ఆ ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లయింది, పిల్లలు ఉన్నారు.! కానీ కలిసి ఒకే చెట్టుకి ఉరేసుకున్నారు.!

స్త్రీ, పురుషుల్లో ఒక‌రంటే ఒక‌రికి ఆక‌ర్ష‌ణ ఎప్పుడైన క‌ల‌గ‌వ‌చ్చు. అందుకు పెళ్లి అనేది అడ్డం కానే కాదు. పెళ్లయినా, కాకున్నా, వ‌య‌స్సు ఎంతున్నా, ఏ వ‌ర్గం వారైనా, ఎవ‌రిపైనా ఆక‌ర్ష‌ణ క‌ల‌గ‌వ‌చ్చు. అది ప్రేమైనా, ఇంకోటైనా చివ‌ర‌కు అలాంటి వాటిలో చాలా వ‌ర‌కు సంబంధాలు విషాదానికే దారి తీస్తాయి. మ‌ధ్యప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఓ జంట త‌మ‌కు వేర్వేరు వ్య‌క్తుల‌తో పెళ్లయినా, వారికి ఒక్కో బిడ్డ జ‌న్మించినా వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించారు. చివ‌ర‌కు ఏమ‌నుకున్నారో, ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఓ రోజున అక‌స్మాత్తుగా శ‌వాలై, చెట్టుకు వేలాడుతూ క‌నిపించారు..!

bhopal-lovers
అత‌ని పేరు విజ‌య్‌. ఆమె పేరు కుసుమ్‌క్లి. వీరు ఉంటోంది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ కు స‌మీపంలో ఉన్న ఓ గ్రామంలో. అయితే విజ‌య్‌కు వేరే మ‌హిళ‌తో అప్పటికే పెళ్లై సంతానం కూడా క‌లిగింది. కుసుమ్‌క్లికి రాందాని అనే వ్య‌క్తితో పెళ్ల‌వ్వ‌గా వీరికీ ఓ బిడ్డ జ‌న్మించాడు. అయితే ఇరుగు పొరుగున ఉంటుండ‌డంతో విజ‌య్‌, కుసుమ్‌క్లిల‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డి, అది కాస్తా వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో ఇద్దరు క‌ల‌సి ఉంటుండ‌డం వారి కుటుంబ స‌భ్యుల కంట ప‌డింది. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రి 24న ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ఇంటి నుంచి పారిపోయారు.

bhopal-lovers-2
ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 30న కుసుమ్‌క్లి భ‌ర్త రాందాని త‌న భార్య అదృశ్యంపై పోలీస్ స్టేష‌న్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. అయితే విజ‌య్‌, కుసుమ్‌క్లిలు ఇద్ద‌రూ ఈ మ‌ధ్యే ఓ గ్రామంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. చెట్టుకు చీర‌తో ఉరివేసుకుని ఇద్ద‌రూ బ‌లవ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతికి ఎవ‌రైనా కార‌ణ‌మా.? అనే కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏ వివాహేత‌ర సంబంధ‌మైనా చివ‌ర‌కు ఇలాగే విషాద‌మ‌వుతుంద‌ని వీరి క‌థ‌ను చూస్తే మ‌న‌కు తెలుస్తుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top