నిద్రిస్తున్న గ‌ర్ల్ ఫ్రెండ్‌పైకి పాముల‌ను వ‌దిలిన బాయ్ ఫ్రెండ్‌..!

ల‌క్ష‌ల కొద్దీ వ్యూస్‌… వేల కొద్దీ కామెంట్లు, లైక్‌లు… తెప్పించుకోవ‌డం కోసం నేడు అనేక మంది సోష‌ల్ మీడియాలో చిత్రాతిచిత్ర‌మైన పోస్టులు పెడుతున్నారు. వాటిలో టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు కూడా ఉంటున్నాయి. రాత్రికి రాత్రే ఎలాగోలా పాపుల‌ర్ అవ్వాల‌ని కొంద‌రు, జ‌నాల్లో క్రేజ్ తేవాల‌ని ఇంకొంద‌రు వైర‌ల్ ఫొటోలు, వీడియోల‌ను తీసి నెట్‌లోకి వ‌దులుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలోనైతే ఇలాంటి పోస్టులు మ‌రీ ఎక్కువ‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా అలాంటి ఓ వైర‌ల్ వీడియో గురించే..!

python-on-woman

డెరెక్ డెస్కో అనే ఓ వ్య‌క్తి యూట్యూబ్‌లో వైర‌ల్ వీడియో ద్వారా హ‌ల్‌చ‌ల్ చేయాల‌ని భావించాడు. అందులో భాగంగానే త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌పై ఓ ట్రిక్ ప్లే చేసి, దాన్ని వీడియోగా తీసి యూట్యూబ్‌లో పెట్టాల‌ని అనుకుని అలాగే చేశాడు. ఇంత‌కీ అతను ఏం చేశాడంటే నిద్రిస్తున్న త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌పై రెండు పెద్ద‌వైన కొండ చిలువ‌ల‌ను వ‌దిలాడు. అయితే వెంట‌నే ఆమెకు మెళ‌కువ వ‌చ్చేసింది. దీంతో త‌నపై పాకుతున్న పాముల‌ను చూసే స‌రికి ఆమెకు పై ప్రాణాలు పైనే పోయాయి.

వెనుక నుంచి ఆమె బాయ్ ఫ్రెండ్ డెరెక్ డెస్కోతోపాటు మ‌రికొంద‌రు అత‌ని స్నేహితులు కూడా ఉన్నారు. వారంద‌రూ తమ త‌మ కెమెరాల్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ను బంధించారు. అయితే పాములు పాకుతుండ‌డాన్ని గ‌మ‌నించిన ఆ యువ‌తి వెంట‌నే బిగ్గ‌ర‌గా కేక‌లు పెట్టింది. దీంతో డెరెక్ పాముల‌ను తీసేశాడు. అయినా ఆ భ‌యం నుంచి ఆమె అంత త్వ‌ర‌గా తేరుకోలేదు. ఇప్పుడీ వీడియో యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. అయినా డెరెక్‌… నీ దిమాగ్ ఖ‌రాబ్ కాక‌పోతే… గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఏడిపించాలంటే మ‌రీ అంత విప‌రీతంగానా ప్ర‌వ‌ర్తించేది..? అదే ఏ హార్ట్ ఎటాక్ జ‌బ్బు ఉన్న‌వారో అయితో ఈపాటికీ ఎప్పుడో బాల్చీ త‌న్నేసేవారు..! అంటూ నెటిజ‌న్లు కూడా స‌ద‌రు వీడియోకు కామెంట్లు పెడుతున్నారు..! సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవ్వాల‌ని మీరు మాత్రం ఇలాంటి వీరోచిత కార్య‌క్ర‌మాలు మాత్రం చేయ‌కండి..!

Comments

comments

Share this post

scroll to top