ఈ డాక్ట‌ర్ క‌నిపెట్టిన ప‌రిక‌రంతో కంటి శుక్లాల ఆప‌రేష‌న్‌ను కేవ‌లం 2 నిమిషాల్లోనే చేయ‌వ‌చ్చు తెలుసా..!

Cataract (కటారాక్ట్‌). దీన్నే శుక్లం అని కూడా అంటారు. ఇది వ‌స్తే క‌ళ్లు క‌నిపించ‌వు. నేడు మ‌న దేశంలో చాలా మంది కంటిలో శుక్లాల కార‌ణంగా బాధ ప‌డుతున్నారు. వారిలో పేద‌లే అధికం. స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఎక్కువ స‌మ‌యం పాటు సూర్య‌కాంతిలో ఉండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి కళ్ల‌లో శుక్లాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే ఒక్క‌సారి క‌ళ్ల‌లో శుక్లాలు గ‌న‌క వ‌స్తే వాటిని ఆప‌రేష‌న్ చేసి మాత్ర‌మే తీసేయాలి. కానీ అందుకు చాలా ఖ‌ర్చ‌వుతుంది. దీనికి తోడు ఆప‌రేష‌న్ అయ్యాక, చాలా స‌మ‌యం విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం. అప్పుడు వాడే మందులు కూడా ఖ‌రీదు గ‌ల‌వి అయి ఉంటాయి. ఈ క్ర‌మంలో పేద‌ల‌కు శుక్లాల ఆప‌రేషన్ చేయించుకోవ‌డం క‌ష్టంగా మారింది. కేవ‌లం చారిట‌బుల్ ట్ర‌స్ట్‌ల ద్వారా మాత్ర‌మే వారు ఆ ఆప‌రేష‌న్లు చేయించుకుంటున్నారు. అయితే సాధార‌ణ ఆస్ప‌త్రుల‌లోనూ చాలా త‌క్కువ ఖ‌ర్చుతో శుక్లాల ఆప‌రేష‌న్ చేసేందుకు వీలుగా ఆ డాక్ట‌ర్ ఓ నూత‌న ప‌రిక‌రం క‌నిపెట్టాడు. దాని పేరే Ranjan MSICS marker.

రంజ‌న్ అనే వైద్యుడు తాను కనిపెట్టిన ఆ ప‌రిక‌రానికి Ranjan MSICS marker అని పేరు పెట్టాడు. డాక్ట‌ర్ ప్ర‌త్యూష్ రంజ‌న్ న్యూఢిల్లీలోని వ‌ర్ధ‌మాన్ మ‌హావీర్ మెడిక‌ల్ కాలేజీ అండ్ సఫ్దార్ జంగ్ హాస్పిటల్‌లో ఆప్తాల్మాల‌జీ లో పీజీ విద్య‌ను అభ్య‌సించాడు. దీంతోపాటు యూకేలోని ఫ్రీమ్యాన్ హాస్పిట‌ల్‌, మ‌న దేశంలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సీతాపూర్ ఐ హాస్పిట‌ల్‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే డాక్ట‌ర్ రంజ‌న్ కంటిలో ఏర్ప‌డే శుక్లాల‌ను తొల‌గించే స‌ర్జ‌న్ గా ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టాడు. అయితే పేద‌లు ఆ ఆప‌రేష‌న్ చేయించుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని అత‌ను గుర్తించాడు. దీంతో శుక్లాల‌ను తొల‌గించే ఆప‌రేష‌న్ ను వేగంగా చేసేందుకు గాను ఓ నూత‌న ప‌రిక‌రాన్ని క‌నిపెట్టాడు. దానికి Ranjan MSICS marker అని పేరు పెట్టాడు.

డాక్ట‌ర్ రంజ‌న్ క‌నిపెట్టిన Ranjan MSICS marker ద్వారా కంటి శుక్లాల ఆప‌రేష‌న్‌ను కేవ‌లం 2 నిమిషాల్లోనే చేయ‌వ‌చ్చు. అంతేకాదు, ఈ ఆప‌రేష‌న్‌కు చాలా త‌క్కువ ఖ‌ర్చు అవుతుంది. దాన్ని పేద‌లు భ‌రించ‌గ‌ల‌రు కూడా. ఇలా ఆ మార్క‌ర్ ద్వారా ఆప‌రేష‌న్ చేస్తే చాలా త్వ‌ర‌గా ఇంటికి వెళ్ల‌వ‌చ్చు కూడా. ఈ క్ర‌మంలోనే డాక్ట‌ర్ రంజ‌న్ సొంతంగా ది అశోకా ఫౌండేష‌న్ అనే స్వచ్ఛంద సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా పేద‌ల‌కు ఉచితంగా కంటి శుక్లాల ఆప‌రేష‌న్ల‌ను చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఆప‌రేషన్ అనంత‌రం అవ‌స‌ర‌మ‌య్యే మందుల‌ను కూడా అత‌ను ఉచితంగానే పంపిణీ చేస్తున్నాడు. దీంతో డాక్ట‌ర్ రంజ‌న్ త‌యారు చేసిన ప‌రిక‌రాన్ని ఇత‌ర కంటి వైద్యులు కూడా వాడ‌డం మొద‌లు పెట్టారు. ఎప్ప‌టికైనా దేశంలో శుక్లాలతో బాధ‌ప‌డే వారి సంఖ్య పూర్తిగా లేకుండా చేయాల‌నేదే త‌న ల‌క్ష్య‌మ‌ని అంటున్నాడు డాక్ట‌ర్ రంజ‌న్‌. అత‌ని ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top