ఓ వ్య‌క్తి చేతిలో ఆ బాలిక 6 నెల‌ల పాటు అత్యాచారానికి గురైంది… గ్రామ పెద్ద‌లు నిందితుడికి వేసిన శిక్ష 51 గుంజీలు, రూ.1వేయి జ‌రిమానా అట‌..!

మారుమూల గ్రామాలు, ప‌ల్లెల్లో పంచాయ‌తీ పెద్ద‌లు ఉంటార‌ని అంద‌రికీ తెలిసిందే. అక్క‌డి జనాలకు వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఈ పంచాయతీ పెద్ద‌లే ద‌గ్గ‌రుండి బాధితుల‌కు న్యాయం చేస్తారు. అలా అని స్థానికులు కూడా త‌మకు జ‌రిగే అన్యాయంపై పోలీసుల దాకా వెళ్ల‌కుండా పంచాయ‌తీ పెద్ద‌ల ద‌గ్గ‌రికి వెళ్లి, పంచాయ‌తీ పెట్టి త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటారు. అయితే అలాంటి ఓ గ్రామానికి చెందిన పంచాయ‌తీ పెద్ద‌ల‌ను న‌మ్మి న్యాయం చేయ‌మ‌ని వెళ్లినందుకు ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జ‌రిగిందో తెలుసా..? మీరే చూడండి..!

bihar-rape-victim

బీహార్ రాష్ట్రంలోని గ‌య జిల్లాలో ఉన్న సిధ్‌పూర్ అనే గ్రామంలో ఓ వ్య‌క్తి గ‌త 6 నెల‌లుగా స్థానికంగా నివ‌సించే ఓ మైన‌ర్ ద‌ళిత బాలిక‌ను అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు. మొద‌ట ఆ బాలిక స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా ఆమెను వెంబ‌డించి బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. అనంత‌రం 6 నెల‌లుగా అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు. ఈ క్రమంలో ఆ బాలిక గ‌ర్భం దాల్చ‌గా ఈ విష‌యం ఆమె త‌ల్లిదండ్రుల‌కు తెలిసింది. అయితే వారికేం తెలుసు..? పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని.., ఫిర్యాదు చేయాల‌ని..! ఈ క్ర‌మంలో వారు స్థానిక పంచాయ‌తీ పెద్దల‌ను ఆశ్ర‌యించారు. త‌మ‌కు న్యాయం చేయ‌మ‌ని అడిగారు. దీంతో వారు ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విని ఎలాంటి తీర్పు ఇచ్చారంటే… ఆ బాలిక‌, ఆ వ్య‌క్తి ఇద్ద‌రూ త‌మ స‌మ్మ‌తం మేర‌కే అలా చేశార‌ట‌, దాంతో దాన్ని నేరంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని, కావాలంటే ఆ వ్య‌క్తి ఆ బాలిక‌ను పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని తీర్పు చెప్పారు.

అయితే ఆ వ్య‌క్తితో పెళ్లి చేసేందుకు ఆ బాలిక త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పంచాయ‌తీ పెద్ద‌లు ఆ వ్య‌క్తికి 51 గుంజీలు శిక్ష వేసి, రూ.1వేయి జ‌రిమానా క‌ట్ట‌మ‌న్నారు. ఇదీ ఆ అభిన‌వ న్యాయ‌మూర్తుల తీర్పు. ఓ బాలిక శ‌రీరానికి, శీలానికి వారు క‌ట్టిన వెల అది. అత్యంత నిస్సిగ్గుగా మారిన ఈ సంఘ‌ట‌న గురించి స్థానిక పోలీసులు ఎలాగో సమాచారం తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు పెట్టి అరెస్టు చేశారు.

అయ్యా..! పెద్ద‌లారా..! మీరు తీర్పు ఇచ్చి న్యాయం చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. కానీ అలాంటి అత్యాచార బాధితుల‌కు మాత్రం అన్యాయం చేయ‌కండి. మీరూ మీ వింత పోక‌డ‌లు. మ‌హిళ‌ల శీలానికి, ఆత్మ‌గౌర‌వానికి మీరు ఎలాగూ విలువ ఇవ్వ‌డం లేదు, స‌రే… కానీ మ‌హిళ‌ల‌ను బ‌జారులో నిల‌బెట్టి వారి ఆత్మగౌర‌వాన్ని ఇంకా పోయేలా మాత్రం చేయ‌కండి. స‌మాజంలో అస‌లు ఇలాంటి వ‌ర్గాల్లో మ‌హిళ‌ల ప‌ట్ల ఉన్న భావాలు మారిన‌ప్పుడే బాధితుల‌కు న్యాయం జ‌రుగుతుంది. లేదంటే ఇంకా 100 ఏళ్లు కాదు, వేయి సంవ‌త్స‌రాలైనా భార‌త్‌లో మ‌హిళల ప‌రిస్థితి మార‌దు. ఇలాగే ఉంటుంది..!

Comments

comments

Share this post

scroll to top