స్కూల్ లోనే రౌడీయిజం…తోటి విద్యార్థిని చితకబాదిన విద్యార్థులు.!

ఎంత‌టి క్రూర‌త్వం… ఎంత‌టి రాక్ష‌స‌త్వం… సాటి మనిషి… తోటి విద్యార్థి అన్న సోయే లేదు. త‌న్న‌డ‌మే వారి ప‌ర‌మార్థం. ఎదుటి వాడు ఏం త‌ప్పు చేశాడో… అస‌లు చేశాడో చేయ‌లేదో కూడా తెలియ‌దు. కానీ వీధి రౌడీల్లా అత‌నిపై దాడి చేశారు. అవును మ‌రి. చింత చెట్టుకు చింత కాయ‌లు కాక మామిడి కాయ‌లు కాస్తాయా..?  రౌడీ కొడుకుకు రౌడీ బుద్ధులు కాక పండితుడి బుద్ధులు వ‌స్తాయా..? అస‌లే అది బీహార్‌. చిల్ల‌ర రౌడీల‌కు, క‌ర్క‌శ‌త్వ‌మైన గూండాల‌కు అడ్డా అది. అలాంటి రాష్ట్రంలో ఉండే రౌడీల పిల్లలు మంచిగా ఎలా ఉంటారు. అస్స‌లే ఉండ‌రు. అందుకే ఓ అమాయక విద్యార్థిని వీర కుమ్ముడు కుమ్మారు.

students-fight

బీహార్ రాష్ట్రంలోని పాట్నా సిటీకి 71 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పాఠ‌శాల అది. ఆ స్కూల్ అలాంటి ఇలాంటి స్కూల్ కాదు. కేంద్రీయ విద్యాల‌యం. బాగా చ‌దువుకునే పిల్ల‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డ‌ప‌బ‌డుతున్న అత్యుత్త‌మ‌మైన పాఠ‌శాల అది. కానీ అందులో విద్యార్థులంద‌రూ మంచిగా, బుద్ధిగా చదువుకుంటారంటే మ‌నం పొరపాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే అక్క‌డ పైన చెప్పిన‌టువంటి త‌న్నులాటలే జ‌రుగుతాయి. ఆ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ఇద్ద‌రు విద్యార్థులు స్థానిక గూండాల‌కు చెందిన పిల్ల‌లు. అస‌లు వారికి అందులో అడ్మిష‌న్ ఎలా దొరికిందో అదొక విచిత్రం. స‌రే దొరికితే దొరికింది, బుద్ధిగా చ‌దువుకుంటున్నారా అంటే, ఉహు.. అది కాదు. ఓ విద్యార్థిని తీవ్రంగా చిత‌క్కొట్టారు. గ‌త నెల 25వ తేదీన జ‌రిగింది ఈ సంఘ‌ట‌న‌. కానీ ఇప్పుడే ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అందుకు కార‌ణం స‌ద‌రు విద్యార్థులు ఆ అమాయక విద్యార్థిని చిత‌క్కొడుతుండ‌డాన్ని వీడియో తీసిన కొంద‌రు విద్యార్థులు దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డ‌మే. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారి అక్క‌డి విష‌యం కాస్తా అంద‌రికీ తెలిసిపోయింది.

బీహార్‌లోని ఆ కేంద్రీయ విద్యాల‌య‌లో జ‌రిగిన సంఘ‌ట‌న ప‌ట్ల త‌న‌కు పూర్తి నివేదిక అందించాల‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ఉపేంద్ర ఖుష్‌వాహ స్థానిక ఎస్‌పీని ఆదేశించారు. దీనిపై ఎస్‌పీ స్పందించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే స‌ద‌రు దాడి ఘ‌ట‌న‌కు స‌రైన కార‌ణాలు తెలియ‌వ‌ని పోలీసులు చెబుతున్నారు. కానీ నిందితులైన విద్యార్థుల‌ను వ‌దిలిపెట్ట‌మ‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలో బాధిత విద్యార్థి నుంచి స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని, స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు తెలియ‌జేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మాత్రం అస్స‌లు ఉపేక్షించ‌కూడ‌దు. నేడు స‌మాజంలో ఉన్న జాడ్యాల‌న్నీ విద్యార్థుల‌పై ప్ర‌భావం చూపుతున్నాయ‌న‌డానికి ఈ సంఘ‌ట‌నే అస‌లైన నిద‌ర్శ‌నం. అలాంటి విద్యార్థుల‌నే కాదు, వారిని క‌ని పెంచిన త‌ల్లిదండ్రుల‌ను కూడా అస్స‌లు విడిచిపెట్ట‌కూడ‌దు. ఇంత‌కీ ఈ ఘ‌ట‌న‌పై మీరేమంటారు..?

బీహార్ కేంద్రీయ విద్యాల‌య‌లో జ‌రిగిన సంఘ‌ట‌న తాలూకు వీడియో ఇది..!

Comments

comments

Share this post

scroll to top