ఎంవోపీ, ఎంఆర్‌పీ ధ‌ర‌లు అంటే ఏమిటో, వాటి వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఏమిటో తెలుసా..?

మార్కెట్‌లో మ‌నం కొనే వ‌స్తువుల‌పై ఉండే ఎంఆర్‌పీ గురించి మీకు తెలుసా..? దీన్నే మాగ్జిమ‌మ్ రిటెయిల్ ప్రైస్ (Maximum Retail Price – MRP) అంటారు. అంటే.. రిటెయిల‌ర్ మ‌న‌కు వ‌స్తువును అమ్మే గ‌రిష్ట ధ‌ర అన్న‌మాట‌. ఎవ‌రైనా దీనికి ఎక్కువ ధ‌ర‌కు వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌రాదు. ఎంఆర్‌పీకి స‌మానంగా లేదంటే ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు. అయితే చాలా వ‌ర‌కు పెద్ద పెద్ద మార్ట్‌లు, సూప‌ర్ మార్కెట్‌ల‌లో మ‌న‌కు ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువుల‌ను అందిస్తారు. డిస్కౌంట్ పేరిట ఎప్పుడూ కొన్ని వ‌స్తువుల‌ను ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ‌కే ఇస్తారు. మ‌రి అది అన్ని వ‌స్తువుల‌కు ఎందుకు వీలు కాదు..? కొన్నింటిని మాత్ర‌మే ఎందుకు అలా ఇస్తారు..? అస‌లు అలా వ్యాపారులు అమ్మితే వారికి లాభం ఉంటుందా..? అంటే… అవును, ఉంటుంది..! అదెలాగంటే…

సాధార‌ణంగా మ‌నం వస్తువుల‌పై ఉండే ఎంఆర్‌పీ ధ‌ర‌ను మాత్ర‌మే చూస్తాం. దాన్నే వ‌స్తువుల ప్యాక్‌పై ప్రింట్ చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఎంవోపీ ధ‌ర అని కూడా ఉంటుంది. దీన్ని మార్కెట్ ఆప‌రేటింగ్ ప్రైస్ (market operating price – MOP) అంటారు. కానీ ఈ ధ‌ర‌ను మాత్రం వ‌స్తువుల‌పై ప్రింట్ చేయ‌రు. ఎందుకంటే ఈ ధ‌రతో వినియోగ‌దారుడికి సంబంధం ఉండ‌దు కాబ‌ట్టి. ఈ ధ‌ర కేవ‌లం త‌యారీదారు, రిటెయిలర్‌కు మాత్ర‌మే తెలుస్తుంది. అంటే ఉదాహ‌ర‌ణ‌కు ఒక స‌బ్బు ఉంద‌నుకుందాం. దాని MOP ధ‌ర రూ.20 అనుకుందాం. అంటే ఆ ధ‌ర‌ను త‌యారీ కంపెనీ నిర్ణ‌యిస్తుంది. అదే ధ‌రకు ఆ స‌బ్బును కంపెనీ రిటెయిల‌ర్‌కు అమ్ముతుంది. ఇక రిటెయిల‌ర్ దాన్ని అమ్ముకోవాలంటే దానిపై ఎంఆర్‌పీ ఉంటుంది. అది సాధార‌ణంగా MOP క‌న్నా ఎక్కువే ఉంటుంది.

స‌ద‌రు స‌బ్బు ర‌వాణా చార్జీలు, ప‌న్నులు, ఇత‌ర ఖర్చులు క‌లిపి మ‌రో రూ.10 అద‌నంగా వేసి మొత్తం రూ.30 ఎంఆర్‌పీగా ఆ స‌బ్బుపై ప్రింట్ చేస్తారనుకుందాం. అంటే త‌యారీదారు ఆ స‌బ్బును రూ.20కే రిటెయిల‌ర్‌కు ఇస్తాడు. ఇక రిటెయిల‌ర్ దాన్ని క‌చ్చితంగా ఎంవోపీ క‌న్నా ఎక్కువ‌గా, ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు అమ్మాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో రిటెయిల‌ర్ ఆ స‌బ్బును రూ.30కు (ఎంఆర్‌పీ ప్రకారం) అమ్ముకోవ‌చ్చు. లేద‌నుకుంటే ఎంఆర్‌పీ ధ‌ర‌పై డిస్కౌంట్ అని పెట్టి దాన్ని రూ.21 నుంచి రూ.29 వ‌ర‌కు ఏ ధ‌ర‌కైనా అమ్ముకోవ‌చ్చు. ఇప్పుడు చాలా వ‌ర‌కు పెద్ద మాల్స్‌, మార్ట్‌లు, సూప‌ర్ మార్కెట్‌లు చేస్తున్న‌దిదే. దీంతో చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారుల‌కు న‌ష్టం వ‌స్తోంది. ఎందుకంటే డిస్కౌంట్ రేటుతో పెద్ద వ్యాపారులు ఎక్కువ స్టాక్‌ను అమ్ముతారు క‌దా. కానీ చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వారికి అంత‌టి బిజినెస్ జ‌ర‌గ‌దు. క‌నుక వారికి న‌ష్టం వస్తుంది. దీంతో వారు వ్యాపారం చేయ‌లేరు. ప్ర‌స్తుతం పెద్ద మాల్‌ల బారిన ప‌డి చాలా మంది చిరు వ్యాపారులు ఇలా న‌ష్టాల‌తో బిజినెస్‌లు ర‌న్ చేస్తూ చివ‌రికి బిజినెస్‌ల‌ను ఎత్తేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తున్న‌ది. అదీ… ఎంవోపీ, ఎంఆర్‌పీ మ‌హిమ వ‌ల్ల‌..!

Comments

comments

Share this post

scroll to top