65 వేల జీతం వచ్చే ఇంజనీర్ జాబ్ ను వదిలి క్యాబ్ డ్రైవర్ గా మారిన విజయ్.! అనారోగ్యంతో బాధపడే వారికి అతని క్యాబ్ ఓ అంబులెన్స్!

పెద్ద కంపెనీలో మెకానికల్ ఇంజినీర్ గా ఉద్యోగం.అయినా మనసుకి సంతృప్తి దొరకలేదు. ఆనందం కోసం వెతికాడు. తన మనసు ఏం చెప్పిందో అదే చేశాడు. గత 31 సంవత్సరాలుగా ట్యాక్సీ డ్రైవర్ గా అనారోగ్యంతో బాధపడుతున్న  రోగులను ఉచితంగా తన ట్యాక్సీలో తీసుకెళ్తున్నాడు. ఒక్క పైసా కూడా తీసుకోడు. కారణం ఏమిటంటే తన భార్యే అని చెబుతాడు మెకానికల్ ఇంజినీర్ నుండి రిటైర్మెంట్   తీసుకున్న విజయ్ థాకూర్.  మహారాష్ట్రలోని ముంబై వీధులలో విజయ్ థాకూర్ గురించి, ఆయన నడిపే ట్యాక్సీ గురించి బహుశా తెలియని వారుండకపోవచ్చు. తన ట్యాక్సీపై ఒక కొటేషన్ కనిపిస్తూ ఉంటుంది. ‘అనారోగ్యంతో ఉన్నవారిని ఉచితంగా హాస్పిటల్ కు తీసుకెళ్లబడును’అని.  అది కూడా ఎటువంటి సమయమైనా సరే అస్సలు ఆలోచించడు, నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు.

