చ‌నిపోయిన ప్రేయ‌సి పాము రూపంలో వ‌చ్చింద‌ని… దాంతోనే ఉంటున్న యువ‌కుడు..!

యువ‌కుడు ఎంత వెంట ప‌డినా యువ‌తి ల‌వ్‌ను ఓకే చేయ‌క‌పోవ‌డం… మ‌ధ్య‌లో విల‌న్ ఎంట‌ర్ అయి యువ‌కున్ని చంపేయ‌డం… ఆ యువ‌కుడు ఈగ‌గా మార‌డం… విల‌న్ నుంచి యువ‌తిని ర‌క్షించండం… ఈ లైన్ల‌ను చ‌దువుతుంటే ఇప్ప‌టికే మీకు ఓ సినిమా గుర్తుకువ‌చ్చి ఉంటుంది క‌దా..! అదేనండీ రాజ‌మౌళి తీసిన ఈగ సినిమా. అందులో చ‌నిపోయిన హీరో మ‌ళ్లీ ఈగ‌గా పుడ‌తాడు. అయితే నిజ జీవితంలో అలా అస్స‌లు జ‌ర‌గ‌దు. కేవ‌లం క‌ల‌లో మాత్రమే ఇలాంటి ఘ‌ట‌న‌లు సంభ‌విస్తూ ఉంటాయి. కానీ… థాయ్‌లాండ్‌కు చెందిన ఈ యువ‌కుడి విష‌యంలోనూ ఇదే రిపీట్ అయిందా..? అంటే… దానికి స‌మాధానం ఔన‌నే మ‌న‌కు అనిపిస్తుంది..! కావాలంటే అత‌ని స్టోరీని మీరూ చ‌ద‌వండి..!

snake-lover-3

థాయ్‌లాండ్ లోని కాంచనాబౌరి అనే ప్రాంతానికి చెందిన వార్రానన్ సరసలిన్ అనే ఓ యువ‌కుడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ… ఆమె ఐదేళ్ల క్రితం చనిపోయింది. దీంతో వార్రాన‌న్ చాలా దిగులు చెందాడు. ప్రేయ‌సి విష‌యంలో చాలా కుంగిపోయాడు. అయితే అలా అత‌ను కాలం గ‌డుపుతుండ‌గా ఒక రోజు స‌డెన్‌గా 10 అడుగుల పొడ‌వు ఉన్న ఓ తాచుపాము అత‌ని వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అంద‌రి లాగే అత‌నూ మొదట షాక్ తిన్నా… అనంత‌రం ఆ పాము అత‌నితో స్నేహంగా ఉండ‌డం చూసి అత‌నికి ఆశ్చ‌ర్యం వేసింది. దీంతో చ‌నిపోయిన త‌న ప్రేయ‌సి మ‌ళ్లీ పాము రూపంలో తిరిగి వ‌చ్చింద‌ని అనుకున్నాడు. ఆ పాముతో జీవించ‌డం మొద‌లు పెట్టాడు.

snake-lover-2

snake-lover-1

నిత్యం తాను ఎక్క‌డికి వెళ్తే పామును కూడా అక్క‌డికి తీసుకువెళ్లేవాడు. ఇంట్లో ఏ ప‌ని చేస్తున్నా పాము అత‌ని వెంటే ఉంటుంది. అత‌న్ని ఏమీ అన‌దు కూడా. టీవీ చూస్తే చూస్తుంది. ఆట ఆడితే గ‌మ‌నిస్తుంది. జిమ్‌కు వెళ్తే తోడుగా వ‌స్తుంది. ఈ క్ర‌మంలో అత‌నితోపాటు ఉన్న పామును చూసి అంద‌రూ భ‌య‌ప‌డ‌డం మొద‌లు పెట్టారు. కానీ అత‌నికి ఏ మాత్రం భ‌యం లేదు స‌రిక‌దా సొంత ప్రేయ‌సితో గ‌డిపిన‌ట్టే ఉంటున్నాడు. త‌న‌తోపాటే ఆ పామును ప‌డుకోబెట్టుకుంటాడు. అయితే ఏది ఏమైనా పాము అంటే విష‌పు పురుగే అని, దాంతో ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ని ఇరుగు పొరుగు వారు వార్రాన‌న్‌కు చెబుతున్నారు. అయినా ఆ మాట‌ల‌ను అత‌ను లెక్క పెట్టడం లేదు. ఈ క్ర‌మంలో వారి జీవ‌నం భ‌విష్య‌త్తులో ఎలా ఉంటుందో వేచి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి… ఈగ సీన్ రిపీటైన‌ట్టా, కాన‌ట్టా..?

Comments

comments

Share this post

scroll to top