మధ్యపానం,ధూమపానమే కాదు ఈ ప‌దార్థాలు కూడా లివ‌ర్ చెడిపోడానికి ప్ర‌ధాన కార‌ణాలు.

మద్యం సేవించడం మరియు ధుమపానం కాలేయాన్ని దెబ్బ తీస్తుందని అనే విషయం తెల్సిందే. ఇక తాజాగా తేలిన విషయం ఏమంటే మనం రోజూ తీసుకునే పదార్థాల వల్ల కూడా కాలేయం దెబ్బ తింటుంది. అతి అనర్ధదాయకం అని తెలిసినా కూడా కొన్ని పదార్దాలు తింటుంటాం… అలా తీసుకునే పదార్దాలు లివర్ ను దెబ్బతీస్తాయి..ఆ పదార్దాలు ఏంటో తెలుసుకొండి…

* కంటి చూపు బాగుండాలంటే విటమిన్‌ A ఉన్న పదార్దాలు తీసుకకుంటాం..కానీ  విటమిన్‌ A ఎక్కువగా తీసుకున్నా కాలేయంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*చక్కెర లేదా తీపి పదార్ధాలు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తినడం వల్ల శరీరం వినియోగించుకోగా మిగిలింది కాలేయంలో కొవ్వుగా నిల్వ ఉండి పోతుంది. దాంతో కొంత కాలానికి కాలేయం చెడి పోతుంది.

* కూల్‌ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత మంది చెప్పినా ఇప్పటీకీ చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటారు..కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం త్వరగా చెడి పోతుంది. కూల్‌ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి.

* ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాలు రుచిగా ఉండేందుకు మోనోసోడియం  గ్లుటమేట్‌ను వాడుతున్నారు. దీని పరిమాణం అధికమయినా కూడా కాలేయ సంబంధిత వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉంది.

* ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా  పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పువల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే.

* చిప్స్‌ వంటివి అధికంగా తిన్నా కూడా కాలేయానికి చాలా డేంజర్‌.. అందుకే ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఇప్పుడు చెప్పుకున్నవి తీసుకోవడం తగ్గించుకుంటే లివర్ నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top