ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ కోసం…స్వ‌యంగా ఇంటింటికి తిరుగుతున్న క‌లెక్ట‌ర్.!

జ‌ప‌నీస్ ఎన్సెఫలైటిస్ (జేఈ). పేరులో జ‌పాన్ ఉంద‌ని ఇదేదో జ‌పాన్‌కు చెందిన వ‌స్తువు అనుకునేరు, కాదు. ఇదొక వ్యాధి పేరు. అస్సాంలో ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలంలో ప్ర‌జ‌ల‌కు వ్యాప్తి చెందుతుంది. దీని వ‌ల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకోవాల్సి వ‌స్తుంది. త‌ప్పించుకుంటే అంగ వైక‌ల్యం క‌లుగుతుంది. లేదంటే చ‌నిపోతారు. అంత‌టి ప్రాణాంత‌క‌మైన వ్యాధి Japanese Encephalitis (JE). అనేక సంవ‌త్స‌రాల నుంచి అస్సాం వాసుల‌ను ఈ వ్యాధి ప‌ట్టి పీడిస్తోంది. Culex Mosquito అనే దోమ కుట్ట‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. అయితే అక్క‌డి ప్ర‌భుత్వం ఇందుకు వాక్సిన్ల‌ను కూడా ప్ర‌తి ఏటా వేస‌విలో అందిస్తుంది. దీంతో వ‌ర్షాకాలంలో దోమ‌లు కుట్టినా వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ఉంటుంది. అయితే 2016లో ఈ వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్ చాలా త‌క్కువ వ‌చ్చింది. దీంతో చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డి మృతి చెందారు. అయితే ఈ సారి అలా కాకుండా ఉండేందుకు గాను అస్సాం ప్ర‌భుత్వం ఇప్ప‌టి నుంచే ప్ర‌త్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసింది.

ప‌లు ప్రాజెక్ట్ టీంల‌ను ఏర్పాటు చేసి వాటి ద్వారా అస్సాం వాసుల‌కు వ్యాక్సిన్‌ల‌ను ఇస్తోంది. అయితే ఈ మ‌ధ్యే ఈ వ్యాక్సిన్‌ల ప‌ట్ల ఓ పుకారు వ‌చ్చింది. అదేమిటంటే… ఈ వ్యాక్సిన్ల‌ను తీసుకుంటే త‌రువాతి త‌రం యువ‌కుల‌కు పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌. ప్ర‌స్తుతం ఈ పుకారు అక్క‌డ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో అక్క‌డ చాలా మంది వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డం లేదు. పైగా వ్యాక్సిన్లు ఇస్తామ‌ని ప్ర‌భుత్వ అధికారులు ఎవ‌రైనా వ‌స్తే వారిని స్థానికులు కొడుతున్నారు. దీంతో అధికారులు వ్యాక్సిన్ల‌ను వేసేందుకు జంకుతున్నారు. మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌కు అయితే ఎవరూ వెళ్ల‌డం లేదు. దీంతో ఏం చేయాలో ప్ర‌భుత్వానికి తోచ‌డం లేదు.

అయితే ప‌రిస్థితి ఇలా ఉంటే క‌ష్ట‌మ‌ని భావించిన అక్క‌డి స‌ల్మారా జిల్లాలోని ఐఏఎస్ ఆఫీస‌ర్ అంబముథ‌న్ ఎంపీ తానే స్వ‌యంగా ఇల్లిల్లూ తిరుగుతూ స‌ద‌రు వ్యాక్సిన్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం మొద‌లు పెట్టారు. స‌బ్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్ గా ప‌నిచేస్తున్న ఆయ‌న రోజూ అక్క‌డి ఇండ్లు తిర‌గ‌మే కాదు, ప్ర‌తి రోజూ క‌నీసం 4 మీటింగ్‌లు పెట్టి వ్యాక్సిన్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ మంచిదేన‌ని, దాంతో ఏమీ కాద‌ని, ఆ వ్యాక్సిన్ వేసుకోక‌పోతేనే జ‌ప‌నీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధికి గుర‌వ్వాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు నిజ‌మే అని న‌మ్మి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అలా ఆయ‌న అక్క‌డి ప్ర‌జ‌ల్లో మార్పు తెస్తున్నారు. ఈ క్ర‌మంలో వీలైనంత త్వ‌ర‌గా స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను వ‌ర్షాకాలం వ‌చ్చే లోపే పూర్తి చేయాల‌ని వారు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఐఏఎస్ అధికారి అంబ‌ముథ‌న్ నిజానికి ఆర్మీ అధికారి. 2005 నుంచి 2011 వ‌ర‌కు ఆర్మీలో ఇన్‌ఫాంట్రీ విభాగంలో ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గాను 2010లోనే సేనా మెడ‌ల్ ఫ‌ర్ గ్యాలంట్రీని కూడా పొంద‌రు. ఆ త‌రువాత సివిల్స్ రాసి ఐఏఎస్ అయ్యారు. ఆర్మీలో ప‌నిచేసిన అంబ‌ముథ‌న్‌కు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనిపించింద‌ట‌. అందుకే సివిల్స్ రాసి ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు తాను అనుకున్న ప‌ని చేస్తున్నారు. ఏది ఏమైనా, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తూ వారి ఆరోగ్యం కోసం పాటు ప‌డుతున్న అంబ‌ముథ‌న్ కృషి అభినంద‌నీయం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top