vijay-thakur

ఒకప్పుడు ప్రముఖ సంస్థ లార్సెన్  అండ్ టర్బోలో మెకానికల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న  విజయ్ థాకూర్, ప్రస్తుతం ట్యాక్సీ డ్రైవర్ గా తనకు ఆత్మసంతృప్తినిచ్చే పనిలో ఉన్నానని గర్వంగా చెప్పుకుంటాడు. 31 ఏళ్ళుగా ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఈయన మొదట బ్లాక్ అండ్ ఎల్లో ఫియట్ కారు,ప్రస్తుతం హుండాయ్ సాంట్రో కారును నడుపుతున్నాడు. తను ట్యాక్సీ డ్రైవర్ గా మారడానికి గల కారణాలము చెప్పుకొస్తున్నాడు.
1984లో ఒకరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తన భార్య సరోజ్ థాకూర్ నొప్పులతో బాధపడుతోంది. కడుపులో నొప్పి ఎక్కువ కావడంతో ట్యాక్సీని తీసుకురావడానికి వెళ్ళాడు. చాలాసేపు ట్యాక్సీ కొరకు ప్రయత్నించాడు కానీ ఎవరు కూడా ఆ టైంలో రావడానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత తనే హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. ఆ సమయంలో పుట్టినదే ఈ ఫ్రీ ట్యాక్సీ ఫర్ ఎమర్జన్సీ హాస్పిటలైజ్ద్ పేషెంట్స్’. వెంటనే తన ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి రూ.66000 ఫియట్ కారును తీసుకున్నాడు. తన భార్య సరోజ్ పేరు మీదుగా అనారోగ్యంతో, ఎమర్జెన్సీ  అవసరమైన వారికి ఉచితంగా సేవలందిస్తున్నాడు థాకూర్. రోడ్ ప్రమాదాలు, ఇతర ఏ సమస్య వచ్చినా సరే అర్ధరాత్రి అని ఆలోచించకుండా నాకు ఫోన్ చేయండి,. మీకు సహాయం చేయడానికి నేను వస్తాను అని చెబుతున్నాడు 62 ఏళ్ళ విజయ్ థాకూర్. అయితే ఒకప్పుడు నెలకు 65000 సంపాదించే థాకూర్ ప్రస్తుతం 10000 సంపాదిస్తున్నా చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు.
hqdefault
ఇక మామూలు సమయంలో థాకూర్ కొన్ని కళాశాలకు తన ట్యాక్సీని తిప్పుతూ ఉంటాడు. మేనేజ్ మెంట్ కాలేజ్ ఒకటి. ఆ కాలేజ్ ఉపాధ్యాయులను, విద్యార్థులను తీసుకెళ్తూ మేనేజ్ మెంట్ స్కిల్స్ నేర్చుకునేవాడు. అలా నేర్చుకున్న విషయాలను ఒక చిన్న మోడల్ స్కూల్ గా పెట్టి, నైట్ డ్యూటీ చేసే వాచ్ మెన్ లు మరియు తనతోటి ట్యాక్సీ డ్రైవర్ లతో పంచుకునేవాడు. అలా చెప్పిన దానికి రూ.20 తీసుకునేవాడు. ఆ డబ్బును అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల వైద్యనిమిత్తంవినియో గించేవాడు.
ఒకసారి తన కొడుకుకు జబ్బు చేయగా ఆపరేషన్ చేయడానికి 43000 కట్టవలసి వచ్చింది. అయితే 43000 ఉన్నాయనుకొని ఉన్న డబ్బులను హొస్పిటల్ లో క్యాషియర్ కి ఇచ్చాడు. అందులో రు.10 తగ్గింది. అమౌంట్ కట్టందే ఆపరేషన్ చేయమని అతడు చెప్పాడు. ఇంతలో వేరే అతను వచ్చి రు. 10 ఇచ్చాడు. తన కొడుకు 1999లో చర్మం బాడీ నుండి వేరయ్యే వ్యాధితో బాధపడుతూ చనిపోయాడు. అయితే అప్పుడు అతడికి వైద్యం చేయించడానికి సరిపడా డబ్బు లేదని తన కొడుకు ఆపరేషన్ కు సహకరించినట్లు గుర్తుచేసుకున్నాడు. తనకు బీపీ, షుగర్ ఉన్నాయట. చేతులు, కాళ్ళు కూడా వాపులుగా ఉన్నాయట. ఎప్పుడుపడితే అప్పుడే బయటకు వెళ్తాడు. అయినా సరే మాతో హ్యాపీ గా ఉంటాడని విజయ్ భార్య సరోజ్, ఆయన కొడుకు ఆయన చేస్తున్న వృత్తిపట్ల ఆనందంగా ఉన్నారు.
mumbaitaxihospital
థాకూర్ పెద్ద కొడుకు వినీత్ మరియు ఆయన కోడలు దీప్తిలు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంచి జీతం సంపాదిస్తున్నారు. అలా తన కొడుకు స్విఫ్ట్ కారు కొనివ్వగా, థాకూర్ తిరస్కరించాడు. ఎందుకంటే తను నడుపుతున్న సాంట్రో కారు గ్యాస్ తో నడిచేది, ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే తన కొడుకు ఆయనను ఇక ట్యాక్సీ డ్రైవర్ గా రిటైర్ అవ్వమని చెప్పినా ఆయన వినలేదు. నేను చేస్తున్న పనిలో నాకు సంతోషం ఉంది. పదిమందికి అండగా నిలబడుతున్నాను. దానికి ఉదాహరణగా డిసెంబర్ 31 రాత్రి ఒక కుటుంబం కారు ప్రమాదానికి గురైంది. ఆ టైంలో ఎవరు  హడావిడిలో వారున్నారు. నాకు అప్పుడు ఫోన్ వచ్చింది. వారందరినీ ఆర్ యెన్ కూపర్ హాస్పిటల్ కు తీసుకెళ్ళాను కానీ అందులో ఒక్క మహిళ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలతో బయటపడ్డవాళ్ళు ఆదుకున్నoదుకు నాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మనిషి ప్రాణం విలువ ముందు డబ్బెంత అనిపించింది. చాలామంది నా తోటి ట్యాక్సీ డ్రైవర్స్ డబ్బుతీసుకోమని చెబుతారు. కానీ నా మనసు మాత్రం ఒప్పుకోదు. ఇప్పుడు కొందరైతే నేను చేస్తున్న పనికి గౌరవిస్తూ నా రూట్ లో వాళ్ళు వెళ్తున్నారని.. ఇంతచేస్తున్నా ఏమాత్రం గర్వంలేకుండా చెబుతున్నాడు విజయ్ థాకూర్.

Comments

comments

Share this post

scroll to top