చెడు కొలెస్ట్రాల్‌, గుండె స‌మ‌స్య‌లు, కిడ్నీ ప్రాబ్ల‌మ్స్ ఉన్న‌వారికి చ‌క్క‌ని ఔష‌ధం..!

చూడ చ‌క్క‌ని ఎరుపు రంగులో కంటికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డే దానిమ్మ పండ్లలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఉన్నాయి. విట‌మిన్ సి, ఇ, బిలు స‌మృద్ధిగా దొరికే పండ్ల‌లో ఇది కూడా ఒక‌టి. బీటా కెరోటిన్‌, ఫైబ‌ర్ వంటివి కూడా దానిమ్మ పండ్లలో ఎక్కువే. ఈ క్ర‌మంలో దానిమ్మ పండ్ల‌ను నిత్యం మ‌న ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో, దాని వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

pomegranate-and-juice

1. దానిమ్మ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల వాటిలో ఉండే ఔష‌ధాలు ర‌క్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొల‌గిస్తాయి. ర‌క్త నాళాల వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా పెరుగుతుంది. దీని వ‌ల్ల గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు.

2. జీవ‌క్రియ రేటు త‌క్కువ‌గా ఉన్న వారు దానిమ్మ పండ్ల‌ను తిన‌డం మంచిది. దీని వ‌ల్ల వారి శ‌రీర మెట‌బాలిక్ రేటు క్ర‌మ‌బ‌ద్దంగా ఉంటుంది. ఇది శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. డ‌యేరియా స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ఒక దానిమ్మ పండును తింటే చాలు. లేదంటే ఒక గ్లాస్ దానిమ్మ పండు జ్యూస్ తాగినా డ‌యేరియా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు .

4. కిడ్నీల్లో ఉన్న విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం దానిమ్మ పండ్ల‌ను తింటే మంచిది. దీని వ‌ల్ల మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి.

5. గ‌ర్భం దాల్చిన స్త్రీలు దానిమ్మ పండ్ల‌ను రెగ్యుల‌ర్‌గా తినాలి. దీంతో పుట్ట‌బోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు గ‌ర్భస్థ స‌మ‌యంలో త‌ల్లీ శిశువుల‌కు కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి.

6. దానిమ్మ పండ్లలో ఉండే ఔష‌ధ గుణాలు శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

7. దానిమ్మ పండ్లలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల ఇవి ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. తద్వారా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

8. లివ‌ర్‌లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గించాలంటే త‌ర‌చూ దానిమ్మ పండ్ల‌ను తినాలి. దీంతో లివ‌ర్ శుభ్రమ‌వుతుంది.

9. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు దానిమ్మ పండ్ల‌లో ఉన్నాయి. త‌ర‌చూ దానిమ్మ పండ్ల‌ను తింటుంటే క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

10. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో దానిమ్మ పండ్లు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.

Comments

comments

Share this post

scroll to top