వైజాగ్ విద్యార్థులు త‌యారు చేసిన ఆ ప‌రిక‌రంతో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఆంబులెన్స్ ఇట్టే వెళ్లిపోతుంది..!

నేటి త‌రుణంలో గ్రామాలు, ప‌ట్టణాల్లోనే అక్క‌డక్క‌డా ట్రాఫిక్ ర‌ద్దీ ఉంటోంది. ఇక న‌గ‌రాల సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లి గ‌మ్య‌స్థానానికి చేరుకోవాలంటే గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో నిరీక్షించాల్సి వ‌స్తోంది. మ‌ళ్లీ ఇంటికి తిరిగి రావాల‌న్నా అదే ప‌రిస్థితి. దేశంలోని అనేక న‌గ‌రాల్లో ట్రాఫిక్ విష‌యంలో దాదాపుగా ఇదే ప‌రిస్థితి నెలకొంది. ఈ క్ర‌మంలో సాధార‌ణ వాహ‌నాల మాట అటుంచితే ప్రమాదాల్లో గాయ‌ప‌డ్డ వారిని ఆంబులెన్స్‌ల‌లో హాస్పిట‌ల్స్‌కు త‌ర‌లించడం చాలా క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. దీంతో ఎంతో విలువైన మ‌నిషి ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తోంది. స‌హ‌జంగా ఎవ‌రికైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే ఏదైనా ప్ర‌మాదం జ‌రిగినా వారిని వీలైనంత త్వ‌ర‌గా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాల్సి ఉంటుంది. ఇందుకు క‌నీస వ్య‌వ‌ధి 8 నుంచి 28 నిమిషాలు. ఆ లోప‌లే బాధితుల్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తే వారు ప్రాణాపాయం నుంచి గ‌ట్టెక్కే ప‌రిస్థితి ఉంటుంది. కానీ నేడు న‌గ‌రాల్లో ఉన్న ట్రాఫిక్ ర‌ద్దీ కార‌ణంగా ఆంబులెన్స్‌ల‌లో బాధితుల‌ను త‌ర‌లించాలంటే అందుకు గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. దీంతో వారు ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తోంది. అయితే ఇలాంటి బాధ‌లు లేకుండా బాధితుల‌ను వెంట‌నే ఆంబులెన్స్‌ల‌లో హాస్పిట‌ల్‌కు చేర్చేలా వైజాగ్‌కు చెందిన ప‌లువురు విద్యార్థులు ఓ కొత్త ర‌క‌మైన సాంకేతిక ప‌రిక‌రాన్ని క‌నిపెట్టారు. దాంతో చాలా వేగంగా బాధితుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించ‌వ‌చ్చు.

108-ambulance

వైజాగ్‌కు చెందిన ఇంజ‌నీరింగ్ విద్యార్థులు చ‌ర‌ణ్ ఆరాధ్యుల‌, రామ్ సుభాష్‌, సంతోష్ వ‌ర్మ‌, రోహి జోసెఫ్‌, ప్ర‌శాంత్ అవ‌ధానిలు టీంగా ఏర్ప‌డి గ్రీన్‌లైన్ ల్యాబ్స్ అనే ఓ స్టార్ట‌ప్‌ను ఏర్పాటు చేశారు. వీరి బృందానికి విష్ణు అయ్య‌గారి సీఈవోగా నేతృత్వం వ‌హిస్తున్నాడు. కాగా వీరికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతోపాటు సింగ‌పూర్‌కు చెందిన గోవిన్ క్యాపిట‌ల్ ఆర్థిక స‌హకారం అందించింది. దీంతో వారు ట్రాఫిక్ బారి నుంచి త‌ప్పించుకుని ఆంబులెన్స్‌ల‌ను వేగంగా పంపించేందుకు ఉపయోగ‌ప‌డే డివైస్‌ను ఆవిష్క‌రించారు. ఈ ప్రోటోటైప్ డివైస్‌లో రెండు సెన్సార్లు ఉంటాయి. ఒక సెన్సార్ ఆంబులెన్స్‌కు ఉంటుంది. మ‌రో సెన్సార్‌ను ట్రాఫిక్ సిగ్న‌ల్స్‌కు ఫిట్ చేస్తారు. ఈ క్ర‌మంలో ఏదైనా యాక్సిడెంట్ జ‌రిగితే ఆంబులెన్స్‌లో ఉన్న సెన్సార్ ద్వారా డ్రైవ‌ర్ యాక్సిడెంట్ జ‌రిగిన స్పాట్‌కు వెంట‌నే వెళ్లేందుకు వీలుంటుంది. అలా వెళ్లిన ఆంబులెన్స్ బాధితున్ని ఎక్కించుకోగానే అందులో ఉన్న సెన్సార్ త‌నకు 500 నుంచి 700 మీట‌ర్ల దూరంలో ట్రాఫిక్ సిగ్న‌ల్‌కు ఫిట్ చేయ‌బ‌డి ఉన్న మ‌రో సెన్సార్‌కు సిగ్నల్ పంపుతుంది. దీంతో స‌ద‌రు ట్రాఫిక్ సెన్సార్ సిగ్న‌ల్‌ను గ్రీన్‌గా మార్చుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆంబులెన్స్ వెంట‌నే వెళ్లేందుకు మార్గం సుగ‌మం అవుతుంది.

students

అయితే ఆ ఇంజ‌నీరింగ్ విద్యార్థులు త‌యారు చేసిన ఈ డివైస్ ఇప్పుడు బీటా ద‌శ‌లో ఉంది. ఓ హాస్పిట‌ల్‌కు స‌ద‌రు డివైస్‌ను బిగించి దాన్ని టెస్ట్ చేసే ప‌నిలో ఉన్నారు ఆ విద్యార్థులు. ఈ ఏడాది చివ‌రి క‌ల్లా ఆ డివైస్ అందుబాటులోకి రానుండ‌గా, మొద‌ట‌గా ఓ సిటీలో 25 ఆంబులెన్స్‌ల‌లో ఆ డివైస్‌ను ఇన్‌స్టాల్ చేయ‌నున్నారు. అనంతంరం అన్ని న‌గ‌రాల‌కు విస్త‌రించేలా త‌మ ప్రాజెక్టును మ‌రింత ముందుకు తీసుకెళ్తామ‌ని ఆ విద్యార్థులు అంటున్నారు. ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఆధారంగా చేసుకుని త‌మ డివైస్ ప‌నిచేస్తుంద‌ని వారు అంటున్నారు. నిజంగా, ఇలాంటి డివైస్‌లు అందుబాటులోకి వ‌స్తే అప్పుడు ఇక ఆంబులెన్స్‌లు వెంట‌నే ఆస్ప‌త్రుల‌కు చేరుకుంటాయి. దీంతో బాధితుల‌ను ప్రాణాపాయ స్థితి నుంచి ర‌క్షించేందుకు వీలు క‌లుగుతుంది. ఇలాంటి డివైస్‌ల‌ను త‌యారు చేసిన ఆ విద్యార్థుల‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top