రాంగ్ రూట్ లో వస్తున్నావని అడ్డుపడితే..బైకర్ ను కొట్టారు..! సీసీ టీవీలో రికార్డ్ అయ్యేసరికి హీరో అయ్యాడు 22 ఏళ్ల యువకుడు.!

థూ… చేసిందే త‌ప్పు ప‌ని.. పైగా నిల‌దీసినందుకు ద‌బాయింపు ఒక‌టి. అది చాల‌ద‌న్న‌ట్టు మీద మీద‌కు ఉరికి వ‌స్తారు, త‌న్న‌డానికి. అవును, మ‌రి ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నారు క‌దా. మ‌రీ ముఖ్యంగా రోడ్ల‌పై వాహ‌నాల‌ను న‌డుపుతున్న‌ప్పుడు. అడ్డ దిడ్డంగా మ‌న ముందుకు వ‌స్తారు. ఇది ఏందిరా బై..? అని ప్ర‌శ్నిస్తే చివ‌ర‌కు మ‌న మీదే ఉల్టా అవుతారు. ఆ సంద‌ర్భంలో మ‌నం అన్నీ మూసుకుని వెళ్లాలి. లేదంటే అదిగో ఆ ఘ‌ట‌న‌లో జ‌రిగిన‌ట్టే త‌న్నులు తినాల్సి వ‌స్తుంది. అయినప్ప‌టికీ అలాంటి వారు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు క‌దా. శిక్ష ప‌డే తీరుతుంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ఈ నెల 3వ తేదీన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో సాహిల్ బ‌ట‌వ్ (22) అనే విద్యార్థి ర‌హ‌దారిపై బైక్‌పై వెళ్తుండ‌గా MP04 CR 7860 అనే నంబ‌రు గ‌ల మ‌హీంద్రా థార్ వాహనం రాంగ్ రూట్‌లో అత‌నికి ఎదురుగా వ‌చ్చింది. దీంతో సాహిల్ ఆ వాహ‌నం ఎదుట అలాగే బైక్‌పై ఉన్నాడు. ఎంత‌సేప‌టికీ క‌ద‌ల‌లేదు. అనంత‌రం సాహిల్ బైక్ దిగి ఆ వాహనం నంబ‌ర్ ప్లేట్‌ను ఫొటో తీశాడు. ఆ త‌రువాత ఆ వాహ‌నంలో నుంచి ఇద్ద‌రు దిగ‌గా అందులో ఉన్న ఓ వ్య‌క్తి కూడా సాహిల్‌కు ఎదురుగా వ‌చ్చి సాహిల్ బైక్ నంబ‌ర్ ప్లేట్‌ను మొబైల్‌తో ఫొటో తీశాడు. అయితే ఆ వ్య‌క్తి అంత‌టితో ఆగ‌లేదు. ఏకంగా సాహిల్‌పై దాడికి దిగాడు.

అయితే కొంత సేప‌టి త‌రువాత చుట్టూ జ‌నాలు పోగై ఇద్ద‌రినీ విడ‌దీశారు. ఈ క్ర‌మంలోనే సాహిల్ స‌ద‌రు వ్య‌క్తిపై కంప్లెయింట్ ఇవ్వ‌గా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. కాగా స‌ద‌రు వ్య‌క్తి సాహిల్‌కు ఎదురుగా రావ‌డం, అనంతరం అత‌న్ని కొట్ట‌డం త‌దితర దృశ్యాల‌న్నీ అక్క‌డే ఉన్న ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. దీంతో ఆ దృశ్యాల‌ను ఎవ‌రో సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఆ వీడియో కాస్తా వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే రాంగ్ రూట్‌లో వ‌చ్చి త‌న్నిన ఆ వ్య‌క్తిని నెటిజ‌న్లు అంద‌రూ విమ‌ర్శించారు. ఆ వ్య‌క్తికి ఎదురుగా ధైర్యంగా నిల‌బ‌డి అత‌ని త‌ప్పిదాన్ని ఎత్తి చూపిన సాహిల్‌ను అంద‌రూ హీరో అని మెచ్చుకున్నారు. అవును మరి, రాంగ్ రూట్‌లో వ‌చ్చిందే కాకుండా దాన్ని ప్ర‌శ్నించిన సాహిల్‌ను త‌న్నినందుకు అలాంటి వెధ‌వ‌ల‌కు అలా జ‌ర‌గాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top