లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏమిటి..? ఏముందీ… యువతీ యువకులు ఒకరినొకరు చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడడం. కానీ ఇది అందరు ప్రేమికుల విషయంలో జరుగుతుందా..? అంటే కచ్చితంగా చెప్పలేం. కానీ వాస్తవానికి జరుగుతుందనే చెప్పవచ్చు. కాకపోతే తాము మొదటి చూపులోనే లవ్లో పడ్డట్టు ఆ ప్రేమికులకు తెలియదు. తరువాత ఎప్పుడో ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుని అదే తమ మొదటి లవ్ ప్రపోజల్ అని భావిస్తారు. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తేనే తెలుస్తుంది. ముంబైకి చెందిన ఓ ఇటలీ జంటకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. వారి పరిచయం చిత్రమైన ప్లేస్లో జరిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు గానీ వారికి తెలియలేదు, తాము మొదటి చూపులోనే లవ్లో పడ్డామని..!
చిత్రంలో చూపిన వారిని చూశారుగా. వారిద్దరిదీ ఇటలీ. ప్రస్తుతం ముంబైలోనే నివాసం ఉంటున్నారు. అయితే అందులో ఉన్న జంట ముందుగా కలుసుకుంది ఎక్కడో తెలుసా..? ఓ గే క్లబ్లో. అవును, మీరు విన్నది నిజమే. వీరిద్దరికీ ఉమ్మడి స్నేహితుడైన ఒకరు వీరిని ఒక రోజు ఆ గే క్లబ్లో ఒకరినొకరికి పరిచయం చేయడం జరిగింది. అయితే అప్పుడే ఓ విచిత్రం చోటు చేసుకుంది. అదేమిటంటే ఆ యువతి యువకుడ్ని మొదట చూసినప్పుడు అతన్ని గే అనుకుందట.
కానీ అంతలోనే వారిద్దరి ఉమ్మడి స్నేహితుడు రావడం, ఒకరినొకరికి పరిచయం చేయడంతో ఇద్దరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఆ యువకుడికి యువతి అనుకున్న ఆ గే మాట ఎలా తెలిసిందో ఏమో గానీ, వెంటనే తాను గే కాదని, సాధారణ యువకున్నే అని నవ్వుతూ ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వారిద్దరి పరిచయం ప్రేమగా మారి ఇప్పటి వరకు కొనసాగుతోంది. ప్రస్తుతానికి వారు కలిసి రెండేళ్లవుతున్నా, ఇప్పటికీ వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో దేశాలు దాటి వచ్చినా వారి ప్రేమ అలాగే కొనసాగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ జంట ఇద్దరూ మొదటి చూపులోనే ప్రేమలో పడడం. అవును. కానీ తరువాత కొన్ని రోజులకు గానీ వారికి తెలియలేదు. తాము మొదటి సారి కలుసుకున్నప్పుడే ప్రేమలో పడ్డామని. అంతే కదా మరి! ప్రేమంటే ఎప్పుడు ఎలా ఎవరితో పుడుతుందో, ఎవరి వల్ల కలుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా..!