ప్రేమ కోసం కోట్ల ఆస్తిని కాద‌నుకుంది ఆ యువ‌తి. త‌రువాత ఏం జ‌రిగిందో తెలుసా..?

ప్రేమంటే అంతే.. ప్రేమికుల చేత ఏం చేయించ‌డానికైనా అది వెనుకాడదు. అలా చేయించే క్ర‌మంలో వారు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా ఇలాంటి ఓ ప్రేమికుల జంట గురించే. అయితే ఈ జంట ప్రేమ క‌థ నిజంగా సినిమా స్టోరీని త‌ల‌పిస్తుంది. గొప్పింటి అమ్మాయి, పేదింటి యువ‌కుడు.. క‌ట్ చేస్తే అమ్మాయి తండ్రి ప్రేమ‌కు ఒప్పుకోడు. దీంతో అమ్మాయి తండ్రిని విడిచిపెట్టి, కోట్ల ఆస్తిని కాద‌నుకుని ప్రియునితో వెళ్లిపోతుంది. ఇదే రియ‌ల్ లైఫ్‌లోనూ జ‌రిగింది.

అత‌ని పేరు ఖూ కే పెంగ్. వయస్సు 78 సంవ‌త్స‌రాలు. మ‌లేషియాలో కోటీశ్వ‌రుడు. మ‌ల‌య‌న్ యునైటెడ్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ఆయ‌న‌. 2015వ సంవ‌త్సరానికి గాను ప్ర‌పంచంలోని టాప్ 100 ఫోర్బ్స్ ధ‌న‌వంతుల జాబితాలో ఆయ‌న‌కు 44వ స్థానం ద‌క్కింది. మ‌లేషియాలో టాప్ 10 ధ‌నికుల్లో ఈయ‌న‌ది 5వ స్థానం. ఇత‌ని ఆస్తి విలువ సుమారుగా 30 కోట్ల అమెరిక‌న్ డాల‌ర్లు ఉంటుంది. అయితే పెంగ్‌కు 5 మంది పిల్ల‌లు ఉన్నారు. వారిలో 4వ సంతాన‌మైన కుమార్తె పేరు ఆంజెలైన్ ఫ్రాన్సిస్ ఖూ. ఈమె గురించే ప్ర‌స్తుతం మేం చెబుతున్న‌ది. ఈమె క‌రీబియ‌న్ దేశానికి చెందిన ఓ యువ‌కునితో ప్రేమ‌లో ప‌డింది.

అది 2008వ సంవ‌త్స‌రం. అప్పుడు ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఆంజెలైన్ ఖూ క‌రీబియ‌న్ దేశానికి చెందిన డేటా సైంటిస్టు జెడ్డ‌య్య ఫ్రాన్సిస్‌ను క‌లుసుకుంది. అప్పుడే అత‌నితో ప్రేమ‌లో ప‌డింది. అలా వారు కొన్నేళ్ల పాటు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలారు. దీంతో చివ‌ర‌కు పెళ్లికి అది దారి తీసింది. ఈ క్ర‌మంలోనే ఆంజెలైన్ త‌న ప్రేమ గురించి తండ్రికి చెప్పింది. అయితే తండ్రి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె తండ్రికి చెందిన కోట్ల ఆస్తిని తృణ‌ప్రాయంగా వ‌దులుకుని ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. తాను ప్రేమించిన జెడ్డ‌య్య ఫ్రాన్సిస్‌ను పెళ్లి చేసుకుంది. కేవ‌లం కొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆంజెలైన్ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా సొంత కాళ్ల‌పై ఆధారప‌డి జీవిస్తోంది. ఆమెకు భ‌ర్త జెడ్డ‌య్య ఫ్రాన్సిస్ తోడు నీడగా ఉన్నాడు. ఇది వారి అంద‌మైన ప్రేమ క‌థ‌. అయితే ఇదే విష‌యం అడిగితే ఆంజెలైన్ ఏమంటుందంటే… త‌న తండ్రి కేవ‌లం డ‌బ్బుకు మాత్ర‌మే విలువ ఇచ్చే వాడ‌ని, అలాంటి వారికి మాన‌వ సంబంధాల ప‌ట్ల అంత‌గా ఆరాటం ఉండ‌ద‌ని, అలాంట‌ప్పుడు అత‌ని ద‌గ్గ‌ర ఉండ‌డం క‌న్నా, ప్రేమించిన యువకున్ని పెళ్లి చేసుకుని అత‌ని ద్వారా ప్రేమ‌, ఆప్యాయ‌త పొంద‌డ‌మే క‌రెక్ట్ అని ఆమె చెబుతోంది. అవును, మ‌రి ఆమె చెబుతున్న‌ది నిజ‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top