ఒక్క ఫోటో అతని జీవితాన్నే మార్చేసింది. టీ అమ్ముకునే అతను 1000 కోట్ల రేంజ్ కు ఎదిగాడు.

భూమిపై పుట్టిన ప్ర‌తి మ‌నిషి జీవితం వేర్వేరుగా ఉంటుంది. ఏ ఒక్క‌రి జీవితం కూడా ఒకే విధంగా సాగ‌దు. కొంద‌రు త‌మ‌కు తాత‌లు తండ్రుల నుంచి సంక్ర‌మించిన ఆస్తిని అభివృద్ధి చేసి పేరు తెచ్చుకుంటే, మ‌రికొంద‌రు సొంత నైపుణ్యాల‌తో క‌ష్ట‌ప‌డి శ్ర‌మించి జీవితంలో పైకి ఎదుగుతారు. అయితే వీరు కాకుండా ఇంకా కొంద‌రు ఉంటారు. వారు అప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణ జీవితం గ‌డుపుతూ ఉంటారు. కానీ ఏదో ఒక విధంగా అదృష్టం వారిని వ‌రిస్తుంది. దీంతో ఒక్క‌సారిగా జ‌నాల‌లో వారు పాపుల‌ర్ అయిపోతారు. స్టార్లుగా మారిపోతారు. అయితే ఇలాంటి వారు ఎక్క‌డో కానీ మ‌న‌కు క‌నిపించ‌రు. చాలా అరుదుగా ఇలాంటి వారు మ‌న‌కు తార‌స ప‌డుతుంటారు. వారిలో ఒక‌డే అర్ష‌ద్ ఖాన్‌.

arshad-khan

అర్ష‌ద్‌ఖాన్ ది పాకిస్థాన్‌. నిత్యం చాయ్ అమ్ముకోవ‌డం వ‌చ్చిన దాంతో జీవ‌నం సాగించ‌డం అత‌ని నిత్య కృత్యం. అయితే సోష‌ల్ మీడియా అత‌ని పాలిట అదృష్ట దేవతే అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎలా అంటే… అర్ష‌ద్‌ఖాన్ వృత్తికి చాయ్ అమ్ముకుంటాడు కానీ చూసేందుకు మాత్రం నీలిక‌ళ్ల‌తో, చ‌క్క‌ని శ‌రీర ఛాయ‌, దేహ దారుఢ్యంతో అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంటాడు. ఈ క్ర‌మంలో స్థానికంగా ఉండే జియా అలీ అనే ఓ మ‌హిళా ఫొటోగ్రాఫ‌ర్ చాయ్ అమ్ముతున్న అర్ష‌ద్‌ఖాన్ ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అర్ష‌ద్ జీవితం ఒక్క‌సారిగా అనుకోని మ‌లుపు తిరిగింది.

సోష‌ల్ మీడియాలో అర్ష‌ద్‌ఖాన్ ఫొటో చూసిన ఓ మోడ‌లింగ్ కంపెనీ త‌మ దాంట్లో మేల్ మోడ‌ల్ కోసం గాను అర్ష‌ద్‌ఖాన్‌ను ఎంపిక చేసింది. అందుకు గాను అత‌నికి 1000 కోట్ల రూపాయల మోడలింగ్ కాంట్రాక్టు కూడా ఇచ్చింది.  ఇప్పుడు అర్ష‌ద్ సూటు బూటుతో చూసేందుకు అచ్చం పేరు మోసిన మోడ‌ల్‌లానే ఉండ‌డం విశేషం. దీంతో అత‌ని జీవితం అనూహ్యంగా ట‌ర్న్ తీసుకుంది. వెద‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టుగా అతన్ని అదృష్టం వ‌రించింది. అయితే అర్ష‌ద్‌కు మాత్రం ఇదంతా అదో ర‌కంగా, వింత‌గా అనిపిస్తుంద‌ట‌. చాలా మంది యువ‌తులు కూడా అత‌ని చుట్టూ చేరి సెల్ఫీలు దిగేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. దీంతో వారి నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తెలియ‌క అర్ష‌ద్ ఉబ్బి త‌బ్బిబ్బైపోతున్నాడ‌ట‌. చాన్స్ వ‌స్తే సినిమాల్లోనూ న‌టిస్తాన‌ని చెబుతున్నాడు అర్ష‌ద్‌. నిజంగా అదృష్ట‌మంటే అత‌నిదే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top