అత‌ను ఒక‌ప్పుడు స్వీప‌ర్‌గా ప‌నిచేశాడు… ఇప్పుడు ఏకంగా ఓ కంపెనీకే HOD అయ్యాడు…

ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి మ‌నిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎలాంటి చ‌దువు ఉన్నా, లేక‌పోయినా కొంద‌రైతే ఏదో ఒక అంశంలో అత్యంత నైపుణ్యాన్ని క‌లిగి ఉంటారు. ఈ క్రమంలో అలాంటి వారిలో చాలా మంది స‌రైన అవ‌కాశాలు లేక, పొట్ట కూటి కోసం ఏదో ఒక ప‌ని చేస్తూ జీవితం గ‌డుపుతుంటారు. కానీ వారిలో ఉన్న టాలెంట్ మాత్రం అలాగే ఉంటుంది. అది ఏదో ఒక సంద‌ర్భంలోనో బ‌య‌ట ప‌డుతుంది. అప్పుడు వారు తాము ఉన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు కొద్ది కాలంలోనే ఎదుగుతారు. అలాంటి వారిలో ఇప్పుడు చెప్ప‌బోయే ఆ యువ‌కుడు కూడా ఉన్నాడు. అంత‌కు ముందు స్వీప‌ర్ ప‌నిచేసినా ఇప్పుడు ఏకంగా ఓ కంపెనీకి మెయింటెనెన్స్ హెడ్ అయి స‌త్తా ఉంటే అందుకు చ‌దువుతో ప‌నిలేద‌ని నిరూపించాడు.

soldering

అత‌ని పేరు అరుణ్ పురోహిత్‌. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అందులో భాగంగా ఓ రోజు జోధ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌కు వ‌చ్చాడు. అక్క‌డ అత‌నికి రూమ్‌లు ఊడుస్తూ, క‌డుగుతున్న ఓ యువ‌కుడు క‌నిపించాడు. అత‌నితో అరుణ్ క్ర‌మంగా మాట‌లు క‌లిపాడు. ఆ సంద‌ర్భంలో అత‌నికి ఆ ప‌ని అంటే ఇష్టం లేద‌ని అరుణ్‌కు తెలిసింది. దీంతో అరుణ్ అత‌న్ని, నువ్వు ఏం చేయ‌గ‌ల‌వు, అని అడిగాడు. దాంతో అత‌ను తాను ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ ప‌రిక‌రాల‌ను రిపేర్ చేయ‌గ‌ల‌న‌ని, వైర్లు సోల్డ‌రింగ్ చేయ‌గ‌ల‌న‌ని, ఇప్పుడు చేస్తున్న స్వీపింగ్ ప‌ని అంటే త‌న‌కు ఇష్టం లేద‌ని, జీవితంలో ఎంతో ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని ఉంద‌ని అన్నాడు.

ఈ క్ర‌మంలో అరుణ్ ఆ యువ‌కుడిలోని ప‌ట్టుద‌ల‌ను గ్ర‌హించి కొన్ని రోజుల త‌రువాత తిరిగి వ‌చ్చి అత‌న్ని న్యూఢిల్లీలోని ఓ స్టార్ట‌ప్‌లో ప‌నిచేయాల‌ని అడిగాడు. అందులో ఐఐటీలో విద్య‌ను అభ్య‌సించిన పేరుగాంచిన ఎలక్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ విద్యార్థులు ఉన్నారు. అయితే వారు మొద‌ట అరుణ్ తీసుకువ‌చ్చిన ఆ యువ‌కుడిని చూసి అత‌ను ఏం చ‌దువుకున్నాడ‌ని అడిగారు. అందుకు అరుణ్ స‌మాధాన‌మిస్తూ అత‌ను పెద్ద‌గా ఏమీ చ‌ద‌వ‌లేద‌ని, కానీ ఒక సారి అత‌నిలో ఉన్న స్కిల్‌ను చూడాల‌ని త‌న మిత్రుల‌ను కోరాడు. దీంతో వారు అందుకు అంగీక‌రించి, అరుణ్ తీసుకువ‌చ్చిన ఆ యువ‌కుడికి కొన్ని సోల్డ‌రింగ్ వైర్లు, సోల్డ‌రింగ్ మెషిన్‌ను ఇచ్చి వాటిని అతికించ‌మ‌ని చెప్పారు. ఈ క్రమంలో ఆ యువ‌కుడు కేవ‌లం 30 నిమిషాల్లోనే స‌ద‌రు క్లిష్ట‌మైన వైర్ల‌ను అతికించి, సోల్డ‌రింగ్ చేశాడు. అత‌నిలో దాగి ఉన్న ప్ర‌తిభ‌కు అరుణ్ స్నేహితులు ముగ్ధులయ్యారు. అనంత‌రం త‌మ స్టార్ట‌ప్‌లోనే ఆ యువ‌కుడికి ప‌ని ఇచ్చారు.

కాగా ఇప్పుడు ఆ యువ‌కుడు అరుణ్ స్నేహితులు స్థాపించిన కంపెనీకి మెయింటెన్స్ హెడ్ అయ్యాడు. కొద్ది నెల‌ల్లోనే వారి వ‌ద్ద ఇంకా త‌న ప‌నికి సంబంధించిన మెళ‌వ‌కుల‌ను ఆ యువ‌కుడు నేర్చుకున్నాడు. అందులో భాగంగా టాంజానియా, జ‌ర్మ‌నీ వంటి దేశాల్లోనూ ప‌ని చేసి వ‌చ్చాడు. ఇలా ఉండ‌గా ఒకానొక రోజు అత‌ను స‌ద‌రు కంపెనీకి మెయింటెనెన్స్ హెడ్ అయి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. ఒక‌ప్పుడు స్వీప‌ర్‌గా ప‌నిచేసి ఇప్పుడు అంత‌టి ఉన్న‌త స్థానంలో కొన‌సాగుతుండ‌డంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇలాంటి వారే క‌దా, చ‌దువుకు, టాలెంట్‌కు సంబంధం లేద‌ని నిరూపించేది. ఇప్పుడు ఆ యువ‌కుడు కూడా అదే చేశాడు.

Comments

comments

Share this post

scroll to top