ఈ డాక్ట‌ర్ ఏకంగా 1 ల‌క్ష మందికి పైగా ఉచితంగా కంటి ఆప‌రేషన్లు చేశారు తెలుసా..?

కంటిలో కొంద‌రికి వ‌చ్చే శుక్లాల‌కు కాటారాక్ట్ ఆప‌రేషన్ చేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే డ‌బ్బున్న వారికి ఈ ఆప‌రేష‌న్ చాలా తేలిక‌గా అవుతుంది. కానీ డ‌బ్బు లేని వారికి శుక్లాల ఆప‌రేష‌న్ పెద్ద స‌మ‌స్య అవుతుంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది పేద‌ల‌కు మ‌న దేశంలో కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు అప్పుడ‌ప్పుడు ఉచితంగా శుక్లాల ఆప‌రేష‌న్ చేయిస్తాయి. అయితే ఇలాంటి ఆప‌రేష‌న్ల‌ను ఆ డాక్ట‌ర్ 1 ల‌క్ష‌కు పైగానే చేశారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అది కూడా ఉచితంగా. అవును, క‌రెక్టే. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే…

ఆయ‌న పేరు సందుక్ రుయిట్‌. వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాలు. నేపాల్ వాసి. అక్క‌డే పుట్టి పెరిగారు. వైద్య విద్య‌ను అభ్య‌సించారు. అయితే సందుక్ ది పేద కుటుంబం. ఆయ‌న చాలా క‌ష్ట‌పడి డాక్ట‌ర్ అయ్యారు. అందులో కంటి స్పెష‌లిస్టుగా కోర్సు పూర్తి చేశారు. ఈ క్ర‌మంలోనే ఓ రోజు ఆయ‌నకు ఓ సంఘ‌ట‌న ఎదురైంది. ఆయ‌న ఓ మ‌హిళ‌కు కంటి ఆప‌రేష‌న్ చేయ‌గా అది విజ‌య‌వంతం అయింది. దీంతో ఎన్నో ఏళ్లుగా చూపుకు నోచుకోని ఆ మ‌హిళ ఎట్ట‌కేల‌కు ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం కావ‌డంతో ఆమెకు చూపు వ‌చ్చింది. దీంతో ఎన్నో ఏళ్ల త‌రువాత ఆమె త‌న కూతుర్ని తొలిసారిగా చూసుకుని మురిసిపోయింది. అప్పుడు సందుక్ అక్క‌డే ఉన్నారు. ఆ క్ష‌ణంలో ఆయ‌న ఉద్వేగ‌భరితుడ‌య్యాడు. దీంతో అప్ప‌టి నుంచి అనేక మంది పేద‌ల‌కు ఉచితంగా కంటి శుక్లాల ఆప‌రేష‌న్లు చేయ‌డం మొదలు పెట్టారు.

సందుక్ కేవ‌లం నేపాల్‌లోనే కాదు, అనేక దేశాల్లో అలా ఉచితంగా కంటి శుక్లాల ఆప‌రేష‌న్లు చేశారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో ఆయ‌న ఈ కార్యక్ర‌మం చేస్తున్నారు. అలా ఇప్పటి వ‌ర‌కు సందుక్ ఏకంగా 1 ల‌క్ష మందికి పైగా కంటి ఆప‌రేషన్లు చేసి వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించారు. దీంతో ఆయ‌న‌పై అనేక మంది డాక్యుమెంట‌రీలు తీశారు. ఇక ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం అయితే సందుక్ చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా అక్క‌డి కంటి సంబంధ వైద్య విభాగానికి హాన‌ర‌రీ ఆఫీస‌ర్‌గా ఆయ‌న్ను నియ‌మించింది. ఈ క్ర‌మంలో సందుక్ తాను చేసిన సేవ‌ల‌కు గాను ఎన్నో అవార్డుల‌ను కూడా అందుకున్నారు. అయినా ఇప్పటికీ ఆయ‌న కంటి ఆప‌రేషన్ల‌ను చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా సందుక్ లాంటి వారు మ‌న‌కు చాలా అరుదుగా క‌నిపిస్తారు క‌దా. ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top