డ్యూటీలో ఉండి సినిమా చూస్తూ ఉపముఖ్యమంత్రికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఉద్యోగి.

మ‌న దేశంలో ఉన్న ప్ర‌భుత్వ ఆసుపత్రులు ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. వైద్యులు, సిబ్బంది, మందులు, సౌక‌ర్యాల‌ కొర‌త‌, అప‌రిశుభ్రంగా ఉండే ప‌రిస‌రాలు, టైంకు రాని డాక్ట‌ర్లు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాట భార‌త‌మే అవుతుంది. వీట‌న్నింటికీ తోడు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఉండే సిబ్బంది అక్క‌డికి వ‌చ్చే రోగుల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోరు స‌రిక‌దా, డ‌బ్బులు చేతిలో పెడితేనే ప‌ని జ‌రుగుతుంది, అంటూ రోగుల నుంచి పీడించి, పీడించి డ‌బ్బుల‌ను వ‌సూలు చేస్తారు. అయినా రోగుల‌కు స‌రైన వైద్యం చేస్తారా, అంటే అదీ లేదు. ఇదంతా మ‌న దేశంలో ఉన్న ఇప్ప‌టి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల ప‌రిస్థితి. ఇప్పుడే కాదు, ఎప్ప‌టి నుంచో ఈ ప‌రిస్థితులు ఉన్నా, వాటిలో ఏమాత్రం మార్పులు రావ‌డం లేదు. అయితే పైన చెప్పిన‌ట్టుగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌నిచేసే సిబ్బంది నిర్ల‌క్ష్యం ఎటువంటిదో ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా మ‌రోసారి రుజువైంది. అది ఎక్క‌డో కాదు, దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలోనే.

hospital-staff-movie

ఢిల్లీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా సంద‌ర్శించారు. హాస్పిటల్‌లో రోగులకు ఎలాంటి సౌక‌ర్యాలు అందుతున్నాయో తెలుసుకునేందుకు ఆయ‌న స్వ‌యంగా హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించి ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. అయితే ఆ త‌నిఖీల్లో భాగంగా హాస్పిట‌ల్‌లో రౌండ్స్ వేస్తుండ‌గా, ఓ గదిలో కంప్యూట‌ర్‌లో సినిమాలు చూస్తున్న హాస్పిట‌ల్ ఉద్యోగిని మ‌నీష్ గ‌మ‌నించారు. దీంతో ఒక్క‌సారిగా ఆ ఉద్యోగిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బ‌య‌ట హాస్పిట‌ల్ ఆవ‌ర‌ణ‌లో ఓ వైపు సౌక‌ర్యాలు స‌రిగ్గా లేక‌, వైద్యులు రాక ఎంతో మంది పేషెంట్లు వేచి చూస్తుంటే తీరిగ్గా కంప్యూట‌ర్‌లో సినిమాలు చూస్తున్నావా..? అని ఆ ఉద్యోగిని మంత్రి ప్ర‌శ్నించారు. అనంత‌రం అత‌ను ప‌నిచేస్తున్న సెక్ష‌న్ ఇన్‌చార్జికి ఆదేశాలు ఇచ్చారు. వెంట‌నే ఆ ఉద్యోగిని విధుల్లోంచి త‌ప్పించ‌మని చెప్పారు. అయితే ఆ ఉద్యోగి ఎంత బ‌తిమాలినా ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ విన‌లేదు.

చూశారుగా..! సాక్షాత్తూ దేశ రాజ‌ధానిలోని ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ ప‌రిస్థితి ఎలా ఉందో..! ఇక ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల సంగ‌తి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవ‌చ్చు. ఎప్పుడు ఈ హాస్పిట‌ల్స్ బాగుప‌డ‌తాయో… పేద‌ల‌కు మెరుగైన వైద్యం ఎప్పుడు అందుతుందో… అస‌ల‌ది జ‌రుగుతుందో, లేదో… ఏమో… సందేహ‌మే..!

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ తనిఖీ వీడియోను మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు…

Comments

comments

Share this post

scroll to top