నిత్యం త‌మ‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌వుతాయో చెబుతున్న ఓ మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ రియ‌ల్ స్టోరీ ఇది..!

”నా చిన్న‌త‌నంలో అన్న‌ద‌మ్ముళ్లం, అక్కా చెల్లెళ్లం క‌లిసి దొంగ పోలీస్ ఆట ఆడేవాళ్లం. అందులో మేం బాగా ఎంజాయ్ చేసే వాళ్లం. నేనెప్పుడు పోలీస్ గానే ఉండేదాన్ని. అప్ప‌ట్నుంచే నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం ఉండేది. పెద్ద‌య్యాక నేను క‌చ్చితంగా పోలీస్ ఆఫీస‌ర్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న్నా. అయితే నిజానికి పోలీస్ అవ‌డ‌మంటే అంత మామూలు విష‌యం కాదు. ఆడ‌, మ‌గ ఎవ‌రికైనా అది క‌ష్టంగానే ఉంటుంది. అలాంటి ఎన్నో క‌ష్టాల‌ను దాటాను కాబ‌ట్టే ఈ రోజున నేను అనుకున్న పోలీస్ ఆఫీస‌ర్ అయ్యాను. నా క‌ల నెరవేరింది.

పోలీస్ ఆఫీస‌ర్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యాక నా తోటి ఆఫీస‌ర్లు న‌న్ను జూనియ‌ర్‌గా చూసే వారు. కానీ నా సీనియ‌ర్లు నాకు బాగా స‌పోర్ట్ ఇచ్చేవారు. ఆత్మ‌విశ్వాసాన్ని క‌లిగించేవారు. అలా విధులు నిర్వ‌హిస్తుండ‌గా ఒక రోజున ఓ వేడుక జ‌రిగింది. అందులో పాల్గొన్న‌వారు కంట్రోల్ త‌ప్పిపోయారు. సాధార‌ణంగా మ‌న దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పండుగలు, ఉత్స‌వాలు, వేడుక‌లు చేసుకుంటే పెద్ద ఎత్తున ఉత్సాహంగా ప్ర‌జ‌లు పాల్గొంటారు. సంద‌డి వాతావ‌ర‌ణం, కోలాహ‌లంగా ఉంటుంది. మైక్‌లు, పాటలు, డీజేలు స‌రేస‌రి. దీంతో వృద్ధులు, చిన్నారులు, రోగులు, జంతువుల‌కు చాలా ఇబ్బంది క‌లుగుతుంది. విప‌రీత‌మైన శ‌బ్ద కాలుష్యానికి వారు తీవ్ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఒక‌సారి వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా జ‌రిగిన వేడుక‌లో పాల్గొన్న వారు కంట్రోల్ త‌ప్పారు.

మేం ఎంత చెప్పిన వారు వినే స్థితిలో లేరు. అప్ప‌టికే పెద్ద ఎత్తున స్పీకర్లు, డ్ర‌మ్స్ పెట్టి పెద్ద ఎత్తున శ‌బ్దాలు చేస్తూ తీవ్ర‌మైన న్యూసెన్స్ చేశారు. ఎంత అదుపు చేద్దామ‌న్నా మాకు వారు విన‌లేదు. అప్ప‌టికే రాత్రి బాగా పొద్దుపోయింది. అందులో ఉన్న‌వారంద‌రూ మ‌ద్యం సేవించి ఉన్నారు. ఓ వృద్ధ జంట అక్క‌డే నివ‌సిస్తోంది. వారు అప్ప‌టికే అనారోగ్యం బారిన ప‌డ్డారు. వారి మ‌నవ‌డు మ‌మ్మ‌ల్ని చూసి స‌హాయం చేయ‌మ‌ని అడిగారు. మేం వేడుక వ‌ద్ద‌కు వెళ్లి దాన్ని ఆపు చేయాల‌ని చెప్పాం. అయితే వారు మాట వినలేదు. పైగా విధుల్లో ఉన్న మ‌మ్మ‌ల్ని దూషించారు. అస‌భ్య ప‌ద‌జాలంతో తిట్టారు. అయిన‌ప్ప‌టికీ మేం బ‌ల‌వంతంగా స్పీక‌ర్ల‌ను ఆపు చేశాం. దీంతో చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. మేం బెదిరించేస‌రికి అంద‌రూ అక్క‌డి నుంచి పారిపోయారు. ఇలాంటి ఘ‌ట‌నలు మ‌న స‌మాజంలో జ‌రుగుతున్నందుకు బాధ‌గా అనిపించింది.

ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా, నిత్యం స‌వాళ్లు ఎదురైనా నేను నా ఉద్యోగాన్ని వ‌ద‌ల్లేదు. ఎందుకంటే అది నాకు చాలా ఇష్ట‌మైన జాబ్ కాబ‌ట్టి. మాది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. నా భ‌ర్త ఆద‌ర్శ‌మైన భావాలు క‌లిగి ఉంటారు. అందుకు నేను అదృష్ట‌వంతురాలిన‌నే చెప్ప‌వ‌చ్చు. నిజంగా చెప్పాలంటే ఆయ‌న కూడా పోలీస్ కావాల‌నుకున్నార‌ట‌, కానీ వీలు కాలేదు. అయినా న‌న్ను పోలీస్‌గా చూసి ఆయ‌న రోజూ సంతోష‌ప‌డుతూ ఉంటారు. ఆయ‌న పనిచేసేది నాసిక్‌లో, నా డ్యూటీ క‌ల్యాణ్‌లో. ఇద్ద‌రం వారంలో ఒక‌టి, రెండు సార్లు క‌లుసుకుంటాం.

బాబు జ‌న్మించాక 7 నెల‌ల‌కు తిరిగి నేను డ్యూటీలో చేరా. అంత చిన్న వ‌య‌స్సులో బాబును వ‌దిలి డ్యూటీకి వెళ్తున్నందుకు బాధగా ఉంది, అయినా త‌ప్ప‌దు క‌దా, ముందు డ్యూటీయే. అది ఉంటేనే నేను నా బాబుకు అన్నీ అందివ్వ‌గ‌ల‌ను. నా విధుల్లో ఎంతో మంది ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌శంస‌లు పొందాను. ఎన్నో రేప్‌, వ‌ర‌క‌ట్న కేసులను చేదించినందుకు నాకు, నా టీంకు ప్ర‌తాప్ దిగ‌వ్‌క‌ర్ చేతుల మీదుగా రివార్డులు కూడా అంద‌జేశారు. ఓ మ‌హిళ‌గా నేను పోలీస్ విధుల్లో రాణిస్తున్న‌ప్ప‌టికీ వ‌ర‌క‌ట్నం కేసులు, యాసిడ్ దాడులు, రేప్ కేసుల్లో ప‌నిచేయ‌డం నిజంగా బాధ‌గానే ఉంటుంది. వారు కూడా మాలాంటి స్త్రీలే క‌దా అనిపిస్తుంది. కొన్ని సార్ల‌యితే 3, 4 ఏళ్ల చిన్నారుల‌పై కూడా లైంగిక దాడులు జ‌రిగిన కేసుల్లో ప‌నిచేస్తాం. అప్పుడు ఇంకా తీవ్ర‌మైన విచారం క‌లుగుతుంది. అయితే తోటి మ‌హిళ‌ల‌కు నేనిచ్చే స‌ల‌హా ఒక్క‌టే.. వీలున్నంత వ‌ర‌కు ధైర్యంగా ఉండండి, అదే స్థితిలో ముందుకు సాగండి, ఏమీ కాదు. మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్న‌ప్పుడు ఈ అంశంలో వెనుక‌బ‌డి ఎందుకు ఉండాలి, ముందుకే సాగాలి, అప్పుడే విజ‌యం వ‌రిస్తుంది..!”

— పోలీస్ జాబ్‌లో విజ‌య‌వంతంగా ముందుకు దూసుకెళ్తున్న ఓ లేడీ పోలీస్ ఆఫీస‌ర్ రియ‌ల్ స్టోరీ ఇది..!

Comments

comments

Share this post

scroll to top