రైతు కుటుంభంలో జన్మించిన ఆమె..రైతు సమస్యలు తీర్చాలని ఏం చేసారో తెలుసా..? ఎక్కడున్నా ఆమె లక్ష్యం ఒక్కటే..!

ప్ర‌జ‌లకు సేవ చేసేందుకు, వారికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రించేందుకు జిల్లా క‌లెక్ట‌ర్లు ఉంటారు. అయితే అంద‌రూ ఒకేలా ప‌నిచేయ‌రు క‌దా. కొంద‌రు అంతంత మాత్రంగా ప‌నిచేస్తే కొంద‌రు అటు, ఇటుగా ఉంటారు. ఇంకొంద‌రు కేవ‌లం నాయ‌కుల సేవ‌లోనే త‌రించిపోతారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ లేడీ క‌లెక్ట‌ర్ మాత్రం అలా కాదు. ఆమె ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చే మ‌న‌స్సున్న మ‌నిషి. అక్ర‌మార్కుల గుండెల్లో సింహ స్వ‌ప్నం. ఆమే… రోహిణి భాజీబాకరే. త‌మిళ‌నాడులోని సేలం జిల్లా క‌లెక్ట‌ర్‌.

రోహిణి భాజీబాక‌రేది మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లాలో ఉన్న ఉప్లాయ్ గ్రామం. ఆమె ఆ మారుమూల గ్రామంలోనే జన్మించింది. రైతు కుటుంబం నుంచి వ‌చ్చింది. క‌నుక‌నే ఆమెకు రైతులు, సాధార‌ణ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసు. అయితే వారికి త‌న వంతుగా ఏదైనా ఒకటి చేయాల‌నుకుంది. వారి స‌మ‌స్య‌ల‌ను తీర్చేలా ప్ర‌భుత్వ అధికారి కావాల‌నుకుంది. అందులో భాగంగానే క‌లెక్ట‌ర్ అవ్వాల‌నుకుంది. దీంతో ఆ కోర్సు కోసం క‌ష్ట‌ప‌డి చ‌దివింది. కోచింగ్ లేకుండా సివిల్స్ రాసి ప‌రీక్ష‌ల్లో టాప‌ర్‌గా నిలిచింది. ఐఏఎస్ అధికారిణి అయింది. అందులో భాగంగానే రోహిణి మొద‌ట స‌బ్ క‌లెక్ట‌ర్ గా మ‌ధురై జిల్లాకు ప‌నిచేసింది.

అయితే స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన‌ప్పుడే రోహిణి చాలా మంచి ప‌నులు చేసింది. ఉపాధి హామీ ప‌నుల‌ను రికార్డు స్థాయిలో చేయించింది. దీంతో మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచేందుకు ఇంకుడు గుంత‌లు, చెక్ డ్యాంలు వంటి నిర్మాణాల‌ను చురుగ్గా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో నీళ్లు బాగా రావ‌డంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వారికి వ్య‌వ‌సాయానికి ఉన్న నీటి ఇబ్బందులు తొల‌గిపోయాయి. కాగా రోహిణి కృషి వ‌ల్ల మ‌ధురై జిల్లా ఆ రాష్ట్రంలోనే మొద‌టి బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హిత ప్రాంతంగా జాబితాలోకి ఎక్కింది. ప్ర‌జ‌ల‌ను టాయిలెట్లు నిర్మించుకునే దిశ‌గా ఆమె అన్నివిధాలా శ్ర‌మ‌ప‌డ్డారు. టాయిలెట్ల వాడ‌కం, అవి లేక‌పోతే క‌లిగే దుష్ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. దీంతో అక్క‌డ నూటికి నూరు శాతం మ‌రుగుదొడ్లు నిర్మాణ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఉన్న‌తాధికారుల ప్ర‌శంస‌ల‌ను కూడా రోహిణి అందుకున్నారు.

అనంత‌రం రోహిణి అదే రాష్ట్రంలో సేలం జిల్లాకు క‌లెక్ట‌ర్ అయ్యారు. ఇప్ప‌టికీ అక్క‌డే ఆ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్రాంతం మారినా ఆమె ప‌ని, ల‌క్ష్యం మాత్రం ఒక్క‌టే. సాధార‌ణ ప్ర‌జ‌లు, రైతుల క‌ష్టాల‌ను తీర్చ‌డ‌మే ధ్యేయం. అందుకే ఆమె ప‌నిచేశారు. అయితే సేలంలో గ‌తంలో 170 మంది క‌లెక్ట‌ర్లు ప‌నిచేశారు. కానీ వారిలో ఒక్క మ‌హిళ కూడా లేరు. రోహిణియే ఆ జిల్లాకు మొద‌టి లేడీ క‌లెక్ట‌ర్‌. అయిన‌ప్ప‌టికీ త‌న వంతు బాధ్య‌త‌ను ఆమె చ‌క్క‌గా నిర్వ‌ర్తించారు. ఆ జిల్లాలో అక్ర‌మార్కుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి స‌రిగ్గా ప‌నిచేయ‌ని డాక్ట‌ర్లు, నర్సుల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. స‌రిగ్గా ప‌నిచేసే వారిని ఆమె ప్రోత్స‌హిస్తున్నారు. అవ‌స‌రం అయిన మేర‌కు సూచ‌న‌లు కూడా ఇస్తుంటారామె. ఈ క్ర‌మంలో ఆమె కేవ‌లం ఆఫీసుకే ప‌రిమితం కారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నాల మ‌ధ్యలోనే ఉంటారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డ‌మే ప్ర‌ధాన అజెండాగా ఆమె ప‌నిచేస్తారు. ఏది ఏమైనా ఇలాంటి ఐఏఎస్ ఆఫీస‌ర్లే క‌దా.. అంద‌రికీ కావాల్సింది..!

Comments

comments

Share this post

scroll to top