ఇదీ ఎపిసోడ్ అంటే… నూతన్ నాయుడు వర్సెస్ తనీష్… కొట్టుకోవడం ఒకటే తక్కువ..!

బిగ్‌‌బాస్‌‌ హౌజ్‌‌లోకి కామన్‌‌మేన్‌‌గా నూతన్ నాయుడు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రారంభం రోజు నుంచి ఉన్నవారిలో కాసింత చురుగ్గానే ఉన్నాడు. అంతేకాదు ఏవిషయంలోనైనా సరే సీరియస్‌‌గా రియాక్ట్ అవుతూ హౌజ్‌‌లో హాట్‌‌ టాపిక్ అవుతుంటాడు. ఇక శుక్రవారం రోజు జరిగిన షో విషయానికొస్తే.. నూతన్ నాయుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఆయన కోపానికి హౌజ్‌లోని జనాలంతా నివ్వెరపోయారు. ఈయనేంట్రా బాబూ ఇలా రెచ్చిపోతున్నాడని అందరూ ముక్కున వేలేసుకునేంత పనైంది.


నటుడు సామ్రాట్ రెడ్డి- కామన్‌మేన్‌‌ నూతన్ నాయుడికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. నాయుడు ‘కుటుంబం’ గురించి సామ్రాట్ మాట్లాడటంతో.. “హేయ్.. నువ్వేంటి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావ్.. మంచిగా ఉండదు చెబుతున్నా. మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది” అంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంతలో కుర్ర హీరో తనీష్ జోక్యం చేసుకుని గొడవ జరగకుండా చేయాలని రావడంతో ఆయనపైకి కూడా నూతన్ ఒంటికాలుమీద లేచాడు. “మూస్కోని కూర్చో.. నువ్వేంటి మా మధ్యలో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా..” అని నాయుడు కన్నెర్రజేశాడు. దీంతో మరోసారి హౌజ్ సైలెంట్ అయిపోయింది. కామన్‌మేన్‌‌కి హౌజ్‌‌లో కష్టాలు తప్పట్లేదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top