ఒకే దుండ‌గుల చేతిలో 3 ఏళ్ల‌లో రెండు సార్లు అత్యాచారానికి గురైన ఢిల్లీ యువ‌తి..! మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త లేద‌న‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం లేదు..!

మ‌న దేశంలో ఎవరైనా మహిళ లేదా యువ‌తి లైంగిక దాడికో, అత్యాచారానికో గురైతే బాధితురాలి ప‌రిస్థితి ఏ విధంగా ఉంటుందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఆమెకు న్యాయం జ‌ర‌గ‌డంలో, నిందితుల‌కు శిక్ష ప‌డ‌డంలో నెల‌ల‌కు నెల‌లు తాత్సారం జ‌రుగుతూనే ఉంటుంది. స‌రే ఏనాటికో ఓనాటికీ స‌ద‌రు నిందితుల‌కు శిక్ష ప‌డుతుంద‌నుకుందాం, కానీ వారు జైలుకెళ్లి శిక్ష అనుభ‌వించినా, లేదంటే పారిపోయి బ‌య‌టికి వ‌చ్చినా వారు మారుతారా అంటే సందేహ‌మే. ఒక వేళ అలా వారు మార‌కుండా మ‌ళ్లీ అత్యాచారం చేస్తే, అది కూడా ఒక సారి దాడికి గురైన యువ‌తిపైనే మ‌ళ్లీ అత్యాచారానికి పాల్ప‌డితే..? అప్పుడు ఆ బాధితురాలు ఎవ‌రికి చెప్పుకోవాలి..? ఏం చేయాలి..? న‌్యూఢిల్లీకి చెందిన ఓ యువ‌తికి కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. అదేంటంటే…

delhi-girl-rape
ఢిల్లీలోని సుఖ్‌పురా చౌక్ వ‌ద్ద ర‌హ‌దారి ప‌క్క‌న ప‌డి ఉన్న ఓ యువ‌తిని ఇటీవ‌ల స్థానికులు గుర్తించి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌రలించారు. అక్క‌డ తెలిసిందేమిటంటే ఆ యువ‌తి అత్యాచారానికి గురైంద‌ని. ఈ విషయం తెలుసుకున్న ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు హుటాహుటిన ఆసుప‌త్రికి చేరుకుని త‌మ బిడ్డ ప‌రిస్థితిని చూసి చ‌లించిపోయారు. అయితే ఎలాగో తేరుకున్న ఆ యువ‌తి చెప్పింది విని ఆ త‌ల్లిదండ్రులు ఖంగు తిన్నారు. అదేంటంటే, త‌న‌ను గ‌త 3 సంవత్స‌రాల కింద అత్యాచారం చేసిన ఐదుగురు వ్య‌క్తులే ఇప్పుడు కూడా చేశార‌ని చెప్పింది. ఈ విష‌యాన్ని ఆ త‌ల్లిదండ్రులు అక్క‌డి మీడియాకు, పోలీసుల‌కు చెప్ప‌డంతో సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

అయితే మ‌రి, 3 ఏళ్ల కిందట ఆ యువ‌తిపై అత్యాచారం చేసిన వారు దొర‌క‌లేదా..? అంటే… దొరికారు, వారిపై కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. వారిని అరెస్టు కూడా చేశారు. అయితే వారు తెలివిగా త‌ప్పించుకున్నారు. అప్ప‌టి నుంచి వారు పోలీసుల‌కు దొర‌క‌నే లేద‌ట‌. ఈ క్ర‌మంలో వారు బాధిత కుటుంబం వ‌ద్ద‌కు వెళ్ల‌డం, కేసు వెన‌క్కి తీసుకోమ‌ని బెదిరించ‌డం, డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్ప‌డం అన్నీ జ‌రిగాయి. అయినా పోలీసులకు వారు దొర‌క‌లేద‌ట‌. త‌ప్పించుకునే తిరుగుతున్నార‌ట‌. కాగా ఇటీవ‌లే అదే ఐదుగురు వ్య‌క్తులు మ‌ళ్లీ అదే యువ‌తిపై అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. అదీ అస‌లు సంగ‌తి..!

ఇప్పుడు మీరే చెప్పండి, ఏం చేయాలో..! ఇంత జ‌రిగినా పోలీసులు మాత్రం ఇంకా వారిని ప‌ట్టుకునేందుకే వెతుకుతున్నామ‌ని చెప్ప‌డం విడ్డూరం. నిజంగా ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎవరికీ జ‌ర‌గ‌కూడ‌దు. ఒక వేళ జ‌రిగితే..? అప్పుడు మ‌న‌మే నిందితుల‌ను ఎదిరించేందుకు, వీలైతే వారిని అంత‌మొందించేందుకు ముందుకు వెళ్లాలేమో..? ఏమో..? ఎవ‌రికి తెలుసు..! ఎప్పుడు ఏం జ‌రుగుతుందో..!

Comments

comments

Share this post

scroll to top