా నాతో మాట్లాడకపోతాడా..? అని ఎదురు చూస్తున్నా..! అంతకంటే నాకు కావల్సింది ఇక ఏమీ లేదు..!”

–కష్టపడి పైలట్ అయి ప్రమాదం వల్ల ఫ్రెండ్‌ను, జాబ్‌ను, ప్రియురాలిని దూరం చేసుకుని, మళ్లీ కష్టపడి ఫొటోగ్రాఫర్‌గా ఎదిగిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి కథే ఇది. రియల్ స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top