పెళ్లికి అయ్యే డబ్బును గ్రామానికి తాగునీటి కోసం విరాళంగా ఇచ్చిన ఆద‌ర్శ కుటుంబం..!

సాధార‌ణంగా ఏ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల్లో అయినా పెళ్లి అంటే మాట‌లు కాదు. అందుకు చాలానే ఖర్చు అవుతుంది. ఇక ధ‌నికుల విష‌యానికి వస్తే ఆ ఖ‌ర్చు గురించి చెప్ప‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే మ‌నం ఊహించ‌ని స్థాయిలో వారు అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే మ‌హారాష్ట్ర‌కు చెందిన ఆ ధనిక కుటుంబం అలా కాదు. అధికంగా ఖర్చు పెట్టి వివాహ వేడుక‌ల‌ను జ‌రుపుకునే స్థోమ‌త ఉన్నా వారు డ‌బ్బును అలా వృథాగా ఖ‌ర్చు చేయ‌లేదు. అందుకు గాను వారు ఓ గ్రామంలో నీటి కొర‌త లేకుండా చేయాల‌ని అనుకున్నారు. త‌మ వివాహానికి అయ్యే ఖ‌ర్చుతో వారు ఆ గ్రామంలో ఓ ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటోంది.

jayanth-bhole

అత‌ని పేరు జ‌యంత్ భోలే. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన అత‌ని కుమారుడి వివాహాన్ని ఆయ‌న జ‌రిపించాడు. అయితే స్వ‌త‌హాగా భోలేది ధ‌నికుల కుటుంబం. అందుకు వారు త‌మ స్థోమ‌త‌కు త‌గిన‌ట్టుగా బాగా రిచ్‌గా పెళ్లి కూడా చేయ‌వ‌చ్చు. అయినా వారు ఎలాంటి హంగులు, ఆర్భాటాల‌కు పోలేదు. చాలా నిరాడంబ‌రంగా త‌న కొడుకు పెళ్లి చేశాడు. అయితే ఆ పెళ్లి కోసం వారు ఖ‌ర్చు పెట్టాల‌నుకున్న మొత్తాన్ని మాత్రం వారు మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్గావ్ జిల్లాలో ఉన్న వార్ఖెడ్ అనే గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఆ గ్రామంలో ప్ర‌జ‌ల తాగునీటి క‌ష్టాల‌ను తీర్చేందుకు గాను అక్క‌డ ఓ ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని భావించారు.

అందులో భాగంగానే జ‌యంత్ భోలే త‌న కుమారుడి పెళ్లికి అయ్యే మొత్తాన్ని ఖ‌ర్చు పెట్ట‌కుండా ఆ ఆర్వో ప్లాంట్ ఏర్పాటు కోసం విరాళంగా ఇచ్చేశాడు. ఆర్‌వో ప్లాంట్ నిర్మాణానికి అయ్యే రూ.1.70 ల‌క్ష‌ల‌ను సంబంధిత ప్లాంట్ కంపెనీకి అందించాడు. ఈ క్ర‌మంలో ఆ కంపెనీ వచ్చే నెల‌లో అక్క‌డ ప్లాంట్‌ను నిర్మించ‌నుంది. దీంతో ఆ గ్రామ వాసుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. త్వ‌ర‌లోనే అక్క‌డ ఆర్వో ప్లాంట్ నిర్మాణం పూర్తి కానుంది. అయితే జ‌యంత్ ఇప్పుడే కాదు, గ‌తంలోనూ అలాంటి గ్రామాల ప్ర‌జ‌ల తాగునీటి క‌ష్టాల‌ను తీర్చాడు. ట్యాంక‌ర్ల ద్వారా ఆ గ్రామ వాసులకు నీటిని స‌ర‌ఫ‌రా చేసి తానున్నానంటూ ఆదుకున్నాడు. ఏది ఏమైనా… జ‌యంత్ లాంటి ధ‌నికుడు పేద ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ఎరిగి అలా డ‌బ్బు విరాళం ఇవ్వ‌డం చాలా గొప్ప విష‌యం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top