పాలిటెక్నిక్ కుర్రాడి ప్రయోగానికి ఆశ్చర్యపోయిన ప్రధాని.!

వేగంగా వెళ్తున్న రైలు తలుపు వద్ద నిలబడి బయటి నుంచి బలంగా వీచే గాలిని చేత్తో ఆపుతుంటే ఎలా ఉంటుంది..? భలే మజాగా ఉంటుంది కదా..! గాలి వేగంగా మన చేతులకు తాకుతూ ఉంటే, నిజంగా ఆ అనుభూతే వేరేలా అనిపిస్తుంది. అయితే ఆ యువకుడికి మాత్రం అలా అనిపించలేదు. ఎందుకంటే ఆ బలమైన గాలితో అతను ఏదో ఒక ప్రయోగం చేయాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. అది కాస్తా విజయవంతం అయింది. ఇప్పుడది పరికర రూపం దాల్చి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. అవును, మీరు వింటోంది నిజమే. పాలిటెక్నిక్ చదువుతున్నా ఆ యువకుడు రూపొందించిన పరికరం మాత్రం అద్భుతం. సాక్షాత్తూ ప్రధాని మోడీ కార్యాలయమే ఆ యువకుడి ఆవిష్కరణను మెచ్చుకుంది. దీన్ని త్వరలోనే ఆచరణలో పెట్టనున్నారు కూడా. ఇంతకీ ఆ యువకుడు తయారు చేసిన ఆ పరికరం ఏమిటి..?

akash-singh-wind-converter

అతని పేరు ఆకాష్‌సింగ్. వయస్సు 17 సంవత్సరాలు. గ్రేటర్ నోయిడాలోని జెవార్ ప్రాంత వాసి. అయినా గుర్గావ్‌లోని మనేసర్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే అతను ఒక రోజు రైలులో ప్రయాణం చేస్తూ అందులో తలుపు వద్ద నిలబడి బయటి నుంచి బలంగా వీచే గాలిని ఆస్వాదిస్తున్నాడు. అయితే అంతలోనే అతని మెదడులో ఓ ఆలోచన అలా మెరిసింది. అంతే, అనుకున్నదే తడవుగా ఆ ఆలోచనకు కార్యరూపం ఇచ్చేశాడు. వేగంగా వెళ్లే వాహనాల నుంచి వచ్చే బలమైన గాలి ద్వారా విద్యుత్ శక్తిని తయారు చేసే విండ్ కన్వర్టర్ అనే పరికరాన్ని రూపొందించాడు. దీన్ని బస్సులు, లారీలు, కార్ల వంటి వాహనాలపై ఉంచితే అక్కడ వీచే గాలిని ఇది విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అలా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అదే కన్వర్టర్‌కు అమర్చబడిన బ్యాటరీలో నిల్వ అవుతుంది. దాన్ని కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు.

ఆకాష్‌సింగ్ తయారు చేసిన ఈ విండ్ కన్వర్టర్ లో ఓ చట్రానికి స్వస్తిక్ ఆకారంలో నాలుగు బ్లేడ్లు అమర్చబడి ఉంటాయి. ఆ బ్లేడ్ల చివరి భాగాల్లో గిన్నెల వంటి వస్తువులు ఉంటాయి. వీటికి అనుగుణంగా కన్వర్టర్ గాలి వీచే దిశను బట్టి అనువుగా అటు, ఇటు సులభంగా కదలగలుగుతుంది. బ్లేడ్లు అమర్చబడి ఉన్న చట్రం వద్ద గేర్ బాక్స్ డైనమో ఉంటుంది. విండ్ కన్వర్టర్ కదులుతూ ఉంటే దాన్నుంచి ఈ డైనమో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. బస్సులు, కార్లు, లారీలు నగరాల్లో అయితే గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. అదే హైవేలపై అయితే ఆ వేగం రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలో విండ్ కన్వర్టర్ పనిచేయాలంటే గంటకు కేవలం 30 కిలోమీటర్ల వేగం ఉన్నా చాలు. కనుక ఆ పరికరాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. వాహన వేగం పరికరానికి చాలా ఎక్కువే అవుతుంది. రైళ్ల వంటి భారీ వాహనాలపై ఇలాంటి పరికరాలను ఉంచితే దాంతో ఇంకా ఎక్కువ విద్యుత్‌నే ఉత్పత్తి చేయవచ్చు. ఆకాష్ కూడా సరిగ్గా ఇదే ఆలోచించాడు. దీంతో తన వద్ద ఉన్న పరికరం గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాయగా, వారి నుంచి రిైప్లె కూడా వచ్చింది. కాగా వారు ఆకాష్ ఆవిష్కరణను ఎంతగానో మెచ్చుకున్నారు కూడా. ఇప్పుడు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వారు ఆకాష్ పరికరాన్ని పరీక్షించే పనిలో పడ్డారు. త్వరలోనే దీన్ని కార్యరూపంలోకి తేనున్నారు. అయితే ఆకాష్ అంతటితో ఆగడం లేదు. ఇదే పరికరాన్ని ఇంకా అధునాతనంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నాడు.

ఇంతకీ ఆకాష్ ఈ పరికరాన్ని ఎందుకు తయారు చేశాడో తెలుసా..? రోజు రోజుకీ అంతరించిపోతున్న సహజ వనరులను పరిరక్షించడం కోసం. అవును మరి. నీరు, బొగ్గు లాంటి వనరులను వాడుకుంటూ మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం కదా. మరి అవి కూడా ఏనాటికో ఓ నాటికి అయిపోక తప్పదు కదా. అప్పుడు మరి ఇలాంటి విండ్ ఎనర్జీపైనే ఆధార పడాలి. అందుకే ఆకాష్ ఆ దిశగా ఈ పరికరం తయారు చేశాడు. అతని ఆవిష్కరణకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top