నిత్యం సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం… ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హాస్పిటల్స్‌కు పరిగెత్తుతూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా ఆరోగ్యాలు బాగుపడడం లేదు సరికదా శరీరం ఇంకా ఇతర రోగాల బారిన పడుతూనే ఉంది. ఈ క్రమంలో కింద ఇచ్చిన ఓ అద్భుతమైన ఆరోగ్య చిట్కాను పాటిస్తే మనం ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1.1 కిలోల బీట్రూట్, అర కేజీ క్యారెట్, కొన్ని నారింజలు, యాపిల్స్, 1 కిలో తేనెలను తీసుకుని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టాలి. దీంతో చిక్కని ఎరుపు రంగులో ఉండే ఓ ద్రవం తయారవుతుంది. దీన్ని ఓ బాటిల్లో నిల్వ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో ఈ ద్రవాన్ని తాగాలి.
ఇలా చేయడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ ఎంతో పటిష్టమవుతుంది. డిప్రెషన్, క్యాన్సర్ వంటి వ్యాధులు దూరమవుతాయి. రక్తం వృద్ధి చెందుతుంది. శరీరానికి కొత్త శక్తి అంది ఎంతో ఉత్తేజంగా ఉంటారు. అలసట కూడా దూరమవుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది.