ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటో… పోర్న్ సైట్‌లోకి… జాగ్ర‌త్త‌..!

నేడు సోష‌ల్ మీడియా ప్ర‌భావం స‌మాజంపై ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా ఫేస్‌బుక్ వంటి సైట్లలోనైతే యూజ‌ర్లు 24 గంట‌లూ నిరంత‌రాయంగా కాలం గ‌డుపుతున్నారు. ఇక సెల్ఫీల యుగం వ‌చ్చేసిందిగా. ఇంకేముంది, నిమిషానికో, గంట‌కో ఓ సెల్ఫీ దిగ‌డం ఫేస్‌బుక్‌లో పెట్టేయ‌డం, లైక్‌లు, కామెంట్ల కోసం నిమిష నిమిషానికి ఆ సైట్‌ను, లేదంటే మొబైల్‌లో ఆ యాప్‌ను ఓపెన్ చేసి చూడ‌డం ఇప్పుడు ఎక్కువైపోయింది. అయితే నిజంగా యూజ‌ర్లు తాము పెడుతున్న సెల్ఫీలు లేదా త‌మ‌కు సంబంధించిన ఇత‌ర ఫొటోల‌ను వారి సొంత స్నేహితులో, కుటుంబ స‌భ్యులో చూస్తే ఫ‌ర‌వా లేదు. కానీ అవే ఫొటోలు కాస్తా పోర్న్(అశ్లీల‌) సైట్లు న‌డిపే వారి చేతిలో ప‌డితే..? ఇక అంతే సంగ‌తులు. ఆ త‌రువాత మ‌నం ఏం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అప్ప‌టికే చేయి దాటి పోతుంది. ఆ యువ‌తికి కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది.

noella-martin
ఆమె పేరు నోయెల్లా మార్టిన్. వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు. లా చ‌దువుతోంది. ఇటీవ‌లే తాను ఓ సెల్ఫీ దిగింది. అంత‌టితో ఊరుకోలేదు. ఫేస్‌బుక్‌లోకి ఆ ఫొటోను అప్‌లోడ్ చేసింది. అయితే ఆ ఫొటో సాధార‌ణంగా చూసేందుకే కొంచెం అదోలా ఉంది. దీనికి తోడు అది ఓ పోర్న్ సైట్ న‌డిపే వ్య‌క్తి కంటికి క‌నిపించింది. దీంతో ఆ వ్య‌క్తి ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసి, దానికి పోర్న్ స్టార్స్ బొమ్మ‌ల‌ను అంటించి, ఆ యువ‌తి త‌ల మాత్ర‌మే ఉండేలా మిగ‌తా శ‌రీరం వేరే ఎవ‌రిదో ఉండేలా ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేసి అనంత‌రం వాటిని పోర్న్ సైట్‌లోకి అప్‌లోడ్ చేశాడు. అయితే త‌న ఫొటో ఇలా చోరీకి గురైన‌ట్టు, అది అనేక ర‌కాలుగా మార్ఫింగ్‌కు గురి కాబ‌డి పోర్న్ సైట్ల‌లోకి అప్‌లోడ్ అయిన‌ట్టు కూడా ఆమెకు తెలియ‌దు.

కానీ ఆ ఫొటో మాత్రం అన్ని పోర్న్ సైట్ల‌లో అలా తిరుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో ఓ సైట్‌కు చెందిన వ్య‌క్తి ఆమె ఫొటోతో ఫేస్‌బుక్ డిటెయిల్స్ వెతికి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. దీంతో ఆమెకు అస‌లు విషయం తెలిసింది. అయితే మొద‌ట నోయెల్లా మార్టిన్ ఖంగు తిన్నా, త‌రువాత నెమ్మ‌దిగా తేరుకుని అస‌లు విష‌యాన్ని గ్ర‌హించింది. స‌ద‌రు మార్ఫింగ్ చేయ‌బ‌డిన ఫొటో త‌న సెల్ఫీ ఫొటో అని గుర్తించింది. దీంతో ఆ ఫొటోల‌ను తీసివేయాల్సిందిగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్ సైట్ల‌కు రిక్వెస్ట్ పంపింది. అయితే వాటిలోంచి తీసేసినా స‌ద‌రు పోర్న్ సైట్ల‌లోంచి తీయ‌డం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే వాటిని ఎవ‌రు న‌డుపుతారో, ఎక్క‌డ ఉంటారో, అస‌లు వారు ఎవ‌రో గుర్తించ‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే నేడు ఇంట‌ర్నెట్ అనేది ఆకాశాన్ని దాటిపోయింది. హ‌ద్దులు లేకుండా విస్త‌రిస్తోంది. అంత‌టి మ‌హా స‌ముద్రంలో ఒక ఊరు, పేరు తెలియ‌ని చిన్న చేప పిల్ల లాంటి సైట్ల‌ను ప‌ట్టుకోవ‌డం అంటే అది చాలా క్లిష్ట‌త‌ర‌మైన ప‌ని. కాబ‌ట్టి అలాంటి అశ్లీల సైట్ల బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌డ‌మే మ‌నం చేయాల్సిన మొద‌టి ప‌ని. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, యువ‌తులు త‌మ ఫొటోల‌ను ఫేస్‌బుక్ వంటి సైట్ల‌లో పెట్టేముందు ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించుకోవాలి. త‌మ‌కు బాగా ప‌రిచయం ఉన్న వారితోనే ఈ ఫొటోలను షేర్ చేసుకోవాలి. అంతే త‌ప్ప వాటిని ప‌బ్లిగ్గా షేర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులే వ‌స్తాయి. ఆ త‌రువాత ఎంత‌నుకున్నా మ‌నం చేసేదేమీ ఉండదు.

Comments

comments

Share this post

scroll to top