హైదరాబాద్ లోని పెద్ద షాపింగ్ మాల్స్ కు జరిమానా విధించేలా చేస్తున్నాడు అతను…ఎలాగో తెలుసా..?

Krishna

మన చుట్టు జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడానికి ఒక్కడొచ్చాడు…ప్రతి రోజు ప్రతి చోట ఏదో ఒక రకంగా నష్టపోతున్నా ..ఎదురు తిరిగి ప్రశ్నించలేని కొన్ని కోట్లమందిలోనుండి  ఒక్కడొచ్చాడు ప్రశ్నించడానికి..అవును ఒకే ఒక్కడు…ఆ ఒక్కన్ని చూసి మరొకరిలో మార్పు..ఈ మార్పు మొత్తం సమాజానికే మార్పు కావాలని ఆశిద్దాం..అతనే విజయ్ గోపాల్… ఎక్కడి నుండో రాలేదు..మనలోనుండే వచ్చాడు..మన ఇంటి పక్కన ,మన ఇంట్లో ఉండే కుర్రాడిలానే ఉన్నోడు…ఇంతకీ ఇతను ప్రశ్నించింది ఎవర్నో తెలుసా..

ఇరవై రూపాయలు పెట్టి నీళ్లు కొంటాం ..అది ఒక్కో చోట ఒక్కో ధరకు అమ్మేవాళ్లు ఎంత చెప్తే అంతకు కొంటాం..బండి పార్క్ చేసిన చోట డబ్బు కడతాం..సర్వీస్ ఛార్జీలు..పిల్లలకు డొనేషన్లు ..ప్రతి చోట అన్యాయం జరుగుతుందని తెలిసినా కిక్కురుమనం..అలాంటి అన్ని సమస్యలపై గళమెత్తాడు..హైదరాబాద్ కాచీగుడా కి చెందిన విజయ్..అలా ప్రశ్నించడానికి ముందు పెద్ద అధ్యయనమే చేశాడు..ఆ అధ్యయనం లోనుండే తన ప్రశ్నలకు సమాధానాలు,వాటి వెంట విజయాలు పొందాడు..

‘కన్య్సూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 1986’ గురించి, లీగల్‌ మెట్రాలజీ గురించి అవగాహన పొంది, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పిటిషన్‌ వేసి.. ఇలా ఎక్కువ రేట్లకు అమ్మడం న్యాయమా? అన్యాయమా? ఇంతకు ముందు ఇలాంటి కేసులేమైనా నమోదయ్యాయా? అనే విషయాలను తెలుసుకుని. గత ఏడాది ఆగస్టులో ఒక  థియేటర్‌పై కేసు నమోదు చేయించాడు..హైదరాబాద్ లోని అతి పెద్ద షాపింగ్ మాల్ ఐనాక్స్ పై కేసువేసి వినియోగదారుల సేవా కేంద్రం ఆ మాల్‌కు రూ.5వేల జరిమానా విధించేలా చేసాడు.పార్కింగ్ ఛార్జ్ విషయంలో ఇనార్బిట్ మాల్ కి వ్యతిరేఖంగా కేసువేసి నలభై వేల జరిమాణా కట్టించాడు.సర్వీస్ నచ్చలేదని ఓరిస్ పై,ఎక్కువ ఫీజులు ,డొనేషన్లు వసూలు చేస్తున్నారని ఆరు స్కూళ్స్ పై కేసులు వేసి ముక్కు పిండించి వాటి నుండి జరిమానాలు వసూలు చేయించాడు..ఇవన్నీ కూడా సామాన్యుడికి జరుగుతున్న మోసాలే..

అయితే విజయ్ పోరాటం చేస్తున్న వారి వెనక బడాబాబులు, రాజకీయ నాయకులు ఉన్నారు. పార్కింగ్‌ దందాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన రోజు 15 మంది విజయ్ ఇంటికి వచ్చి బెదిరించారు.  ఇంట్లో అమ్మ, నాన్న చాలా భయపడినా,తాను భయపడకుండా వారితో వాదించాడు. ప్రతి కేసులో నాకు బెదిరింపులు,  ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కూడా వార్నింగ్‌ వస్తున్నా చంపేస్తామని బెదిరించినా కూడా… ‘‘ఒక్కటి కొడితే.. తిరిగి పదింతల ఫోర్స్‌తో కొట్టాలి’’ అని స్వామి వివేకానంద చెప్పిన మాట ,ఆ స్పూర్తి,ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాడు..విజయ్ ని చూసి ఇప్పటికే కొంతమందిలో మార్పొచ్చింది.ప్రశ్నించడం అలవాటైంది.

 

Comments

comments