వ్య‌వ‌సాయం చేసుకునే రైతు అత‌ను… ఓ సూప‌ర్ ఫాస్ట్ ట్రైన్‌కు ఓన‌ర్ .!!!

స‌క‌ల స‌దుపాయాలు, విలాసాల‌ను క‌లిగి ఉన్న బోగీలతో గంట‌కు 150 కిలోమీట‌ర్ల‌కు పైగా వేగంతో వెళ్లే రైలు అది. నిజంగా ఆ రైలులో ప్ర‌యాణించాలంటే ధ‌నికుల‌కే సాధ్య‌మ‌వుతుంది. అదే అలాంటి రైలును కొనాలంటే ఎన్నో కోట్లు ఖ‌ర్చవుతుంది. కానీ… ఆ రైతుకు మాత్రం అలాంటి రైలు ఒక‌టి న‌ష్ట ప‌రిహారం కింద అందింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఎవ‌రా రైతు..? ఏంటా సంఘ‌ట‌న‌..? వివ‌రాల్లోకి వెళితే…

అత‌ని పేరు సంపూర‌న్ సింగ్‌. పంజాబ్‌లోని జ‌లంధ‌ర్ అనే ప్రాంతంలో ఉన్న క‌టానా విలేజ్‌లో రైతు. వ్య‌వసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే 2007లో లూథియానా-చండీగ‌ఢ్ రైల్వే లైన్ కోసం రైల్వే శాఖ వారు సంపూర‌న్ సింగ్ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు గాను రూ.1.42 కోట్ల న‌ష్ట ప‌రిహారం చెల్లిస్తామ‌ని అత‌నికి చెప్పారు. అయితే రైల్వే శాఖ మాత్రం అత‌నికి కేవ‌లం రూ.42 ల‌క్ష‌ల‌ను మాత్ర‌మే చెల్లించింది. దీంతో ఈ విష‌యంపై సంపూర‌న్ సింగ్ లూథియానా కోర్టుకు ఎక్కాడు.

ఈ క్ర‌మంలో కోర్టులో కేసు నెగ్గిన సంపూర‌న్ సింగ్‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని న్యాయ‌మూర్తులు తీర్పు చెప్పారు. అయితే వారు అంత‌టితో ఆగలేదు, ఏకంగా లూథియానా రైల్వే జంక్ష‌న్‌లో ఆగే స్వ‌ర్ణ శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను సంపూర‌న్ సింగ్‌కు అందజేయాల‌ని, ఇక‌పై ఆ రైలుకు అత‌నే య‌జ‌మాని అని జ‌డ్జిలు తీర్పు చెప్పారు. దీంతో సంపూర‌న్ సింగ్ త‌న లాయ‌ర్‌తో క‌లిసి లూథియానా స్టేష‌న్‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో రైలు రాగానే దాని డ్రైవ‌ర్‌కు కోర్టు తీర్పు కాపీని అంద‌జేశాడు. దీంతో ఆ రైలు డ్రైవ‌ర్ త‌న ఉన్న‌తాధికారుల‌కు విష‌యం చెప్ప‌గా వారు వెంట‌నే అక్క‌డికి చేరుకుని రైలును సంపూర‌న్ సింగ్‌కు అప్ప‌గించారు. ఇప్పుడా రైలు ఆ స్టేష‌న్‌లోనే ఉంది. అయితే దాన్ని అత‌ను ఏం చేస్తాడ‌నేది ప్ర‌శ్న‌గానే ఉండిపోయింది. కాగా అక్క‌డి స్టేష‌న్ మాస్ట‌ర్‌, డివిజ‌న‌ల్ రైల్వే మేనేజ‌ర్‌లు మాత్రం రైలును అత‌ని నుంచి విడిపిస్తామ‌ని చెబుతున్నారు. చూద్దాం… ఇక ఏం జ‌రుగుతుందో..! ఏది ఏమైనా అంత పెద్ద రైలుకు అలా ఓన‌ర్ అయినందుకు సంపూర‌న్ సింగ్‌ను మ‌నం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top