ప్ర‌ధాని మోడీ చాయ్ అమ్మిన టీ స్టాల్ ఇదే..! ఈ ప్రాంతాన్ని రూ.100 కోట్లతో టూరిస్ట్ ప్లేస్‌గా చేయ‌నున్నారు..!

ప్రధాని మోడీ..! ఒక‌ప్పుడు గుజ‌రాత్ సీఎం. ఎన్నో ప‌ర్యాయాలు ఆయ‌న సీఎంగా ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత మ‌న దేశ ప్ర‌ధాని అయ్యారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌న్నీ సంచ‌ల‌నాలే. అయితే మోడీ ఒక‌ప్పుడు చాయ్ అమ్మాడ‌ని అంద‌రికీ తెలిసిందే. మ‌రి ఆయ‌న చాయ్ అమ్మిన ఆ ప్రాంతం ఎక్క‌డో తెలుసా..? అది గుజ‌రాత్‌లోనే ఉంది. ఇంత‌కీ ఇప్పుడీ విష‌యం ఎందుకు అంటారా..? ఏమీ లేదండీ.. మోడీ ఒక‌ప్పుడు చాయ్ అమ్మిన ఆ ప్రాంతానికి ఇప్పుడు మ‌హ‌ర్ద‌శ ప‌ట్టింది. కొన్ని వంద‌ల కోట్ల‌తో దాన్ని అభివృద్ధి చేయ‌నున్నారు. ఇంత‌కీ ఆ ప్రాంతం ఏంటంటే..?

అది ఒక రైల్వే స్టేష‌న్‌..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌న ప్ర‌ధాని మోడీ చాయ్ అమ్మింది ఆ రైల్వే స్టేష‌న్‌లోనే. దాని పేరు వ‌డ్‌న‌గ‌ర్  రైల్వే స్టేష‌న్‌. అది గుజ‌రాత్‌లో ఉంది. ఇప్పుడ‌దే స్టేష‌న్‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. దాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే తొలి విడ‌త‌లో భాగంగా ఆ స్టేష‌న్‌కు రూ.8 కోట్ల‌ను మంజూరు కూడా చేశారు. మోడీ 6 సంవత్సరాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు ఈ స్టేష‌న్ లో చాయ్ అమ్మారు. అది కూడా త‌న కుటుంబాన్ని పోషించుకోవ‌డం కోసం. అయితే ఇప్పుడ‌దే స్టేష‌న్‌ను రూ.100 కోట్ల వ్య‌యంతో అభివృద్ధి చేయ‌నున్నారు. గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ బాధ్య‌త‌ను తీసుకుంది.

గుజ‌రాత్ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వ‌ర్యంలో వ‌డ్‌న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్‌ను సుంద‌రంగా తీర్చిదిద్ద‌నున్నారు. వ‌డ్‌న‌గ‌ర్ నుంచి మొదెరా, ప‌టాన్ ప్రాంతాల‌కు ఓ టూరిస్టు ట్రైన్‌ను కూడా న‌డ‌ప‌నున్నారు. ఈ టూర్‌లో వెళ్లిన వారు మోడీ చాయ్ అమ్మిన వ‌డ్‌న‌గ‌ర్  స్టేష‌న్‌ను మాత్ర‌మే కాదు, ఆయ‌న పెరిగిన ఊరిని, చ‌దువుకున్న స్కూల్‌ను కూడా చూడ‌వ‌చ్చు. వాటిని కూడా టూర్‌లో భాగం చేయ‌నున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ టూర్‌ను ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తేనున్నారు. అంటే… అతి త్వ‌ర‌లోనే మ‌నం మోడీ చాయ్ అమ్మిన ఆ స్టాల్‌ను చూడ‌వ‌చ్చ‌న్న‌మాట‌. కావాలంటే ఎవ‌రైనా ఇప్పుడే వెళ్ల‌వ‌చ్చు. కాక‌పోతే అది టూరిస్ట్ ప్లేస్‌లా ఉండ‌దు, అంతే తేడా..!

Comments

comments

Share this post

scroll to top