ఈమె క‌థ వింటే ఎవ‌రైనా జాలి చూపిస్తారు. చిన్న‌ప్పుడు తండ్రి చ‌నిపోవ‌డంతో పేప‌ర్ అమ్మింది..!

చదువుకోవాల‌ని ఆమెకు మ‌న‌స్సులో ఉండేది. అయినా ఏం చేస్తుంది పాపం.. ఓ వైపు తండ్రి లేడు. మ‌రో వైపు కుటుంబాన్ని పోషించే వారు లేరు. ఉన్న వారందరికీ ఆమే దిక్కు. దీంతో చ‌దువు మానేసింది. కుటుంబ బాధ్య‌త‌ను నెత్తిన వేసుకుంది. అలా ఓ వైపు ప‌నిచేస్తూనే తీరిక దొరికిన‌ప్పుడు చ‌దువుకుంటూ స్కూల్ విద్య‌ను, కాలేజీ కోర్సును పూర్తి చేసింది. ఈ క్ర‌మంలో ఆమె గురించి తెలుసుకున్న కొంద‌రు చేయూత‌ను అందించారు. దీంతో ఇప్పుడామె త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డి త‌న‌లాంటి ఎంద‌రికో ప్రేర‌ణ‌గా నిలుస్తోంది. ఆమే.. ఎరీనా..!

ఎరీనాది రాజ‌స్థాన్‌లోని జైపూర్‌. ఈమె తండ్రి పేప‌ర్ అమ్ముకునేవాడు. దాంతో వ‌చ్చే డ‌బ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. అయితే స‌డెన్ గా అత‌ను చ‌నిపోవ‌డంతో ఎరీనా కుటుంబ బాధ్య‌త‌ను నెత్తిన వేసుకుంది. అప్పుడామెకు 9 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు. ఈ క్ర‌మంలో త‌న తండ్రి చేసిన ప‌నినే తానూ చేయ‌డం మొద‌లు పెట్టింది. వారు మొత్తం 7 మంది అక్కా చెల్లెల్లు, ఇద్ద‌రు త‌మ్ముళ్లు ఉండేవారు. అంద‌రికీ తానే పెద్ద దిక్కు అయింది. దీంతో చ‌దువు సాగ‌లేదు. చ‌దువు మానేసింది. కానీ నెమ్మ‌దిగా మ‌ళ్లీ ఓ స్కూల్‌లో చేరింది. ఓ వైపు ఉద‌యం పేప‌ర్ అమ్ముతూనే ఆ ప‌ని అవ్వ‌గానే స్కూల్‌కు వెళ్లేది.

అలా ఎరీనా స్కూల్‌, కాలేజీ విద్య‌ను పూర్తి చేసుకుంది. అనంతరం ఎరీనా ఓ హాస్పిట‌ల్‌లో న‌ర్స్‌గా ప‌నిచేసింది. అయితే ఎరీనా ప‌డుతున్న క‌ష్టాల‌ను చూసి అక్క‌డి హైకోర్టు జడ్జ్ మనీష్ భండారి శ్రీ రాజీవ్ అరోరా ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ఎక్స్ పోర్ట్ వారి నుంచి బ్రేవరీ అవార్డు ఇప్పించారు. ఆమెకు ఆర్థిక స‌హాయం అందేలా చేశారు. ఆ తర్వాత కిరణ్ బేడీ చేతుల మీదుగా మరో పురస్కారం ఆమెకు దక్కింది. కాగా ఇప్పుడు ఎరీనా రాజస్థాన్ లో ప్రముఖ వ్యాపారవేత్తలు నడిపిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తర‌పున పనిచేస్తోంది. ఏది ఏమైనా ఎరీనా ప‌డిన క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం క‌దా.. అయిన‌ప్ప‌టికీ ఈమె వాటిని అధిగ‌మించి ముందుకు సాగింది. అందుకు ఈమెను మ‌న‌మంద‌రం అభినందించాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top