దేశంలోని ప‌లువురు ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు ఒక‌ప్పుడు ఎలా ఉండేవారో తెలుసా..?

సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న‌కొద్దీ ఏ వ్య‌క్తి అయినా వృద్ధాప్య ద‌శ‌లోకి వెళ్ల‌వ‌లసిందే. క‌ల‌కాలం య‌వ్వ‌నంగా ఉంటామంటే కుద‌ర‌దు. ఉండ‌లేరు కూడా. కాక‌పోతే వృద్ధాప్యంలోనూ య‌వ్వ‌నంగా క‌నిపించేలా ఎవ‌రైనా ఉండ‌వ‌చ్చు. అందుకు ఆరోగ్య నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇది స‌రే… ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… వృద్ధాప్యం విష‌యానికి వ‌స్తే ఆ వ‌యస్సులో ఎవ‌రైనా అందంగా ఉన్నా లేక‌పోయినా, య‌వ్వ‌నంలో మాత్రం ఎవ‌రైనా చాలా బాగుంటారు. అందులోనూ మ‌న దేశంలో ఉన్న ప‌లువురు ప్ర‌ముఖుల‌ను య‌వ్వ‌నంలో చూస్తే నిజంగా వారేనా అనే సందేహం మీకు క‌లుగుతుంది. మ‌రి ఆ నాయ‌కులు ఎవ‌రో, వారి య‌వ్వ‌నంలో ఉన్న‌ప్ప‌టి ఫొటోలు ఏమిటో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!

1. సుష్మా స్వ‌రాజ్
బీజేపీ అగ్ర నేత‌ల్లో ఒక‌రైన సుష్మా స్వ‌రాజ్ గురించి అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుతం ఈమె విదేశాంగ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్నారు. త‌న బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నారు. ఇక సుష్మా యుక్త వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ఎలా ఉండేవారో మీరే పైన ఫొటోలో చూడండి. అప్ప‌టికి, ఇప్ప‌టికి పోలిక‌ల్లో పెద్ద తేడా ఏమీ లేదు క‌దా.

2. అద్వానీ
బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రైన లాల్ కృష్ణ అద్వానీ నైతే యుక్త వ‌య‌స్సులో అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేం. అలా ఉన్నారు ఆయ‌న‌.

3. అరుణ్ జైట్లీ
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ యుక్త వ‌య‌స్సుకి, ఇప్ప‌టికి పెద్ద తేడా ఏమీ లేదు క‌దా.

4. అట‌ల్ బిహారీ వాజ్‌పేయి
వాజ్‌పేయి ఫొటో యుక్త వ‌య‌స్సుది కాదు, అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ను చాలా సుల‌భంగా గుర్తు ప‌ట్టేలా ఉన్నారు.

5. అర‌వింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను కూడా సుల‌భంగా గుర్తు పట్ట‌వ‌చ్చు. కాక‌పోతే కొద్దిగా స‌న్నగా ఉన్నారు.

6. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌
బీహార్ నేత లాలూను యుక్త వ‌య‌స్సులో గుర్తు ప‌ట్ట‌లేం. అలా ఉన్నారు ఆయ‌న‌. అస్స‌లు అప్ప‌టికి, ఇప్ప‌టికి సంబంధం లేకుండా ఉన్నారు.

7. మ‌న్మోహ‌న్ సింగ్
మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ యుక్త వ‌య‌స్సులో చాలా దృఢంగా ఉన్నారు. కానీ వృద్ధాప్యంలో స‌న్న‌గా అయిపోయారు.

8. మాయావ‌తి
ఈమె పోలిక‌లు కూడా కొంత వ‌ర‌కు గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. అది కూడా బాగా గ‌మ‌నిస్తేనే సాధ్య‌ప‌డుతుంది.

9. మోడీ
ప్ర‌ధాని మోడీని య‌వ్వ‌నంలో సుల‌భంగా గుర్తు పట్ట‌వ‌చ్చు. అప్ప‌టికి, ఇప్ప‌టికి పోలిక‌ల్లో పెద్ద మార్పేమీ లేదు.

10. ములాయం సింగ్
స‌మాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ కూడా య‌వ్వ‌నంలో గుర్తు ప‌ట్ట‌రాకుండా ఉన్నారు. అస‌లు పోలిక‌లే క‌నిపించ‌డం లేదు క‌దా.

11. స్మృతి ఇరానీ
సినీ నటిగా జీవితాన్ని ప్రారంభించిన స్మృతి ఇరానీ ఒక‌ప్పటి ఫొటోలను ఎవ‌రైనా ఇట్టే సుల‌భంగా గుర్తిస్తారు.

12. సోనియా గాంధీ
ఈమె కూడా య‌వ్వ‌నంలో చాలా సుల‌భంగా గుర్తు ప‌ట్టేలా ఉన్నారు. పెద్ద‌గా మార్పేమీ లేదు.

13. సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి
ఈయ‌న‌లో కూడా అప్ప‌టికి, ఇప్ప‌టికి పెద్ద మార్పేమీ లేదు క‌దా.

 

Comments

comments

Share this post

scroll to top