పెళ్ళిలో ఇస్తున్న 5 లక్షల కట్నం వద్దని..వధువు కుటుంబాన్ని ఆ వరుడు ఏం కోరాడో తెలుసా.? దెబ్బకి పెళ్ళిలో అందరు షాక్!

మన దేశంలో వరకట్నం అనేది ఎప్పటి నుంచో ఉన్న సాంఘిక దురాచారం. దీని వల్ల ఎంతో మంది యువతులు బలవుతున్నారు. కట్నం ఇవ్వలేక కొందరికి పెళ్లిళ్లు కావడం లేదు. కొందరు బొటాబొటి కట్నం ఇచ్చి తరువాత పెళ్లయ్యాక అత్తవారింట్లో ఉంటూ వారు పెట్టే టార్చర్‌కు నరకం అనుభవిస్తున్నారు. కొందరు ఏకంగా తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. అయినప్పటికీ మన దేశంలో ఈ దురాచారం ఇంకా పోలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. దీంతో ఆడపిల్ల తల్లిదండ్రులు లక్షలు పోసి తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే భయపడుతున్నారు. అయితే వరకట్నం విషయానికి వస్తే నేటి తరుణంలో దాన్ని వద్దనే వారు ఎవరూ ఉండరు. అందరూ తీసుకుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఈ వరుడు మాత్రం అలా కాదు. తమ వర్గంలో కట్నం తీసుకోవడమనే ఆచారం ఉన్నప్పటికీ, తాను పెళ్లి చేసుకోబోయే వధువుకి ఆస్తి బాగా ఉన్నప్పటికీ ఆమె నుంచి కట్నం తీసుకోలేదు. మరి అతను ఏం చేశాడో తెలుసా..?

అది రాజస్థాన్‌లోని జోధ్ పూర్‌ ప్రాంతం. అక్కడ ఈ మధ్యే భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే వ్యాపారి కుమారుడు సిద్ధార్థ్‌కు మరో వ్యాపారి రిషిరాజ్‌ సింగ్‌ కూతురు నీరత్‌ కన్వార్‌కు వివాహం అయింది. వివాహం అనంతరం జరిగే కార్యక్రమంలో భాగంగా రిషిరాజ్‌ తన వియ్యంకుడు భన్వర్‌ సింగ్‌కు రూ.5 లక్షల కట్నం ఇవ్వబోయాడు. అయితే దాన్ని అతని కుమారుడు సిద్ధార్థ్‌ వ్యతిరేకించాడు. తమ వర్గంలో అలా కట్నం తీసుకోవడం సాంప్రదాయంగా వస్తుందని కనుక దాన్ని తీసుకోవాలని చాలా మంది చెప్పారు. అయినప్పటికీ అతను అందుకు ఒప్పుకోలేదు.

తనకు కేవలం రూ.1 కట్నం ఇస్తే చాలని సిద్ధార్థ్‌ అన్నాడు. అంతేకాదు, తాను ఈ పనిచేయడం వల్ల సొసైటీలో ఇతరులకు మెసేజ్‌ వెళ్తుందని, దీంతో కొందరైనా ఇలా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారని అతను చెప్పాడు. అయితే రిషిరాజ్‌ ధనవంతుడేనని అతనికి కట్నం ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, కనుక ఆ డబ్బును స్వీకరించవచ్చని తోటి వారు చెప్పారు. అయినా సిద్ధార్థ్‌ ససేమిరా అన్నాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ షాకయ్యారు. ఆ తరువాత రూ.1 మాత్రమే సిద్ధార్థ్‌ కట్నంగా తీసుకున్నాడు. ఏది ఏమైనా నేటి సమాజంలో నిజంగా ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా..!

Comments

comments

Share this post

scroll to top