హ‌త్య‌కు గురైన ప‌వ‌న్ అభిమాని వినోద్ రాయ‌ల్ చివ‌రి స్పీచ్ ఇదే… ఇంత‌కీ అత‌ను ఏమ‌న్నాడు..?

అప్ప‌టి వ‌ర‌కు కళ్ల ముందు తిరుగుతూ, చ‌క్క‌గా మాట్లాడుతున్న వ్య‌క్తి ఎవ‌రైనా అప్ప‌టిక‌ప్పుడే చ‌నిపోయార‌ని తెలిస్తే ఎవ‌రికైనా ఎలా ఉంటుంది..? మ‌న‌సుకు కొంత బాధ క‌లుగుతుంది. స‌ద‌రు వ్య‌క్తితో సంబంధం ఉన్నా లేకున్నా ఆ చ‌నిపోయిన వ్య‌క్తి గురించి కొంత విచారం క‌లుగుతుంది. ఇంత‌కీ మేం చెబుతున్న‌ది ఎవ‌రి గురించో ఇప్పుడు మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది, అదేనండీ మొన్నా న‌డుమ చ‌నిపోయాడే ప‌వ‌న్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయ‌ల్‌. అవును, అత‌ని గురించే. ఇంత‌కీ, అత‌ని గురించి ఇప్పుడు చెప్ప‌బోయే కొత్త విష‌యం ఏమిటంటారా..? అదేదో మీరే చూడండి…

vinod-royal-final-speech

తిరుప‌తికి చెందిన వినోద్ రాయ‌ల్‌కు మొద‌ట్నుంచీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే పిచ్చి అభిమానం. ప‌వ‌న్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ పేరిట తిరుప‌తిలో ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా అత‌ను చేశాడు. ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లోని కోలార్ ప్రాంతంలో జ‌రిగిన అవ‌య‌వ దాన క్యాంప్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ త‌ర‌ఫున వినోద్ రాయ‌ల్ హాజ‌రై త‌న అవ‌య‌వాల‌ను దానం చేసేందుకు ఒప్పందం ప‌త్రం ఇచ్చాడు. అనంత‌రం స్పీచ్ ఇచ్చాడు. అయితే ఆ స్పీచ్ అయిన త‌రువాత కొంత సేప‌టికే అత‌ను హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆ స్పీచ్‌లో వినోద్ రాయ‌ల్ ఏం చెప్పాడంటే…

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే త‌న‌కు ఎంతో అభిమాన‌మ‌ని, ఆయ‌న చేసే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, ఎక్క‌డ ఇలాంటి కార్య‌క్ర‌మాలు జ‌రిగినా త‌మ మ‌ద్దతు కొన‌సాగుతుంద‌ని అన్నాడు. అనంత‌రం చివ‌ర్లో జై ప‌వ‌నిజం అని కూడా నినాదం చేశాడు. అయితే ఆ నినాదం వ‌ల్లే మ‌రో హీరోకు చెందిన అభిమాని క‌త్తిపోట్ల‌కు వినోద్ రాయ‌ల్ గుర‌య్యాడని టాక్ వినిపిస్తోంది. అందులో ఎంత నిజం ఉన్నా, లేకున్నా, వినోద్ రాయ‌ల్ ఇచ్చిన త‌న చివ‌రి స్పీచ్‌ను మీరే చూడండి…!

Comments

comments

Share this post

scroll to top