న‌గ్న ఫొటోలు పంపాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని…ఫేస్ బుక్ ద్వారా కబడ్డీ ఆడుతున్న యువతి.!

ఆమె పేరు త‌రుణ అస్వాని. ముంబై వాసి అయినా అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంటోంది. అయితే ఇటీవ‌లే ఈమెకు ఓ అప‌రిచిత వ్య‌క్తి రెండు ఈ-మెయిల్స్‌ను పంపాడు. వాటిలోని సారాంశం ఏమిటంటే… గ‌తంలో ఎప్పుడో త‌రుణ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి కొన్ని ప్రైవేట్ వీడియోల‌ను, ఫొటోల‌ను తీసుకుంది. అయితే కెవిన్ జాన్ పేరిట ఓ వ్య‌క్తి త‌రుణ ప్రొఫైల్‌ను సోష‌ల్ మీడియాలో తెలుసుకుని ఆమె గూగుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి స‌ద‌రు ప్రైవేట్ ఫొటోలు, వీడియోల‌ను సేకరించ‌గ‌లిగాడు. ఈ క్ర‌మంలో వాటిని త‌రుణ‌కు మెయిల్ పంపి, 48 గంట‌ల్లో తాను చెప్పిన విధంగా చేయ‌క‌పోతే వాటిని ఆమె కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు పంపుతాన‌ని మెయిల్‌లో బ్లాక్ మెయిల్ చేశాడు. చెప్పుకోలేని అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో స‌ద‌రు మెయిల్స్‌ను పంపాడు.

అయితే త‌రుణ ఆ మెయిల్స్‌ను చూసి ముందుగా షాక్‌కు గురైంది. కానీ వెంట‌నే తేరుకుని ధైర్యంగా ముందుకు సాగింది. స‌ద‌రు వ్య‌క్తిపై ఎదురు దాడి చేసేందుకు సిద్ధమైంది. అత‌ను పంపిన ఈ-మెయిల్స్‌ను స్క్రీన్ షాట్ తీసి వాటిని త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌పై పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాన‌ని, అందుకు అంద‌రి మ‌ద్ద‌తు కావాల‌ని ఫేస్‌బుక్‌లో స‌హ‌కారం కోరింది. దీంతో చాలా మందికి ఆమెకు స‌పోర్ట్‌గా నిలిచారు. స‌ద‌రు వ్య‌క్తిని ట్రేస్ చేసి అత‌ని జాడ‌ను తెలుసుకునే ప‌నిలో ప‌డింది త‌రుణ. ఆమెకు ఆ వ్య‌క్తి దొర‌కాల‌ని, ఆ వ్య‌క్తికి ఆమె బాగా బుద్ది చెప్పాల‌ని మ‌న‌మూ కోరుకుందాం. ఏది ఏమైనా యువ‌తులు, మ‌హిళ‌లు ఎవ‌రైనా త‌మకు కూడా ఇలాంటి సంఘ‌ట‌నలే ఎదురైతే కంగారు ప‌డ‌కూడ‌దు. ధైర్యంగ పోరాటం చేయాలి. త‌రుణ చేస్తుందదే. అందుకు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్ప‌వ‌చ్చు..!

taruna-1

త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరుతూ త‌రుణ ఫేస్‌బుక్‌లో ఉంచిన పోస్ట్ ఇదే..!

Comments

comments

Share this post

scroll to top