ట్రెయిన్ నంబ‌ర్ల‌లో మొద‌టి అంకె దేన్ని సూచిస్తుందో తెలుసా..? ఉదాహరణకి 12798 లో “1”..!

రైలు ప్ర‌యాణం చేసే వారు ఎవ‌రైనా టిక్కెట్ కొని వెళ్లాల్సిందే. అది స్టేష‌న్‌లో అయినా లేదంటే ఆన్‌లైన్‌లో అయినా స‌రే. టిక్కెట్ కొని రైలు ప్ర‌యాణం చేయాలి. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా తాము వెళ్లాలనుకునే ట్రైన్ నంబ‌ర్‌, టిక్కెట్ ధ‌ర‌, వెళ్లే క్లాస్‌, బోగీ వంటి ప‌లు అంశాల‌ను గుర్తు పెట్టుకుంటారు. ట్రైన్ నంబ‌ర్ ప్ర‌కార‌మే ఆ ట్రెయిన్ రాగానే రైలు ఎక్కి ప్ర‌యాణం చేస్తారు. అయితే మీకు తెలుసా..? ట‌్రెయిన్ నంబ‌ర్ల విష‌యానికి వ‌స్తే మ‌నం తెలుసుకోద‌గిన విష‌యాలు ఉన్నాయి. అవేమిటంటే…

సాధార‌ణంగా మ‌న దేశంలో ఏ ట్రెయిన్ నంబ‌ర్ అయినా 5 అంకెల్లో ఉంటుంది. గ‌తంలో నాలుగు అంకెల‌తోనే ఇవి ఉండేవి. కానీ పెరుగుతున్న రైళ్ల సంఖ్య‌ను దృష్టిలో ఉంచుకుని, ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం భారతీయ రైల్వే అధికారులు 5 అంకెల ట్రెయిన్ నంబ‌ర్ సిస్ట‌మ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో ఇప్పుడు దేశంలో ఏ ట్రెయిన్‌కైనా, ఆఖ‌రుకి స‌బ‌ర్బ‌న్ ట్రెయిన్‌కి అయినా 5 అంకెల నంబ‌ర్ క‌చ్చితంగా ఉంటుంది. అయితే ఏ ట్రెయిన్ నంబ‌ర్‌లో అయినా మొద‌టి అంకె దేన్ని సూచిస్తుందో, దాని అర్థం ఏమిటో తెలుసా..? అదేమిటంటే…

ట్రెయిన్ నంబ‌ర్లలో మొద‌టి అంకె ఏది ఉంటే ఏమ‌ని అర్థ‌మో కింద చూడండి..!

ట్రెయిన్ నంబ‌ర్ మొద‌టి అంకె 0 ఉంటే – అవి స‌మ్మ‌ర్ లేదా హాలి డే స్పెష‌ల్ ట్రెయిన్స్ అని తెలుసుకోవాలి.
1 లేదా 2 ఉంటే – బాగా దూరం వెళ్లే ట్రెయిన్స్ అని అర్థం
3 ఉంటే – కోల్‌క‌తా స‌బ‌ర్బ‌న్ ట్రెయిన్స్‌కు ఇలా ఉంటుంది
4 ఉంటే – చెన్నై, న్యూఢిల్లీ, సికింద్రాబాద్ ఇత‌ర మెట్రోపాలిట‌న్ సిటీల్లో స‌బ్ అర్బ‌న్‌, ఎంఎంటీఎస్ రైళ్ల‌కు ఇలా నంబ‌ర్ స్టార్ట్ అవుతుంది
5 ఉంటే – సౌక‌ర్య‌వంత‌మైన కోచ్‌లు ఉన్న ప్యాసింజ‌ర్ ట్రెయిన్ అని తెలుస్తుంది
6 ఉంటే – MEMU ట్రెయిన్స్
7 ఉంటే – DMU (DEMU) ట్రెయిన్స్ అని తెలుస్తుంది
8 ఉంటే – ప్ర‌స్తుతం ఈ సిరీస్ రిజ‌ర్వ్‌లో ఉంది, ఈ అంకె ప్రారంభంతో ట్రెయిన్స్ ఏవీ లేవు
9 ఉంటే – ముంబై ఎంఎంటీఎస్ రైళ్లు అని తెలుసుకోవాలి.

ఇక ట్రెయిన్ నంబ‌ర్ల‌లో మొద‌టి అంకె త‌రువాత ఉండే నంబ‌ర్లు వేటిని సూచిస్తాయంటే సంబంధిత రైల్వే జోన్, డివిజ‌న్‌ల‌ను సూచిస్తాయి.

Comments

comments

Share this post

scroll to top