SHOCKING: నెట్ లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ “లవకుశ” ట్రైలర్..! వీడియో ఎలా లీక్ అయ్యిందో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే సినిమా సినిమాకు వ్యతాసం చూపడంకి ఫేమస్. “టెంపర్” లో నటవిశ్వరూపం చూపించి అభిమానుల ప్రశంసలు అందుకోవడమే కాదు ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నాడు. తరవాత వచ్చిన “జనతా గ్యారేజ్” తో అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసాడు తారక్. “నాన్నకు ప్రేమతో” సినిమాతో కూడా ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అయిపోయాడు. “టెంపర్”, “నాన్నకు ప్రేమతో”, “జనతా గ్యారేజ్”. ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాను అందించే పనిలో బిజీగా ఉన్నాడు.

బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ అనే సినిమాలో నటిస్తున్నాడు  ఎన్టీయార్‌.. ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. ఇందులో ఒకటి విలన్‌ పాత్ర కూడా ఉంది. ఆ నెగిటివ్‌ రోల్‌కు సంబంధించి ఎన్టీయార్‌ గెటప్‌ ఇటీవలే లీక్ అయ్యింది. ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాకు పనిచేసిన మేకప్‌మేన్‌ వాన్స్‌ గార్ట్‌వెల్‌ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. ఆయనే ఎన్టీయార్‌ పోషించబోయే విలన్‌ పాత్ర కోసం ఓ మాస్క్‌ను రూపొందించాడట. చూడడానికే భయంకరంగా ఉన్నాడు ఈ మాస్క్‌లో ఎన్టీయార్‌. ఇక సినిమాలో ఎలా నటించనున్నాడో చూడాలి!

బాహుబలి సినిమా విడుదలకు ముందే వార్ వీడియో నెట్ లో లీక్ అయ్యింది…వాట్సాప్, ఫేస్బుక్ లలో హల్చల్ చేసింది. ఇప్పుడు అదే ప్రియసై సమస్య లవకుశ కి కూడా వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లీక్ అయ్యింది అని కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేసాయి. కొంత మంది వీడియో కూడా షేర్ చేసారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలా పైరసీ కి తోడ్పడినందుకు సినిమా బృందం తగిన చర్యలు తీసుకోనుంది!

>>>Here’s The Leaked Video Which Is Going Viral<<<

సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో కనిపించగానే…చిత్ర నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎలా జరిగిందా అని ఆశ్చర్యపోయారు. ఫాన్స్ కూడా ఇలా జరిగినందుకు చాల బాధ పడ్డారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. “గణేష్” అనే ఒక వ్యక్తి ఈ సినిమాలోని ఓ పాటను లీక్ చేసాడు వాట్సాప్ లో. కొన్ని ఫోటోలను కూడా అప్లోడ్ చేసాడు సోషల్ మీడియాలో. ఆ వీడియోలో ఎన్టీఆర్ చేసే నెగటివ్ రోల్ చూడొచ్చు. ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. విడుదల కాకముందే ఇలా జరిగినందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చిత్ర బృందం. ఇలాంటివి ఇకముందు జరగకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోనున్నారు అంట. సైబర్ డిపార్ట్మెంట్ ఈ కేసు పై తదుపరి విచారణ చేయనుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ “లవకుశ” సినిమా చేస్తూ బిజీ గా ఉండడమే కాదు. బుల్లితెర మీద అరంగేట్రం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రఖ్యాతి చెందిన “బిగ్ బాస్” షో ద్వారా మా టీవీ లో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని అందరికి తెలిసిందే!

బిగ్ బాస్ షో పై ఎన్టీఆర్ మాట్లాడుతూ…

“టెలివిజన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీడియమ్ ఫర్ ఎంటర్టెన్మెంట్. స్టార్ మా టీవీ వారు బిగ్ బాస్ లాంటి పెద్ద టీవీ షోను హోస్ట్ చేయాలని నన్ను సంప్రదించినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దీన్నొక ఛాలెంజ్ గా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ షో తెలుగు టెలివిజన్ రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని నమ్ముతున్నాను. బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్ షో బిగ్ బ్రదర్ ఫార్మాట్లో సాగే ఓ రియాల్టీ షో. ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్లో, బాలీవుడ్లో ఈ రియాలిటీ షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. తెలుగులో కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను.”

మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కి ఎంత తీసుకుంటున్నారు..?

ఇంత పెద్ద షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ భారీ పారితోషికాన్నే అందుకుంటున్నాడు. ఒక ఎపిసోడ్‌కి అక్షరాలా రూ. 50 లక్షలు ఎన్టీఆర్‌కి ముట్టజెబుతోందట స్టార్ మా. సౌతిండియాలో టెలివిజన్ షో కోసం ఓ హీరో ఈ రేంజులో పారితోషికం తీసుకోవడం ఇదే ప్రథమం. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘బిగ్ బాస్’ షో తెలుగులో ఎంత విజయం సాధిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

featured image: source

Comments

comments

Share this post

scroll to top