ఒక‌ప్పుడు వేశ్య‌గా చేసిన ఆ యువ‌తి… ఇప్పుడు పాత నోట్లతో మోడీకి ట్వీట్ చేసింది. ఎందుకో తెలుసా..?

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో జ‌నాలు ఎలా క‌ష్టాలు ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. సామాన్య ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న నోట్ల‌ను మార్చుకునేందుకు బ్యాంకుల వ‌ద్ద కిలోమీట‌ర్ల మేర క్యూలైన్ల‌లో నిలుచున్నారు. మ‌రో వైపు బ‌డాబాబులు మాత్రం దొడ్డి దారిలో త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల డ‌బ్బును మార్చుకున్నారు. ఇప్ప‌టికీ ఇలా న‌గ‌దు మారుస్తున్న ముఠాను మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకా చాలా మంది సామాన్యులు ఇప్ప‌టికీ త‌మ వ‌ద్ద ఉన్న పాత నోట్ల‌ను ఏదో ఒక విధంగా బ‌య‌ట పెడుతూనే ఉన్నారు. పోపుల డ‌బ్బాలో దాచామ‌ని కొంద‌రు చెబుతుంటే, ఇంకా కొంద‌రు బీరువాలో పెట్టి మ‌రిచామ‌ని, మ‌రికొంద‌రు విదేశాల్లో ఉన్నామ‌ని, త‌మ‌కు ఈ విష‌యం తెలియ‌ద‌ని చెబుతున్నారు. అయితే ఓ యువ‌తి మాత్రం ఇదే విష‌యమై త‌న గోడును వెళ్ల‌బోసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

ఆమె ఓ వేశ్య‌. ఆ వృత్తిలోకి ఆమెను ఓ వ్య‌క్తి బ‌ల‌వంతంగా దింపాడు. నిజానికి ఆ యువ‌తిది బంగ్లాదేశ్‌. అక్క‌డే ఓ బ‌ట్ట‌ల షాపులో ఆమె ప‌నిచేస్తూ ఉండేది. ఈ క్ర‌మంలో 2013లో ఓ వ్య‌క్తి ఆ యువ‌తికి మాయ‌మాట‌లు చెప్పి ఇండియాకు తీసుకువ‌చ్చాడు. భార‌త్‌లో మంచి ప‌ని ఇప్పిస్తాన‌ని ఆమెను న‌మ్మ‌బ‌లికాడు. దీంతో స‌హ‌జంగానే అత‌ని మాట‌లు న‌మ్మిన ఆ యువ‌తి ఆ వ్య‌క్తితో స‌హా పుణె వ‌చ్చింది. అయితే ఆ వ్య‌క్తి ఆ యువ‌తిని పుణెలోని ఓ వేశ్యాగృహానికి అమ్మేశాడు. దీంతో అప్పటి నుంచి ఆ యువ‌తి అక్క‌డ న‌ర‌కం అనుభ‌వించింది.

అయితే 2015 డిసెంబ‌ర్‌లో ఓ స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారంతో పోలీసులు ఆ యువ‌తిని రక్షించారు. ఈ క్ర‌మంలో ఆమె అప్పుడు చేసిన ఆ పనికి సంబంధించిన డ‌బ్బులు ఇప్పుడు ఆమెకు అందాయి. ఇంత‌కాలం అవి ఆ వేశ్యా గృహ నిర్వాహ‌కుల వ‌ద్ద ఉన్నాయ‌ట‌. ఈ మ‌ధ్యే ఆ డ‌బ్బును ఆమె అందుకుంది. ఆ డ‌బ్బు మొత్తం రూ.10వేల వ‌ర‌కు ఉంటుంది. అయితే అవ‌న్నీ పాత నోట్లే. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియ‌లేదు. పాత నోట్లు ఇప్పుడు చెలామ‌ణీలో లేవు, అలా అని చెప్పి ఆర్‌బీఐ కూడా వాటిని తీసుకోవ‌డం ఎప్పుడో మానేసింది. దీంతో ఆ డ‌బ్బును కోల్పోతాన‌ని భావించిన ఆ యువ‌తి త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఏకంగా ప్ర‌ధాని మోడీకి ట్విట్ట‌ర్ ద్వారా త‌న బాధ‌ను తెలియ‌జేసింది. ఆ నోట్ల‌ను ఎలాగైనా మార్చి ఇవ్వాల‌ని కోరుతూ మోడీకి ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడీ వార్త అంత‌టా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే పీఎంవో మాత్రం ఇంకా దీనిపై స్పందించ‌లేదు. మ‌రి వారు స్పందించి ఆ యువ‌తి క‌ష్టాన్ని గుర్తించి ఆ నోట్ల‌ను మారుస్తారో లేదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top