ఈ పెళ్లికూతురు పెళ్ళిలో బహుమతిగా వరుడిని ఏం కోరిందో తెలుసా?

నేటి త‌రుణంలో బంగారం అంటే ఎవ‌రికి ఆస‌క్తి ఉండ‌దు చెప్పండి. మ‌గ‌వారి క‌న్నా ఇంకా ఆడ‌వారికే దానిపై మ‌క్కువ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే సాధార‌ణ రోజుల్లోనే ఆడ‌వారు బంగారం అంటే అమిత‌మైన ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. ఇక పెళ్లి లాంటి శుభ కార్యాల విష‌యానికి వ‌స్తే ఆ ఆస‌క్తి ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. ఎక్కువ బంగారు న‌గ‌లు పెట్టుకుని తిర‌గాల‌ని అంద‌రూ అనుకుంటారు. ఇక పెళ్లి కూతురైతే అంద‌రికన్నా ఎక్కువ‌గా బంగారు న‌గ‌ల ప‌ట్ల ఇష్టం చూపుతుంది. ఎప్పుడెప్పుడు న‌గ‌లు పెట్టుకుందామా అని వేచి చూస్తారు. అయితే ఆ ఆస‌క్తి, ఇష్టం ఆడ‌వారికి స‌హ‌జ‌మే అనుకోండి. కానీ, ఆ యువ‌తి మాత్రం దాదాపు అంద‌రు ఆడ‌వాళ్ల‌కు విభిన్న‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే త‌న‌కు పెళ్లి కొడుకు ద్వారా ఎలాంటి బంగారం అక్క‌ర్లేద‌ని, తాను కోరుకుంది ఇస్తే చాల‌ని చెప్పింది ఆ యువ‌తి. ఇంత‌కీ ఆమె ఏం అడిగింది..? ఎందుకు బంగారాన్ని తిర‌స్క‌రించిందో తెలుసా..?

sahla

ఆమె పేరు సాహ్లా నెక్యిల్‌. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో పొలిటిక‌ల్ సైన్స్‌లో విద్య‌ను అభ్య‌సించింది. ఆమెది మ‌ళ‌యాళీ ముస్లిం కుటుంబం. కానీ బెంగుళూరులో నివాసం ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు పెళ్లి కూడా కుదిరింది. అయితే ముస్లిం సాంప్ర‌దాయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు మెహ‌ర్ రూపంలో ఆమె కోరుకుంది ఇచ్చే ఆచారం ఉంది. అయితే సాధార‌ణంగా ఏ ముస్లిం వివాహ వేడుక‌లోనైనా పెళ్లికూతురుకి బంగారు న‌గ‌ల‌నే మెహ‌ర్‌గా ఇస్తూ వ‌స్తున్నారు. కానీ చాలా మంది పెళ్లి కూతుర్లు త‌మ‌కు ఫ‌లానాది కావాల‌ని ఎప్పుడూ అడిగిన సంద‌ర్భాలు కూడా లేవ‌ట‌. అయితే సాహ్లా మాత్రం అంద‌రిక‌న్నా భిన్నంగా త‌న‌కు బంగారు న‌గలు వ‌ద్ద‌ని, అందుకు బ‌దులుగా త‌నకు కావ‌ల్సిన ఎంతో విలువైన ఓ 50 పుస్త‌కాల‌ను కొనివ్వాల‌ని వ‌రుడికి చెప్పింది. దీంతో మొద‌ట అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. కానీ సాహ్లా అలా అడిగినందుకు అంద‌రూ మెచ్చుకున్నారు.

సాధార‌ణంగా ముస్లిం వివాహ వేడుక‌ల్లో పెళ్లికూతురు మెహ‌ర్ రూపంలో పెళ్లి కొడుకును ఏదీ అడ‌గదు. కానీ ఆచారం ప్ర‌కార‌మైతే వ‌ధువు కోరిందే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆడ‌వారికి సొంతంగా ఆలోచించే, స్వేచ్ఛ‌గా మాట్లాడే హ‌క్కును ఇవ్వ‌కుండా, వారికి కేవ‌లం బంగారు న‌గ‌ల‌ను మాత్రమే ఇస్తూ, వారి హక్కును ఎంతో కాలంగా మ‌రుగున ప‌డేస్తూ వ‌చ్చార‌ని, అయితే తాను మాత్రం అలా కాద‌ని అందుకే బంగారానికి బ‌దులుగా పుస్త‌కాల‌ను అడిగాన‌ని సాహ్లా చెబుతోంది. దీంతో బంగారం కొనాల‌నే ఆందోళ‌న వ‌రుడి త‌ర‌ఫు కుటుంబంలో ఉండ‌ద‌ని, ఈ క్ర‌మంలో వారు ఎంతో ఒత్తిడి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని ఆమె చెబుతోంది. అయితే సాహ్లా అడిగిన‌ట్టుగానే ఆమెకు కాబోయే భ‌ర్త ఆమెకు కావ‌ల్సిన‌, ఆమె అడిగిన 50 పుస్త‌కాల‌ను బెంగుళూరు అంతా తిరిగి మ‌రీ కొని సాధించాడు. ఆమెకు మెహ‌ర్ రూపంలో ఇచ్చాడు. బంగారం ప‌ట్ల అంత‌టి నిరాస‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాక‌, మెహ‌ర్ విష‌యంలో ప్ర‌తి ముస్లిం యువ‌తి త‌న హ‌క్కును క‌చ్చితంగా తెలుసుకోవాల‌ని చాటి చెబుతున్న సాహ్లా ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top