అందరు నన్ను ఏడిపిస్తున్నారు అని కూతురు అంటే..కిచెన్ లోకెళ్ళి నీళ్లు వేడి చేయమంది తల్లి.! ఎందుకంటే.?

ఓ రోజు కాలేజీ నుండి ఇంటికి రాగానే ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళింది కూతురు. రోజు నన్ను చాలా మంది ఏడిపిస్తున్నారు, నేను చాలా మంచిదని అని అలుసుతో స్నేహితులు కూడా ఆటపట్టిస్తున్నారు అని బాధ పడింది. దీంతో కూతుర్ని కిచెన్ లోకి వెళ్లి ఓ గిన్నెలో నీళ్లు వేడి చేసి కాఫీ గింజలు వేయి, ఇంకో గిన్నెలో ఆలుగడ్డ ఉడకపెట్టు, మరొక గిన్నెలో కోడిగుడ్డు ఉడకపెట్టు అని చెప్పింది. అమ్మ ఎందుకు ఇలా అంటున్నావు.? సీరియస్ గా బాధపడుతుంటే నీకు సరదాగా ఉందా? ఉడకపెట్టు అంటున్నవ్..! అప్పుడు ఆ తల్లి కూతురికి ఓ కథ చెప్పింది..!

ఇది… ఓ ఆలుగడ ,కోడిగుడ్డు, కాఫీగింజ కథ.

అనగనగా ఓ తాత….అతని దగ్గర ఓ మాయ కుండ ఉంది.అందులో నీళ్లను పోయగానే…వెంటనే మరుగిపోతుంటాయ్.! ఒక రోజు ముగ్గురు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చారు.

మొదటి వ్యక్తి తన చేతిలో ఓ ఆలుగడ్డను తీసుకొచ్చి….ఇది తినడానికి కష్టంగా ఉంది అన్నాడు.
రెండవ వ్యక్తి తన చేతిలోని కోడిగుడ్డును చూపించి..ఇది తినడానికి చాలా ఈజీ అన్నాడు.
ఇంతలో మూడవ వ్యక్తి తన చేతిలోని కాఫీ గింజలను చూపించి…ఇవి తినడానికి సరిపోవు అన్నాడు.
అప్పుడు ఆ తాత మీ ముగ్గురు తీసుకొచ్చిన పదార్థాలను ఈ మరుగుతున్న నీటిలో పడేయండి అంటాడు…వారు అలాగే చేస్తారు.

గట్టిగా తుంచడానికి రాని ఆలుగడ్డ..ఆ మరుగుతున్న నీటిలో ఉడికిన తర్వాత మెత్తగా దూదిపింజలా మారిపోయింది.
పచ్చిగా ఉన్నప్పుడు…గట్టిగా ఒత్తితే పగిలే కోడిగుడ్డు…ఆ మరుగుతున్న నీటిలో ఉడికిన తర్వాత గట్టిగా తయారయ్యింది.
ఇక కాఫీ గింజలైతే…ఆ మరుగుతున్న నీటిలో తమ ఆకృతిని పూర్తిగా మార్చుకొని కాఫీగా మారిపోయాయ్.
ఇప్పుడు ఇవన్నీ…మన జీవితాన్ని చాలా క్లియర్ గా చూపిస్తాయ్ ఓ సారి చూడండి:

కుండ మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
కుండలో మరుగుతున్న నీళ్లు మన కష్టాలను సూచిస్తాయి..ప్రతి మనిషి జీవితంలో ఎప్పడో ఓ సారి కష్టాలు ఎదురవుతాయి.
ఆలుగడ్డ, కోడిగుడ్డు, కాఫీ గింజలు.. మనుషుల లోని రకాలు. వాటిలాగే మనుషులు తమతమ కష్టాలకు ఒక్కోరకంగా ప్రతిస్పందిస్తుంటారు.

ఉడకని బంగాళదుంపలాగా గట్టిగా ఉన్న మనుషులు…కష్టాలు రాగానే వేడి నీటిలో మరిగిన ఆలుగడ్డలాలా మొత్తబడిపోతారు.
కొంతమందైతే కష్టాలు వచ్చాకే… ఉడికిన కోడి గుడ్డు లాగా గట్టిపడతారు..ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటారు.
కొంత మందైతే పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకుంటారు..ఎలాగైతే కాఫీ గింజలు నీళ్లలో కలిసిపోయాయో అలా..!
ఇప్పుడు చెప్పండి ఇందులో మీరు బంగళాదుంపలా? కోడిగుడ్డా? లేక కాఫీ గింజలా….?

 

Comments

comments

Share this post

scroll to top