అత‌నికి రెండు కాళ్లు లేవు… అయినా సాధార‌ణ వ్య‌క్తుల్లా ఫుట్‌బాల్ ఆడ‌గ‌ల‌డు..!

అవ‌య‌వాల‌న్నీ స‌క్ర‌మంగా ఉండి ఫుట్‌బాల్ లాంటి ఆడాలంటేనే సాధార‌ణ వ్య‌క్తుల‌కు సాధ్యం కాదు. అందుకు చాలా కార‌ణాలు ఉంటాయి. కానీ ఆ యువ‌కుడు మాత్రం అలా కాదు. అత‌నికి రెండు కాళ్లు లేవు. ఓ ప్ర‌మాదంలో త‌న కాళ్ల‌ను అత‌ను పోగొట్టుకున్నాడు. అయినా ఆత్మ విశ్వాసంతో ముందుకు క‌దిలాడు. వీల్‌చెయిర్‌, క్ర‌చెస్ లాంటివేకాదు, ఎవ‌రి స‌హాయం లేకుండానే అత‌ను సొంతంగా ఇప్పుడు ఆ ఉన్న కాళ్ల‌తోనే న‌డ‌వ గలుగుతున్నాడు. అంతే కాదు, సాధార‌ణ వ్య‌క్తులు ఆడిన‌ట్టుగానే ఫుట్‌బాల్ కూడా ఆడ‌గ‌ల‌డు. అత‌నే బంగ్లాదేశ్‌కు చెందిన యువ‌కుడు మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్లా.

mohammad-abdullah
మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్లా త‌న స‌వ‌తి త‌ల్లి వ‌ద్ద పెరిగాడు. తండ్రి ఇంకో మ‌హిళ వ‌ద్ద ఉండ‌డంతో త‌ల్లి అత‌న్ని బ‌య‌టికి వెళ్ల‌గొట్టింది. దీంతో స‌వ‌తి త‌ల్లే అత‌నికి దిక్కు అయింది. అయినా అక్క‌డా అత‌నికి ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. త‌న బామ్మ ద‌గ్గ‌ర చేరాడు. అయితే అనుకోకుండా అత‌ను 2001లో ర‌న్నింగ్ ట్రెయిన్ నుంచి కింద ప‌డ్డాడు. దీంతో ట్రెయిన్ అత‌ని రెండు కాళ్ల‌పై నుంచి వెళ్లింది. ఈ క్ర‌మంలో అత‌ను త‌న రెండు కాళ్ల‌ను కోల్పోయాడు. అత‌న్ని చూసేందుకు కూడా కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ రాలేదు. అనంత‌రం 18 నెల‌ల త‌రువాత ఓ అనాథాశ్ర‌మంలో చేరాడు. అక్క‌డా న‌చ్చ‌క మ‌ళ్లీ బ‌య‌టి దారి చూసుకున్నాడు.

అయితే ఎక్క‌డ ఉన్న ఆక‌లి బాధ త‌ప్ప‌దు కదా. అందుకే వీధుల్లో యాచ‌కం చేసే వాడు. దొరికింది తిని ఫుట్‌పాత్‌ల‌పై ప‌డుకునేవాడు. ఆ క్ర‌మంలోనే ఓ మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న త‌న‌లాంటి కొంద‌రు యువ‌కుల‌ను చూశాడు. వారి ద‌గ్గ‌రికి వెళ్లి ఫుట్‌బాల్ ఆడ‌తాన‌ని చెప్పాడు. అయితే రెండు కాళ్లు లేక‌పోవ‌డం, అత‌ని వాల‌కం చూసిన స‌ద‌రు యువ‌కులు త‌మ‌తో అత‌న్ని ఆడ‌నిచ్చేది లేద‌ని చెప్పారు. అయినా అత‌ను నిరాశ చెంద‌లేదు. క్ర‌చెస్‌, వీల్ చెయిర్ లేకుండా ఉన్న ఆ కొద్ది పాటి కాళ్ల‌తోనే న‌డ‌వ‌డం, వాకింగ్‌, రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్ర‌మంలో అత‌నికి ఓ ఎన్‌జీవో కూడా చేయూత‌ను అందించింది. అనంత‌రం అదే ఎన్‌జీవో స‌హాయంతో ఫుట్‌బాల్ కోచింగ్ తీసుకున్నాడు. అంతే, అప్ప‌టి నుంచి అత‌ను సాధార‌ణ వ్య‌క్తుల్లా ఫుట్‌బాల్ ఆడ‌డం మొద‌లు పెట్టాడు. ఇంకా చెప్పాలంటే వారి క‌న్నా కొంచెం ఎక్కువ‌గానే అబ్దుల్లా ఫుట్‌బాల్ ఆడ‌గ‌ల‌డు. ఏదో ఒక రోజు నేష‌న‌ల్‌, ఇంటర్నేష‌న‌ల్ ఛాంపియ‌న్ అవుతాన‌ని ధీమాగా చెబుతున్నాడు అబ్దుల్లా. అత‌ని క‌ల‌, ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top